
బిగ్‌బాస్ 8 హౌస్ మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరిగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా మిగిలిన ఇంటి సభ్యులు కాస్త గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఎవరికి వాళ్లే హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదంతా పక్కనబెడితే హౌసులో ఉన్న ప్రేరణ ఇంట్లో విషాదం. ఈమె భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయిందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)
గత వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషాకు అంతకు రెండు రోజుల క్రితమే కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపోసిడ్‌లో నాగార్జున చెప్పాడు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తనని బయటకొచ్చేస్తానని కెమెరాలకి చెప్పాడు. అవకాశముంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్‌మేట్స్‌తోనూ అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వహకులు ఎపిసోడ్‌లో చూపించలేదు. బయటకొచ్చిన తర్వాత శేఖర్ భాషా ఇదంతా చెప్పాడు.
ఇక ప్రేరణ విషయానికొస్తే.. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి గానీ తెలుగు సీరియల్స్ చేస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం మంగళవారం ఎపిసోడ్‌లో ఈమెకు చెప్పే అవకాశముంది. ఒకవేళ చెబితే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అలానే ఇంట్లో బాధతో గేమ్‌పై దృష్టి పెడుతుందా లేదంటే హౌస్ నుంచి బయటకు పంపే ప్లాన్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment