
Ranveer Singh Intresting Comments On Wife Deepika: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్. ఇందులో దీపికా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది. యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేదితో లిప్ లాక్, రొమాంటి సీన్స్‌లో నటించింది. తన కజిన్ బాయ్‌ఫ్రెండ్‌తో ఎఫైర్ పెట్టుకునే అమ్మాయిగా దీపికా ఈ మూవీలో కనిపించింది. ఇక ఈ సినిమాలో దీపిక తన పాత్ర, ఇంటిమేట్‌లో సీన్స్‌పై వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న తరుణంలో రణ్‌వీర్ తన భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల దీపికా-రణ్‌వీర్‌లు పర్యటనకు వెళ్లిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఈ బాలీవుడ్ జంట లిప్ కిస్ ఇచ్చుకుంటూ కనిపించారు. ఇదే ఫొటోను రణ్‌వీర్ షేర్ చేస్తూ.. గెహ్రియాన్‌లో ఆమె నటనపై ప్రశంసలు కురింపించాడు. ఇందులో తన నటన అద్భుతమని, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆసక్తిగా స్పందించాడు. అంతేకాదు దీపికాను పోగుడుతూ అర్థంకానీ కఠినమైన ఇంగ్లీష్ పదాలతో ఆమె పాత్రను కొనియాడాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్
‘మీ లాంటి భర్త ఉంటే.. ప్రతి అమ్మాయి లక్కీ గర్ల్’ అని, క్యూట్ కపుల్, మీరు ఈ ఇంగ్లీష్‌ను కేంద్ర మంత్రి శశిథరూర్ దగ్గర నేర్చుకున్నారా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో దీపికా, సిద్ధార్థ్ చతుర్వేదితో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. అంతేకాదు లెక్కలేనని లిప్ లాక్‌లు కూడా ఇచ్చింది. దీంతో ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు మీ ఆయన(రణ్‌వీర్ సింగ్) అనుమతి తీసుకున్నావా అంటూ ఆమెపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీటిపై ఇప్పటికే దీపికా స్పందిస్తూ ట్రోలర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉంటారంటూ వారిపై మండిపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment