నటి మీనాక్షితో లిప్‌లాకా? | Hero refused to enter liplock with Meenakshi | Sakshi
Sakshi News home page

నటి మీనాక్షితో లిప్‌లాకా?

Published Tue, Nov 3 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

నటి మీనాక్షితో లిప్‌లాకా?

నటి మీనాక్షితో లిప్‌లాకా?

తమిళసినిమా: ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణ అంశం హీరోహీరోయిన్ల లిప్ లాక్ సన్నివేశాలు. అలాంటిది అదీ ఒక హీరో లిప్ లాక్ సన్నివేశంలో నటించాలని అనగానే కరెంట్ షాక్ కొట్టినట్లు వద్దు బాబోయ్ అంటూ పారిపోవడం ఆ చిత్ర యూనిట్‌నే ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త నటుడు రఫీ కథానాయకుడిగా పరిచయమవుతూ హైటెక్ పిక్చర్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నేర్ముగం. మీరానందన్, మీనాక్షి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మిరండవన్ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీకృష్ణ కథ, కథనం, దర్శకత్వం బాధ్యత లు నిర్వహిస్తున్నారు.

పాండియరాజన్, జిన్నా, సిజర్ మనోహర్, నెల్లై శివ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మానసికంగా వేదనకు గురైన మనుషుల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం నేర్ముగం అని తెలిపారు. అలాంటి ఏడు జంటలు అడవిలో పడే పాట్లే చిత్ర కథ అని చెప్పారు. వాళ్లలో ముఖ్య జంటగా హీరోహీరోయిన్లు రఫీ, మీనాక్షి నటిస్తున్నారని చెప్పారు.

ఒక సందర్భంలో హీరో హీరోయిన్‌ను లిప్ టూ లిప్ ముద్దు పెట్టుకోవాల్సి వస్తుందని, ఆ విషయాన్ని నటి మీనాక్షికి చెప్పి ఆమె సమ్మతించేలా కన్వెన్స్ చేశామని అన్నారు. హీరో రఫీకి ఈ చుంభనం విషయం చెప్పగానే మీనాక్షితో లిప్‌లాకా? అంటూ బెదిరిపోయారని పేర్కొన్నారు. ఏదో నటనపై ఆశతో తానే నిర్మాతగా చిత్రాన్ని చేస్తున్నానని, పెళ్లి అయిన వాడికి ఈ లిప్‌లాక్ సన్నివేశాలు ఏంటని, ఈ విషయం తన భార్యకు తెలిస్తే విడాకుల వరకూ వెళుతుందని, అందుకే చచ్చినా చేయనని అన్నారని వివరించారు.

చివరకు ఆ సన్నివేశాన్ని వేరే జంటతో చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. యువతను, ప్రేమికుల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రంలో ప్రేమ, సెంటిమెంట్, హాస్యం, థ్రిల్లర్, యాక్షన్ ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement