హీరోయిన్‌తో లిప్‌లాక్‌.. నాని ఇంట్లో గొడవలు! | Hero Nani Response On Lip Lock Scene At Hi Nanna Teaser launch Event | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌తో లిప్‌లాక్‌.. నాని ఇంట్లో గొడవలు!

Published Sun, Oct 15 2023 1:14 PM | Last Updated on Sun, Oct 15 2023 1:36 PM

Hero Nani Response On Lip Lock Scene At Hi Nanna Teaser launch Event - Sakshi

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలో లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్‌ మేరకే అలాంటి సీన్స్‌ పెడితే.. మరికొన్ని సినిమాల్లో మాత్రం మసాలా యాడ్‌ చేయడం కోసమే అన్నట్లుగా ముద్దు సన్నివేశాలు పెడుతున్నారు. హీరో నాని సైతం కొన్ని సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించాడు. తాజా చిత్రం ‘హాయ్‌  నాన్న’లో కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఇదే విషయంపై టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఓ విలేకరి నుంచి నానికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. ‘మీ ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్‌ సీన్స్‌ కనిపిస్తున్నాయి. దర్శకుడు ఆ సన్నివేశాలు యాడ్‌ చేస్తున్నారా? లేదా మీరు అలాంటి సీన్‌ పెట్టాలని కండీషన్‌ పెడుతున్నారా’? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.

(చదవండి: విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా)

దానికి నాని ఇలా సమాధానం ఇచ్చాడు. ‘నా ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్‌ సీన్స్‌ లేవు. అంటే సుందరానికీ.. మూవీతో పాటు  దసరా సినిమాలో కూడా ముద్దు సన్నివేశాలు లేవు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆ తరహా సీన్స్‌ ఉన్నాయి. అలాంటి సీన్స్‌లో నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి. అయితే నేను ఒక నటుడిని. కథ డిమాండ్‌ మేరకే అలాంటి సీన్స్‌లో నటిస్తాను.

(చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌)

నా గత చిత్రాలను చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సినిమాకు ఆ సీన్‌ అవసరం అనుకుంటేనే.. నటిస్తాను తప్ప.. ప్రమోషన్స్‌ కోసమే, లేదా మసాలా యాడ్‌ చేయడం కోసమో నటించను’ అని నాని సమాధానం ఇచ్చాడు. ‘హాయ్‌ నాన్న’టీజర్‌ చూశాక.. మళ్లీ మీ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ‘ఏమో ఇప్పుడే రిలీజ్‌ చేశాం. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు నాని. ఇక ‘హాయ్‌ నాన్న’విషయాకొస్తే.. నాని తండ్రి పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. మృణాలు ఠాకూర్‌ హీరోయిన్‌. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. డిసెంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement