Vetrimaaran
-
ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది. విడుదల పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే!సినిమా కథప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో విడుదల 1 కథ ముగుస్తుంది. జైల్లో ఉన్న పెరుమాళ్ విచారణతో విడుదల పార్ట్ 2 ప్రారంభమవుతుంది. పెరుమాళ్ అరెస్టు విషయం బయటకు తెలియడంతో అతడిని మరో క్యాంపుకు తరలించి అక్కడే ఎన్కౌంటర్ చేయాలని పథకం రచిస్తారు. కొమరన్ (సూరి)తో కలిసి మరికొంతమంది పోలీసులు పెరుమాళ్‌ను అడవి మార్గం గుండా క్యాంపుకు తీసుకెళ్తారు.ఈ ప్రయాణంలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ కథ చెప్తాడు. ప్రజాదళంలోకి ఎలా వచ్చాడు? అతడి ఆశయం ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనక ఉన్న నిజమేంటి? పోలీసుల కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి.. -
కేజీఎఫ్ నేపథ్యంలో...
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ కాంబినేషన్లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్’ (2019) వంటి సక్సెస్ఫుల్ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్‌లో 25 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్–వెట్రిమారన్‌ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. కాగా ధనుష్‌తో వెట్రిమారన్ చేయనున్న మూవీ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్ సమాచారం. -
విజయ్ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ
టైటిల్: విడుదల 2నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులునిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)దర్శకత్వం: వెట్రీమారన్సంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ఎడిటింగ్: ఆర్. రామర్విడుదల తేది: డిసెంబర్ 20, 2024విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వెట్రిమారన్ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. అయితే పార్ట్ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే మావోయిస్ట్ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. నక్సలైట్స్ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్‌గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి. అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పెరుమాళ్, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది. కరుప్పన్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ నక్సలైట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు.. ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగే ఎన్కౌంటర్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్ చూసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. పార్ట్ 3 కోసం తీసుకున్న లీడ్ బాగుంది. వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్లో నగ్నంగా ఉండే సీన్ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్‌కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. పోలీస్ డ్రైవర్ కొమరన్గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు. డబ్బింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది
‘‘విడుదల–1’లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్ మాత్రమే జరిగింది. అయితే కథ అంతా ‘విడుదల–2’ లోనే ఉంటుంది. మొదటి భాగానికి మించి పదిరెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది. ఇందులో పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటన, భావోద్వేగాలు చూస్తారు’’ అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, సూరి, మంజు వారియర్, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదల–2’. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ తమిళ్, తెలుగులో ఈ నెల 20న విడుదల కానుంది. శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చింతపల్ల రామారావు మాట్లాడుతూ– ‘‘అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజల్ని ఎలా బయటపడేలా చేశారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలతో తీసిన చిత్రమిది. ఇళయరాజాగారి నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. నేను నిర్మించిన ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే ‘డ్రీమ్ గర్ల్’ అనే మూవీని ప్రారంభించబోతున్నాం. మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు. -
ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీక్వెల్ రిలీజ్‌కు ముందు 'విడుదల-1' సినిమాను జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర్లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగానే వ్యూస్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం డిసెంబర్ 20 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల పార్ట్-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్-2లో మాత్రం మంజు వారియర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. -
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్‌ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్‌గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్‌లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్‌కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్‌ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్‌కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే
వెట్రిమారన్ 'విడుదల' సినిమా గతేడాది రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర తెలుగు థియేటర్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మేరకు మూవీ టీమ్‌ని కలిశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'విడుదల 2' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?) -
వెట్రి కోసం దేవర వెయిటింగ్..
-
ఎన్టీఆర్-వెట్రిమారన్.. ఇద్దరికీ ఇష్టమే కానీ?
'దేవర' ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ చెన్నై వెళ్లాడు. తమిళంలో మాట్లాడుతూ అక్కడి ప్రేక్షకుల్ని దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ వెట్రిమారన్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. 'నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్ని నాతో సినిమా చేయమని అడుగుతాను. తమిళంలో తీసి తెలుగులో డబ్ చేయమని అంటాను' అని అన్నాడు. దీంతో మరోసారి తారక్-వెట్రిమారన్ కాంబో గురించి డిస్కషన్ మొదలైంది.(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)ఈ చర్చకు మూడు నాలుగేళ్ల క్రితం బీజం పడింది. లాక్డౌన్ తర్వాత వెట్రిమారన్, ఎన్టీఆర్‌కి ఓ స్టోరీ చెప్పారు. ఈ విషయాన్ని గతేడాది తాను తీసిన 'విడుదల' సినిమా రిలీజ్ టైంలో బయటపెట్టారు. లెక్క ప్రకారం ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వాల్సింది. కానీ తాను లేటుగా సినిమాలు తీస్తానని, అందుకే ఆ మూవీ మిస్ అయినట్లు చెప్పారు.వెట్రిమారన్ స్టోరీ చెప్పినట్లు లాక్డౌన్ తర్వాత అంటే తారక్ 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నాడు. రాజమౌళితో సినిమా అంటే వేరే సినిమాలు చేయడానికి కుదరదు. అలా అప్పుడు వెట్రిమారన్‌తో మూవీ మిస్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆయనతోనే కలిసి పనిచేయాలన్నా మరో మూడు నాలుగేళ్లు ఎదురుచూడాలి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)ఎందుకంటే తారక్ ఇప్పుడు 'దేవర పార్ట్ 1' చేశాడు. దీని తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ, దేవర పార్ట్ 2 లైన్లో ఉన్నాయి. మరోవైపు వెట్రిమారన్ 'విడుదల పార్ట్ 2' తీస్తున్నాడు. దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనేది క్లారిటీ లేదు. దీనితో పాటు వెట్రిమారన్ మూవీస్ అంటే రా అండ్ రస్టిక్‌గా ఉంటాయి. మరి ఇలాంటి కథ తీసుకొస్తే తారక్ ఒప్పుకుంటాడా? లేదంటే తన జోన్ నుంచి బయటకొచ్చి ఎన్టీఆర్ కోసం వేరే ఏమైనా కథ రాస్తాడా అనేది చూడాలి.ఏదేమైనా వెట్రిమారన్, ఎన్టీఆర్ ఎవరికి వాళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏంటో? ఒకవేళ సెట్ అయితే మాత్రం వేరే లెవల్ కాంబినేషన్ అవుతుంది. (ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)"After Asuran...post lockdown, I have met #JrNTR and we are in talks🔥. It is bound to happen but it takes more time for me to complete one film & move on to other film. So that's the problem"- #VetriMaaran Throwback pic.twitter.com/OSMzTMorLp— AmuthaBharathi (@CinemaWithAB) September 17, 2024I'll ask my fav director. #Vetrimaaran sir please do a straight Tamil film with me. We can dub it in Telugu.- #NTR at #Devara Chennai press meetpic.twitter.com/eQM6hqKg8K— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 17, 2024 -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు, తమిళంలో "విడుదల 2" ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.విడుదల పార్ట్ 1కు మంచి స్పందనఈ సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా ఎంతో సంతోషించాం. విడుదల పార్ట్ 1 అంచనాలను మించి విజయం సాధించింది. నటుడు సూరికి ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అప్పుడే రిలీజ్దర్శకుడు వెట్రిమారన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తాం అన్నారు. ఈ మూవీలో భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. A new chapter begins with #VidudalaPart2 Directed by the visionary #VetriMaaran! 🌟First Look is Out #ValourAndLove An @ilaiyaraaja Musical @VijaySethuOffl @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72 #Kishore… pic.twitter.com/0XGtTvdlE2— Shreyas Sriniwaas (@shreyasmedia) July 17, 2024 చదవండి: బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ -
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.సూర్య ప్రధాన పాత్రలో 'వాడివాసల్' చిత్రాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాడివాసల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం. -
హీరో సూర్య భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా?
సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులో మన బడా హీరోల రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఇతడు.. దీని తర్వాత పలు చిత్రాలు చేయబోతున్నాడు. అయితే సూర్య చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. పాపకు వెరైటీ పేరు) తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ ది సెపరేట్ బ్రాండ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అద్భుతమైన చిత్రాలు తీస్తుంటారు. ఇతడు సూర్యతో 'వడివాసల్' అనే మూవీ చేస్తానని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ అని దర్శక, నిర్మాతలు ప్రకటించారు కూడా. సినిమాలో పాత్ర కోసం సూర్య ఓ ఎద్దును కూడా పెంచాడు. కానీ షూటింగ్ అనుకున్నట్లు ప్రారంభమే కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే సూర్య, వెట్రిమారన్ ఎవరికి వాళ్లు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన వెట్రిమారన్.. తాను తీసే 'విడుదలై 2' ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని, దీని తర్వాతే వాడివాసల్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. దీనిబట్టి చూస్తే 'వడివాసల్' ఉంది కానీ ఇప్పట్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) -
క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్ట్‌లోకి నయనతార
తమిళ చిత్ర పరిశ్రమలో వెట్రిమారన్‌కు దర్శకుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడుగళంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే ఆ చిత్ర కథానాయకుడు ధనుష్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించారు. ఆ తర్వాత విచారణై, అసురన్, విడుదలై ఇలా వరుసగా వైవిద్యభరిత కథా చిత్రాలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా గ్రాస్ రూట్ ఫిలిమ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉదయం ఎల్‌హెచ్ 4, పొరియాళన్, కాక్కా ముట్టై, విచారణై, వడ చైన్నె వంటి సక్సెస్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న వెట్రిమారన్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. విశేషమేమిటంటే ఇందులో నయనతార నాయకిగా నటించబోతున్నారట. బిజీగా ఉన్న ఈ భామ త్వరలో తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా దర్శకుడు వెట్రిమారన్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి వెట్రిమారన్ శిష్యుడు విక్రమన్ అశోకన్ దర్శకత్వం వహించారన్నారు. ఇందులో నటుడు కవిన్ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
‘అన్నపూరణి ’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం సరైనది కాదు: వెట్రిమారన్
అన్నపూరణి చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అన్నపూరణి. ఇది ఆమె నటించిన 75వ చిత్రం కావడం గమనార్హం. నీలేష్ కృష్ణ ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. నటుడు జయ్, సత్యరాజ్, రెడిన్కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో గోడకు కొట్టిన బంతిలా అన్నపూరణి చిత్రం ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆవిధంగా నైనా సేఫ్ అవుదాం అనుకుంటే వివాదాల్లో చిక్కుకుంది. చిత్రంలోని శ్రీరాముడు కూడా మాంసం భుజించారు అన్న సంభాషణ అన్నపూరిణి చిత్రాన్ని చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రం ఒక సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఇది లవ్ జిహాద్‌ను ఆదరించే చిత్రంగా ఉందంటూ ముంబైకి చెందిన శివసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ సోలంకి ముంబై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది లేనిపోని వివాదాలకు తెచ్చిపెట్టే విధంగా ఉందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అన్నపూరణి చిత్ర స్ట్రీమింగ్‌ను నిలిపేసింది. అయితే దీనిపై పలువురు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ కూడా అన్నపూరణి చిత్ర విషయంలో నెట్‌ఫ్లిక్స్ చర్యలను తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఒక చిత్రాన్ని అనుమతించడానికై నా, నిషేధించడానికి అయినా సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు జరిగిన ఘటన సెన్సార్ బోర్డు అధికారాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉందన్నారు. -
సూర్య ‘వాడివాసల్’ మూవీ ఆగిపోయిందా?
సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీక్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను సూర్య పూర్తి చేశారు. తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సూర్య 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. కాగా సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. అయితే దర్శకుడు వెట్రిమారన్ హాస్యనటుడు సూరి కథానాయకుడిగా విడుదలై చిత్రాన్ని ముందు పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు. దీంతో వాడివాసల్ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. సూర్య కంగువా చిత్ర షూటింగ్‌తో బిజీ అయ్యారు. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వెట్రిమారన్ విడుదలై చిత్రానికి సీక్వెల్‌ను చేస్తున్నారు. దీంతో సూర్యతో చేయాల్సిన వాడివాసల్ చిత్రం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. దీని గురించి నిర్మాత థాను క్లారిటీ ఇచ్చినా రకరకాల ప్రచారం ట్రోలింగ్ అవుతునే ఉంది. సూర్య తన 43వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయడానికి సిద్ధం అవడంతో వెట్రిమారన్ తదుపరి అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి చిత్రం వాడివాసల్ అని, ఇందులో నటుడు సూర్యనే హీరో అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం సూర్యకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని వెట్రిమారన్ వెల్లడించారు. -
అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్ హీరోయిన్
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఆండ్రియా. తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టిన ఈమెకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ. ఆండ్రియా పియానో వాయిద్య కళాకారిణి. ఇక ఈమె న్యాయవాది అన్న విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా నటిగా కంటే కూడా గాయనిగా ముందు సినీ రంగ ప్రవేశం చేశారు. గాయనిగా గుర్తింపు పొందిన తర్వాత కోలీవుడ్‌లో పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. (ఇదీ దచవండి: ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!) ఆ తర్వాత మంగాత్తా, విశ్వరూపం,తడాఖా,మాస్టర్, వడచైన్నె అంటూ పలు చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించారు. మలయాళం, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. 36 ఏళ్ల ఈ అవివాహిత భామ ఇప్పటికీ నటిగా గాయనిగా బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల పుష్ప చిత్రం తమిళ్ వెర్షన్లో 'ఊ అంటావా మామ' పాటను పాడి ఆ పాటకు ఇక్కడ కూడా క్రేజ్ తెచ్చిపెట్టింది ఈమెనే. అయితే వ్యక్తిగతంగా ఈమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన అనల్ మేల్ పణితులి చిత్రంలో ఆండ్రియా అర్ధ నగ్నంగా నటించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన ఆండ్రియా నిజమే ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తనకే చాలా బిడియంగా అనిపించిందని అన్నారు. అయితే నిజ జీవితంలో తనకు ఇంతకు మించిన సంఘటనలను జరిగాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోనీ చిత్రం అంటూ అరడజను చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులో 'సైంధవ్' చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. -
సూర్య సినిమా నుంచి వైదొలగిన జీవీ?, ఇదిగో క్లారిటీ
తమిళ సినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్న మరో చిత్రం వాడివాసల్. వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను భారీ ఎత్తున నిర్మించ తలపెట్టారు. సీఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవానికి ఈ చిత్రం 2020లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు సూర్య రిహార్సల్స్ కూడా చేశారు. అయితే దర్శకుడు వెట్రిమారన్ హాస్య నటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని ముందుగా తెరకెక్కించడానికి సిద్ధం కావడంతో వాడివాసల్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. దీంతో సూర్య కంగువా చిత్రానికి సిద్ధమయ్యారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక నేపథ్యంగా సాగే ఈ చిత్రం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వాడివాసల్ చిత్ర షూటింగ్ ప్రారంభంకావడంలో జాప్యం జరగడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం వైరల్ అవుతోంది. (చదవండి: టాప్ డైరెక్టర్‌తో శివకార్తికేయన్.. హీరోయిన్గా సీతారామం బ్యూటీ!) అయితే దీని గురించి ఆయన వర్గం స్పందిస్తూ వాడివాసల్ చిత్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి పనిచేయడానికి జీవీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే వాడివాసల్ చిత్రం సెట్ పైకి వెళ్లడానికి ఇంకా కాస్త టైమ్ పడుతుందనే చెప్పాలి. -
ఎన్టీఆర్ తో సినిమా పై వెట్రిమారన్ సంచలన కామెంట్స్
-
ధనుష్‌తో సినిమా.. స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్న బన్నీ!
తమిళ చిత్రం విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం సినిమా చాలా బాగుందంటూ చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ సూపర్ హిట్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేశాడు. ఆడుకాలం, కాక ముట్టై, విసరణై, వడ చెన్నై, అసురన్ వంటి ఎన్నో హిట్స్‌ను కోలీవుడ్‌కు అందించిన ఆయన త్వరలో టాలీవుడ్లో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. స్ట్రయిట్ ఫిలిం ఏమో కానీ ఇప్పుడైతే విడుదలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న సందర్భంగా వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను సినిమా చేయాలనుకున్నాను. ఈమేరకు చర్చలు కూడా జరిగాయి. నేను తీసిన ఆడుకాలం(తెలుగులో పందెంకోళ్లుగా రీమేక్ అయింది) సినిమా రిలీజయ్యాక చెన్నైలో అల్లు అర్జున్ నన్ను కలిశాడు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇద్దామనుకుంటున్నా. నీకు ఇంట్రస్ట్ ఉంటే మంచి కథ రాయు అన్నాడు. అప్పుడు వడ చెన్నై స్క్రిప్ట్ చెప్పా. హీరో ధనుష్‌ను ఢీ కొట్టే రోల్ ఆఫర్ చేశా. హైదరాబాద్‌కు వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో ఆ పాత్ర గురించి వివరంగా చెప్పాను. కానీ మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పాడు' అని వెల్లడించాడు. ఇకపోతే విడుదల సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఇందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమాకోసం పనిచేసిన తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్ బహుమతిగా కొనిచ్చాడు వెట్రిమారన్. అలాగే చిత్రయూనిట్ అందరికీ తలా ఒక బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చాడు. -
జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబో.. క్లారిటీ ఇదే!
కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ రానున్నట్ల నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్లో యంగ్ టైగర్ నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. తాజాగా విషయంపై స్పందించిన డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విడుదల పార్ట్-1 తెలుగులో రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన విడుదలై: పార్ట్1 ప్రేక్షకులను అలరిస్తోంది. వెట్రిమారన్ మాట్లాడుతూ..' 'అసురన్' మూవీ తర్వాత లాక్డౌన్ ముగిశాక ఎన్టీఆర్‌ను కలిశా. మేమిద్దరం చాలా విషయాలు చర్చించుకున్నాం. అయితే ఆయనతో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఏ కాంబినేషన్లో ఎలాంటి మూవీ రావాలన్న విషయంపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కేవలం స్టార్ వాల్యూ, కాంబినేషన్ మాత్రమే కాకుండా తాను ఎంచుకునే కంటెంట్ డిమాండ్ చేస్తే అతడితో సినిమా చేస్తా.' అంటూ వెట్రిమారన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ ప్రస్తుతం విడుదల:పార్ట్1'కు సీక్వెల్‌గా 'పార్ట్2' తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత సూర్యతో 'వాడివాసల్' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. I will only Collaborate For A Content that will Demand A Star like @tarak9999 - #vetrimaaran 👌🔥❤️🔥. pic.twitter.com/9BTYhcGwNq — Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 11, 2023 -
‘విడుదల పార్ట్ 1’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
Vidudhala Part1: ఈ సినిమాను మీడియానే ప్రజల వద్దకు తీసుకెళ్లాలి
‘విడుతలై పార్ట్ 1’ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోరారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ . విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 31న తమిళ్లో విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’గా ఏప్రిల్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేశారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా వెట్రిమారన్ అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు’ అన్నారు. ‘నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ’ అని వెట్రిమారన్ అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’అని నిర్మాత ఎల్రెడ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో హీరో సూరి, హీరోయిన్ భవాని శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా సూపర్ సక్సెస్.. బంగారు నాణాలు, ప్లాట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్
షూటింగ్ స్పాట్లో దర్శకుడికి సగం పనిని టెన్షన్‌ను తగ్గించేది సహాయ దర్శకులే. దీంతో చాలామంది దర్శకులు తమ శిష్యులను బాగా చూసుకుంటారు. అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. కాగా దర్శకుడు వెట్రిమారన్ తన శిష్యులకు అందించే సాయం వేరేగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా కాస్ట్లీ. ఈయన తాజాగా హాస్య నటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేసి విడుదలై చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఎల్ రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడం విశేషం. కాగా చిత్ర తొలి భాగం గత నెల 31వ తేదీన విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర విడుదలకు ముందే దర్శకుడు వెట్రిమారన్ తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్‌ను బహుమతిగా కొనిచ్చారు. కాగా తాజాగా విడుదలై చిత్రం సాధిస్తున్న విజయానందంతో చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం సంగీత దర్శకుడు ఇళయరాజాని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ చిత్ర సభ్యులందరికీ తలా ఒక బంగారు నాణేన్ని బహుమతిగా అందించారు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే విడుదలై– 2 పై చిత్రంపైనా అంచనాలు పెరిగిపోతున్నాయి. -
ఆ దర్శకుడి సినిమాలో నటించాలని ఉంది: జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెను అక్కడ కూడా సక్సెస్ వరించింది. తాజాగా ఆమె వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్లో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతున్నారు. తమిళం, మలయాళం భాషల్లో హిట్ అయిన చిత్రాలను హిందీ రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఆమె మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ హిందీ రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. అలాగే తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు. కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.