హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన ఓ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్‌లో తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి తారక్ మాట్లాడాడు.
'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ 'దేవర'. సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా దేశమంతా తిరిగేస్తున్నాడు. మొన్నీమధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లొచ్చిన తారక్.. మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలు చెప్పాడు.
(ఇదీ చదవండి: ప్లీజ్ సర్ నాతో సినిమా చేయండి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్)
అయితే ఇదే ఈవెంట్‌లో యాంకర్ వరస ప్రశ్నలు వేస్తున్న టైంలో ఎన్టీఆర్.. మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ తీసుకెళ్దామనుకున్నా. కానీ మీ వల్ల అది మిస్ అయిపోద్దేమో? 'దేవర' రిలీజ్ తర్వాత మన ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకరమ్మతో చెప్పాడు.
మన దగ్గర దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో.. తమిళనాడులో దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అంత ఫేమస్. 1957 నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని చిట్టిముత్యాల బియ్యంతో చేస్తారు. పేరు బిర్యానీ అంటారు గానీ ఇది పలావ్లా ఉంటుంది. కావాలంటే ఓసారి యూట్యూబ్‌లో సెర్చ్ దీని మేకింగ్, హిస్టరీ తెలుస్తుంది.
(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)
"I wanted to pack Dindigul Thalappakatti Biriyani "
Foodie #JrNTR 😂❤️pic.twitter.com/lOlNfolB61— Ayyappan (@Ayyappan_1504) September 17, 2024
Comments
Please login to add a commentAdd a comment