Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ? | Bigg Boss 8 Telugu Day 16 Highlights And Full Analysis | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 16 Highlights: సోనియా నువ్వు చీటర్.. కోపం పట్టలేకపోయిన యష్మీ

Published Wed, Sep 18 2024 7:52 AM | Last Updated on Wed, Sep 18 2024 9:26 AM

Bigg Boss 8 Telugu Day 16 Highlights And Full Analysis

బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్‌లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్‌లోనూ రేషన్ కోసం బిగ్‌బాస్ మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ-యష్మి, సీత-నిఖిల్ మధ్య నడిచిన ఫర్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఇంతకీ 16వ రోజు (మంగళవారం) బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందనేది చూద్దాం.

తట్టుకోలేకపోయిన యష్మి
యష్మిని నామినేట్ చేసిన మణికంఠ.. నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టగానే ప్రయత్నించాడు. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనక నుంచి యష్మిని హగ్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకుపడి వదిలెయ్ అని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్‌బాస్‌కి చెప్పింది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)

రేషన్ కోసం మూడు టాస్క్‌లు
ఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం రెండు కాన్స్ (గ్రూప్స్)కి మూడు పోటీలు పెట్టాడు. తొలుత 'ఫొటో పెట్టు ఆగేటట్టు' గేమ్‌లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీమ్ లీడర్స్ ఫొటోలని స్టాండ్‌లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు' అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలని మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టారు. ఇందులో నిఖిల్ శక్తి టీమ్ గెలిచింది.

తొక్కలో సంచాలక్
అయితే రెండో గేమ్‌లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకి చెందిన ప్రేరణ.. మణికంఠపై అ‍గ్గిపై గుగ్గిలం అయింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫ్ఫాడించేసింది. సంచాలక్‌గా తప్పు చేశాడన్నట్లు తొలుత మాట్లాడిన ప్రేరణ.. తర్వాత వెళ్లి అతడికి సారీ చెప్పింది.

బెలూన్ వల్ల గొడవ
'బూరని కొట్టు రేషన్ పట్టు' అని మూడో గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరు స్టిక్‌తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్లు గెలిచినట్లు అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా.. చివరకు బజర్ మోగేసరికి నిఖిల్‌ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది. నిఖిల్ ఒంటిపై ఏం లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్‌గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీమ్ రేషన్ టాస్క్‌లో విజేతగా నిలిచింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. తెర వెనక ఇంత జరిగిందా?)

యష్మి vs సోనియా
కొన్నాళ్లుగా యష్మి, సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్‌లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్‌ను డిక్లేర్ చేశావ్ అని ఫైర్ అయింది. ఏదేమైనా నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి.

పులిహోర కబుర్లు
గేమ్ గురించి పక్కనబెడితే మంగళవారం ఎపిసోడ్‌లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్‌తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ-సోనియా మధ్య కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా? అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది.

ఇక రెండో గేమ్‌లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దుపెట్టేశాడు. అంతకు ముందు కిచెన్‌లోనూ సీత.. పృథ్వీని హగ్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్‌మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి ఈ యవ్వారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాలి?

(ఇదీ చదవండి: Bigg Boss 8: రూల్స్ పాటించరు.. పైగా అరుస్తూ దబాయింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement