ఈమె ముద్దు చాలా కాస్ట్లీ | Lakshmi Menon charges Rs.10 Lakhs per kiss | Sakshi
Sakshi News home page

ఈమె ముద్దు చాలా కాస్ట్లీ

Published Thu, May 15 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

ఈమె ముద్దు చాలా కాస్ట్లీ

ఈమె ముద్దు చాలా కాస్ట్లీ

ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అంటూ పాత కాలపు హీరోలు పాడుకునేవారు. ఇప్పుడలాంటి అవసరం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాల్లోనూ చుంబనాల దృశ్యాలుంటున్నాయి. లిప్‌లాక్‌లకు నేటి తరం హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కాకపోతే వాటికంటూ ఒక రేటును డిమాండ్ చేస్తున్నారంతే. తాజాగా ఈ తరహా వ్యాపారంలో నటి లక్ష్మీ మీనన్ ముందంజలో ఉన్నారు. కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ భామ ఆ చిత్రంలో ఒంటినిండా దుస్తులు ధరించి కొండ ప్రాంత పడుచుగా నిండుగా కనిపించింది. బొద్దుగా ముద్దు గా బాగుందనిపించింది. అదే సమయంలో కుంకీ చిత్రం విజయం సాధించడంతో కోలీవుడ్‌కు మరో పక్కింటి అమ్మాయిలా మంచి హీరోయిన్ లభించిందనుకున్నారు.

అనుకున్నట్లుగానే లక్ష్మీ మీనన్ తదుపరి చిత్రాలు సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు చిత్రాల్లోనూ లంగా ఓణి, చీర అంటూ సంప్రదాయ బద్దంగా కనిపించింది. అయితే అన్ని చిత్రాల్లో లంగా ఓణిలను అంటిపెట్టుకుని సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ మడికట్టుకుని ఉంటే లాభం లేదనుకుందో ఏమో, ఆ తరువాత నటించిన నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లోనే రెచ్చిపోయి నటించేసింది. అంతేకాదు ఇకపై ఇలాంటి ముద్దు సన్నివేశాలకు, కురచ దుస్తులు ధరించి నటించే గ్లామరస్ పాత్రలకు రెడీ అంటూ స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చేసింది. మరో విషయం ఏమిటంటే లక్ష్మీమీనన్ ప్రకటన ఆమె తల్లికి, దర్శక నిర్మాతలకు తెగ ఆనందాన్నిచ్చేసిందని సమాచారం. దీంతో కోలీవుడ్ దర్శక నిర్మాతలు లక్ష్మీమీనన్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటింపజేయడానికి సిద్ధం అయ్యారట. ఇక ఈ సంచలన నటి తల్లి మాత్రం ఒక్కో ముద్దు సన్నివేశానికి అదనంగా పది లక్షలు పారితోషికం చెల్లించుకోవాలంటూ డిమాండ్ చేసే పనిలో పడ్డారట. కొందరి అవసరం ఇంకొందరికి అవకాశం అంటే ఇదేనేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement