
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా చెన్నైలో దేవర టీమ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈవెంట్‌కు హజరైన జూనియర్ ఎన్టీఆర్ దేవర గురించి పలు ఆసక్తికర విషయానలు పంచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. చెన్నై నాకెప్పుడు ప్రత్యేకమే. నా చిన్నప్పుడు కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా దేవర కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మేము అనుకున్న దాన్ని ఫర్‌ఫెక్ట్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం మేమంతా స్ట్రాంగ్ పిల్లర్స్‌లా నిలబడి పనిచేశాం. డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగా నడుచుకున్నాం. దేవర కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకం. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పాత్రను అద్భుతంగా చేసింది. ఆమె నటనను తెరపై చూడాల్సిందే.' అని అన్నారు.
(ఇది చదవండి: దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్‌కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్)
మన భాషలు వేరైనప్పటికీ.. మనందరినీ ఒక్కటిగా చేసేది సినిమా అని ఎన్టీఆర్ తెలిపారు. ఇక్కడ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ కాదు.. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తమిళంలో డైరెక్ట్‌గా సినిమా చేయండి సార్ అని యాంకర్ ప్రశ్నించగా.. నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సర్.. తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేయండి.. తెలుగులో డబ్ చేసుకుంటాం.. అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ ట్విటర్‌లో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
The man of the moment ❤️🔥@tarak9999’s speech at the #Devara Tamil Press Meet! 💥#DevaraOnSep27th pic.twitter.com/hq7L255Nmu
— Devara (@DevaraMovie) September 17, 2024
Comments
Please login to add a commentAdd a comment