dindigul
-
ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?
హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన ఓ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్‌లో తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి తారక్ మాట్లాడాడు.'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ 'దేవర'. సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా దేశమంతా తిరిగేస్తున్నాడు. మొన్నీమధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లొచ్చిన తారక్.. మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ప్లీజ్ సర్ నాతో సినిమా చేయండి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్)అయితే ఇదే ఈవెంట్లో యాంకర్ వరస ప్రశ్నలు వేస్తున్న టైంలో ఎన్టీఆర్.. మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ తీసుకెళ్దామనుకున్నా. కానీ మీ వల్ల అది మిస్ అయిపోద్దేమో? 'దేవర' రిలీజ్ తర్వాత మన ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకరమ్మతో చెప్పాడు.మన దగ్గర దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో.. తమిళనాడులో దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అంత ఫేమస్. 1957 నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని చిట్టిముత్యాల బియ్యంతో చేస్తారు. పేరు బిర్యానీ అంటారు గానీ ఇది పలావ్లా ఉంటుంది. కావాలంటే ఓసారి యూట్యూబ్‌లో సెర్చ్ దీని మేకింగ్, హిస్టరీ తెలుస్తుంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)"I wanted to pack Dindigul Thalappakatti Biriyani " Foodie #JrNTR 😂❤️pic.twitter.com/lOlNfolB61— Ayyappan (@Ayyappan_1504) September 17, 2024 -
హైదరాబాద్‌లో కంచికి చేరని అక్రమ కట్టడాల కథ
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల కథ కంచికి చేరకుండానే తిరిగి మొదటికొచ్చింది. హెచ్ఎండీఏతో పాటు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా.. భవన యజమానులు తిరిగి నిర్మిస్తున్నారు. చాలాచోట్ల స్థానిక నేతల అండదండలతో అక్రమ భవనాల పునర్నిర్మాణం యథావిధిగా కొనసాగుతోంది. కూల్చివేసిన చోట మరోసారి నిర్మాణం చేపట్టకుండా హెచ్ఎండీఏ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క దుండిగల్‌లోనే మున్సిపల్ అధికారులు అక్రమ భవనాలను ఏకంగా మూడుసార్లు కూల్చివేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దుండిగల్‌తో పాటు శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు చివరికి చేతులెత్తేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రహసనంగా కూల్చివేతలు.. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు నెల రోజుల వ్యవధిలో 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేశారు. వీటిలో చాలా వరకు 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించివే. గ్రామ పంచాయతీల్లో జీ+2 భవనాల కోసం అనుమతులు తీసుకొని అయిదారు అంతస్తుల వరకు అపార్ట్మెంట్లను నిర్మించారు. కొన్ని చోట్ల గోడౌన్లను ఏర్పాటు చేశారు. అధికారులు ఇలాంటి వాటిని గుర్తించారు. వీటిని కూల్చివేయించారు. వేల సంఖ్యలోనే అక్రమాలు.. నగరం చుట్టు శివారు ప్రాంతాల్లో వేలాదిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెండంతస్తుల కంటే ఎక్కువగా అపార్ట్మెంట్లు నిర్మించేందుకు టీఎస్‌బీ పాస్ నుంచి చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలి. ఔటర్ రింగురోడ్డుకు అన్ని వైపులా విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామ పంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. (క్లిక్: బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు) ► దుండిగల్, నిజాంపేట్, శంకర్పల్లి, మేడ్చల్, పోచారం, బడంగ్పేట్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. ప్రత్యేకంగా కోవిడ్ కాలంలో రెండేళ్లుగా ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు తాము చేపట్టిన కూల్చివేతల కారణంగా కొత్తగా భవనాలను నిర్మించేవాళ్లు మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారని, ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఫలితాన్నిచ్చాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
దిండుగల్‌లో పోస్టర్ల హల్చల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్‌లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్ అన్నాడీఎంకే గ్రూపువార్‌ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. దిండుగల్ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్ శ్రీనివాసన్ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్‌కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్ రాజకీయ గ్రూప్ వార్‌ను తెర పైకి తెచ్చింది. -
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
-
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
సాక్షి, చైన్నై : నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత పెరిగిందో.. ప్రమాదాల శాతం అంతే పెరిగింది. ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్రంగా గాయపడి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో బతుకు దుర్భరంగా మారుతోంది. అయితే, అలాంటి వారికి సరైన వైద్యం అందితే తిరిగి మామూలు మనుషులయ్యే అవకాశం ఉంది. విద్యుతాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి చేతులను అతికించారు చెన్నై డాక్టర్లు. 13 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌తో గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ డాక్టర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వివరాలు.. హైదరాబాద్‌లోని దుండిగల్‌కు చెందిన నారాయణ స్వామి మేస్త్రీ పని చేసేవాడు. 2015లో ఓ ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో అతను రెండు చేతులూ కోల్పోయాయి అవిటివాడయ్యాడు. ఈ క్రమంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తికి చెందిన రెండు చేతులను నారాయణ స్వామికి చెన్నై డాక్టర్లు ట్రాన్స్‌ప్లాంట్ చేసి అతికించారు. ఈ ఆపరేషన్ గత ఫిబ్రవరిలో జరగగా.. నారాయణ స్వామి, డాక్టర్లు తాజాగా మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడడం, తేలిక పాటి వస్తువులు ఎత్తడం వంటి పనులు చేస్తున్నాడిప్పుడు నారాయణ స్వామి. నిజంగా వైద్యో నారాయణో హరియే కదా..!! కాగా, తమిళనాడు చరిత్రలో ఇదే తొలి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కావడం విశేషం. -
అనర్హత ఎమ్మెల్యేలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు, విమర్శలకు కేంద్రబిందువైన రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ మరోసారి మాటల బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితపైనే విసిరారు. కోట్లు కొల్లగట్టిన జయలలిత ధనం దినకరన్ ద్వారా పొంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని అనర్హత వేటుపడిన 18 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: దిండుగల్లులో సోమవారం రాత్రి జరిగిన కావేరి నదీ జలాల పోరాట విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హతవేటు కేసును విచారించిన ఇరువురు న్యాయమూర్తుల్లో చెల్లుతుందని ఒకరు, చెల్లదని ఒకరు తీర్పు చెప్పారు. కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మూడో న్యాయమూర్తి సైతం వేటును సమర్థ్దిస్తే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఆ తరువాత ఫుల్‌బెంచ్‌కు మొరపెట్టుకోవచ్చు. ఈలోగా నాలుగైదు ఏళ్లు గడిచిపోతాయి. చివరి నిమిషంలో అప్పీలు పిటిషన్‌ను వెనక్కుతీసుకుంటామని వేటుపడిన ఎమ్మెల్యేల్లో ఒకరైన తంగతమిళ్‌సెల్వన్ ప్రకటిస్తారు. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదనే కదా. జయలలిత మరణం తరువాత పార్టీని రెండుగా చీల్చిన దినకరన్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు నడవడం ద్రోహం. జయ వల్ల పార్టీ నుంచి తొలగించబడిన ద్రోహి దినకరన్. జయలలిత తన స్వేదం, రక్తాన్ని చిందించి, ఎంతోధనం ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలందరినీ గెలిపించింది. ఈ 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ నాశనం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు: జయలలిత చలువతో కోట్లు గడించిన దినకరన్ నుంచి భారీస్థాయిలో ఆర్థిక లబ్ధి పొంది ఎన్నికల్లో గెలుపొందిన 18 మంది ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూలదోసేందుకు కుట్రపన్నుతున్నారు. వేటు పుణ్యమాన్ని మైసూరు, అమెరికాల్లో విహారయాత్ర చేçస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఆయన అన్నారు. జయలలితను అడ్డుపెట్టుకుని దినకరన్ కోట్లు గడించాడని దిండుగల్లు చేసిన విమర్శలతో వేదికపై ఉన్న నేతలు హడలిపోయారు. అమ్మ అభిమానుల్లో కంగారుపుట్టించాయి. అన్నాడీఎంకే మంత్రుల్లో అమ్మ గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దిండుగల్లుకు కొత్తేమీ కాదు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా అప్పట్లో మేము చెప్పిన మాటలు అన్నీ అబద్దాలని గతంలో వ్యాఖ్యానించారు. అలాగే, డబ్బు లేకుండా ఎన్నికల్లో ఏమీ చేయలేమని మరోసారి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం భారత ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి డెంగీ నివారణ చర్యలపై చర్చలు జరిపారని ఒక సందర్భంలో దిండుగల్లు మాట్లాడటంతో ప్రధాని ఎవరో కూడా ఈ మంత్రికి తెలియదని సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసిరారు. దీంతో బహిరంగసభల్లో దిండుగల్లు ప్రసంగించకుండా పార్టీ దూరం పెట్టింది. అయితే కొంత విరామం తరువాత సోమవారం రాత్రి వేదికనెక్కిన దిండుగల్లు మరోసారి దివంగత జయలలితపై అక్రమార్జన మాటల బాంబును విసిరారు. వివాదాస్పదమైన మంత్రి దిండుగల్లు మాటలపై అన్నాడీఎంకే నేతలు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా ఎవ్వరూ ఖండించలేదు. -
భార్యతో ఫోన్ చేయించి.. ప్రియుడిని రప్పించి!
చెన్నై: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య ప్రియుడిని తల నరికి దారుణంగా హత్యచేశాడు. ఆ వివరాలిలా.. దిండుగల్ జిల్లా వయ్యపాడికి చెందిన సంతోష్ (40), కోటయంకు చెందిన వినోద్‌కుమార్ భార్య కుమారి (35)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన వినోద్‌కుమార్ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తను ఇంట్లోలేని వేళల్లో సంతోష్ వచ్చి భార్యతో గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు. భార్య ప్రియుడు సంతోష్‌ను అంతం చేయాలని భావించాడు. ఇందుకుగాను భార్య సాయం కోరాడు. సాయం చేయకపోతే భార్యనూ చంపేస్తానని బెదిరించాడు. ఆమె అంగీకరించటంతో పథకం ప్రకారం సంతోష్‌కు ఫోన్ చేసి రప్పించాడు. ఇంటికి వచ్చిన సంతోష్ తలపై అదనుచూసి ఇనుపరాడ్‌తో గట్టిగా మోదాడు. అతడు అక్కడికక్కడే చనిపోగా శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టి సమీపంలోని చెత్తకుండీలో పడేశాడు. దుర్వాసన రావడంతో సోమవారం ఓ వ్యక్తి చూడగా.. అనుమానాస్పదంగా గోనె సంచి కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి పరిశీలించి, విచారణ జరపగా అసలు విషయం తేలింది. ఈ మేరకు హత్యకుపాల్పడ్డ వినోద్‌కుమార్ దంపతులను అరెస్ట్ చేశారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
-
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
బంగ్లాదేశ్ యువతి అరెస్ట్ మౌలాలి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా తప్పుడు ధృవ పత్రాలతో అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేశారు. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపి ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన కుమార రామలింగ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన యువతి, కుకట్‌పల్లికి చెందిన మధు,, అమీర్‌పేట్‌కు చెందిన రమేష్, గుంటూరుకు చెందిన బొమ్మ ముని ముఠాగా ఏర్పడి locanto. com అనే వెబ్సైడ్ను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతుల ఫొటోలను అప్లోడ్ చేస్తూ విటులకు వలవేసేవారు. దీనిపై సమాచారం అందడంతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ ద్వారా వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5,960 నగదు, ఒక బైక్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రామలింగ పరారీలో ఉండగా మిగితా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావే«శంలో ఎస్ఓటిసీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ హఫీజ్, సిబ్బంది పాల్గొన్నారు. మరో సంఘటనలో... వెస్ట్ బెంగాల్‌కు చెందిన సంజయ్, రాహుల్ అనే వ్యక్తులు దుండిగల్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే యువకుడితో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాలకు యువతులను సరఫరా చేసేవారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఉప్పల్‌లోని వ్యభిచార కేంద్రంపై దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా ప్రధాన సుత్రధారి సంజయ్ గత కొంత కాలంగా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యిందన్నారు. ప్రవీణ్ సహా ఇద్దరు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంజయ్, రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.