ఎన్టీఆర్-వెట్రిమారన్.. ఇద్దరికీ ఇష్టమే కానీ? | Jr NTR Movie With Vetrimaaran Latest News | Sakshi
Sakshi News home page

Ntr Vetrimaaran: సినిమా గురించి మూడేళ్ల క్రితమే డిస్కషన్.. కాకపోతే

Sep 18 2024 1:06 PM | Updated on Sep 18 2024 1:45 PM

Jr NTR Movie With Vetrimaaran Latest News

'దేవర' ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ చెన్నై వెళ్లాడు. తమిళంలో మాట్లాడుతూ అక్కడి ప్రేక్షకుల్ని దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ వెట్రిమారన్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. 'నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్‌ని నాతో సినిమా చేయమని అడుగుతాను. తమిళంలో తీసి తెలుగులో డబ్ చేయమని అంటాను' అని అన్నాడు. దీంతో మరోసారి తారక్-వెట్రిమారన్ కాంబో గురించి డిస్కషన్ మొదలైంది.

(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)

ఈ చర్చకు మూడు నాలుగేళ్ల క్రితం బీజం పడింది. లాక్‌డౌన్ తర్వాత వెట్రిమారన్, ఎన్టీఆర్‌కి ఓ స్టోరీ చెప్పారు. ఈ విషయాన్ని గతేడాది తాను తీసిన 'విడుదల' సినిమా రిలీజ్ టైంలో బయటపెట్టారు. లెక్క ప్రకారం ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వాల్సింది. కానీ తాను లేటుగా సినిమాలు తీస్తానని, అందుకే ఆ మూవీ మిస్ అయినట్లు చెప్పారు.

వెట్రిమారన్ స్టోరీ చెప్పినట్లు లాక్‌డౌన్ తర్వాత అంటే తారక్ 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నాడు. రాజమౌళితో సినిమా అంటే వేరే సినిమాలు చేయడానికి కుదరదు. అలా అప్పుడు వెట్రిమారన్‌తో మూవీ మిస్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆయనతోనే కలిసి పనిచేయాలన్నా మరో మూడు నాలుగేళ్లు ఎదురుచూడాలి.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)

ఎందుకంటే తారక్ ఇప్పుడు 'దేవర పార్ట్ 1' చేశాడు. దీని తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ, దేవర పార్ట్ 2 లైన్‌లో ఉన్నాయి. మరోవైపు వెట్రిమారన్ 'విడుదల పార్ట్ 2' తీస్తున్నాడు. దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనేది క్లారిటీ లేదు. దీనితో పాటు వెట్రిమారన్ మూవీస్ అంటే రా అండ్ రస్టిక్‌గా ఉంటాయి. మరి ఇలాంటి కథ తీసుకొస్తే తారక్ ఒప్పుకుంటాడా? లేదంటే తన జోన్ నుంచి బయటకొచ్చి ఎన్టీఆర్ కోసం వేరే ఏమైనా కథ రాస్తాడా అనేది చూడాలి.

ఏదేమైనా వెట్రిమారన్, ఎన్టీఆర్ ఎవరికి వాళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏంటో? ఒకవేళ సెట్ అయితే మాత్రం వేరే లెవల్ కాంబినేషన్ అవుతుంది. 

(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement