![Director Vetrimaran Shocking Comments On Allu Arjun - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/12/Dhanush%20and%20Alluarjun_01.jpg.webp?itok=iZv3iyp5)
తమిళ చిత్రం విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం సినిమా చాలా బాగుందంటూ చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ సూపర్ హిట్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేశాడు. ఆడుకాలం, కాక ముట్టై, విసరణై, వడ చెన్నై, అసురన్ వంటి ఎన్నో హిట్స్‌ను కోలీవుడ్‌కు అందించిన ఆయన త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. స్ట్రయిట్ ఫిలిం ఏమో కానీ ఇప్పుడైతే విడుదలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.
దర్శకుడు వెట్రిమారన్
విడుదల పార్ట్ 1 తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న సందర్భంగా వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నేను సినిమా చేయాలనుకున్నాను. ఈమేరకు చర్చలు కూడా జరిగాయి. నేను తీసిన ఆడుకాలం(తెలుగులో పందెంకోళ్లుగా రీమేక్ అయింది) సినిమా రిలీజయ్యాక చెన్నైలో అల్లు అర్జున్ నన్ను కలిశాడు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇద్దామనుకుంటున్నా. నీకు ఇంట్రస్ట్ ఉంటే మంచి కథ రాయు అన్నాడు. అప్పుడు వడ చెన్నై స్క్రిప్ట్ చెప్పా. హీరో ధనుష్‌ను ఢీ కొట్టే రోల్ ఆఫర్ చేశా. హైదరాబాద్‌కు వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో ఆ పాత్ర గురించి వివరంగా చెప్పాను. కానీ మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పాడు' అని వెల్లడించాడు.
ఇకపోతే విడుదల సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఇందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమాకోసం పనిచేసిన తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్ బహుమతిగా కొనిచ్చాడు వెట్రిమారన్. అలాగే చిత్రయూనిట్ అందరికీ తలా ఒక బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment