లిప్‌లాక్‌కు ఓకే కానీ.. | Priya Bhavani Shankar Agreed To ACt In Lip Lock Scenes | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

Published Wed, Jun 19 2019 7:11 AM | Last Updated on Wed, Jun 19 2019 7:11 AM

Priya Bhavani Shankar Agreed To ACt In Lip Lock Scenes - Sakshi

చెన్నై : బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్‌ అయ్యి కథానాయికలుగా నిలదొక్కుకున్న వారు అరుదే. అలాంటి నటీమణుల్లో ప్రియా భవానీశంకర్‌ ఒకరు. బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఆస్ట్రేలియాలో సెటిల్‌ అవ్వాలని భావించింది. దీంతో ఆమె నటిస్తున్న కల్యాణం ముదల్‌ కాదల్‌ వరై సీరియల్‌ నుంచి వైదొలిగింది. అయితే ఆమె నటనకు దూరం కావడాన్ని ప్రేక్షకులు ఇష్టపడలేదు. అలా నటనను కొనసాగించిన ప్రియా భవానీశంకర్‌ మేయాదమాన్‌ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ మధ్య నటుడు కార్తీతో కడైకుట్టిసింగంతో, ఇటీవల నటుడు ఎస్‌జే.సూర్యకు జంటగా మాన్‌స్టర్‌ చిత్రాల్లో నటించి సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది.

ఇలా హీరోయిన్‌గా సక్సెస్‌ బాటలో పయనిస్తున్న ప్రియా భవానీశంకర్‌ తాజాగా ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఆ ఫొటో ఇప్పుడు అభిమానుల మతి పోగొడుతోంది. ఫొటోలో ఉన్నది ప్రియ భవానీశంకరేనా? ఇంత అందంగా ఉంటుందా? అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రియ నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తెగ ఖుషీ  అవుతోంది. కొందరైతే తల(నటుడు అజిత్‌)కు జంటగా నటిస్తే చూడాలనుందనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఒక భేటీలో లిప్‌లాక్‌ సన్నివేశాలు, బికినీ దుస్తులు ఈ రెండింటిలో ఒక దాంటో నటించాలంటే దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు ప్రియాభవానీశంకర్‌ స్పందిస్తూ లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడానికైనా ఒప్పుకుంటాను కానీ బికినీ దుస్తుల్లో నటించడానికి ఎంత మాత్రం  ఒప్పుకోనని ఖరాకండీగా చెప్పింది. అంతే కాదు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదని, తనకు నచ్చిన కథ పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు ఈ అమ్మడు పేర్కొంది. మొత్తం మీద లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అని దర్శక నిర్మాతలకు ప్రియాభవానీ శంకర్‌ బహిరంగంగానే చెప్పేసిందన్నమాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement