కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది మాలీవుడ్ భామ లక్ష్మీ మీనన్. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు వరుస కట్టాయి. అలా విశాల్, విజయ్ సేతుపతి, విమల్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక సమయంలో విశాల్‌తో లవ్‌లో ఉందంటూ పుకార్లు కూడా వెలువడ్డాయి.
హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే అదే ఆమె చేసిన పెద్ద తప్పిదంగా మారింది. సినీ పరిశ్రమ లక్ష్మీ మీనన్‌ను దాదాపు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ నటించటానికి సిద్ధం అని చెప్పినా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఒకటీరెండు అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా క్లిక్ అవలేదు. అలాంటిది ఇటీవల చంద్రముఖి– 2 చిత్రంలో సడన్‌గా మెరిసింది. ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించింది. ఈ సినిమా రిలీజైన తర్వాత గానీ అందులో లక్ష్మీమీనన్ నటించిందనే విషయం తెలియలేదు.
తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వరించినట్లు సమాచారం. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబుతో జతకట్టడానికి లక్ష్మీ మీనన్ సిద్ధమవుతోందని తెలిసింది. ఒక పక్క హీరోగానూ, మరో పక్క ప్రముఖ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న యోగిబాబు సరసన నటించి లక్ష్మీ మీనన్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుందన్న మాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
చదవండి: సలార్ కోసం కన్నడలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన కేజీఎఫ్ విలన్
Comments
Please login to add a commentAdd a comment