హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
బంగ్లాదేశ్ యువతి అరెస్ట్
మౌలాలి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా తప్పుడు ధృవ పత్రాలతో అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేశారు. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపి ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన కుమార రామలింగ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన యువతి, కుకట్‌పల్లికి చెందిన మధు,, అమీర్‌పేట్‌కు చెందిన రమేష్, గుంటూరుకు చెందిన బొమ్మ ముని ముఠాగా ఏర్పడి locanto. com అనే వెబ్‌సైడ్‌ను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతుల ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ విటులకు వలవేసేవారు.
దీనిపై సమాచారం అందడంతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ ద్వారా వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5,960 నగదు, ఒక బైక్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రామలింగ పరారీలో ఉండగా మిగితా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావే«శంలో ఎస్‌ఓటిసీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ హఫీజ్, సిబ్బంది పాల్గొన్నారు.
మరో సంఘటనలో...
వెస్ట్ బెంగాల్‌కు చెందిన సంజయ్, రాహుల్ అనే వ్యక్తులు దుండిగల్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే యువకుడితో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాలకు యువతులను సరఫరా చేసేవారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఉప్పల్‌లోని వ్యభిచార కేంద్రంపై దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా ప్రధాన సుత్రధారి సంజయ్ గత కొంత కాలంగా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యిందన్నారు. ప్రవీణ్ సహా ఇద్దరు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంజయ్, రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.