ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్ | Singer Mano Sons Arrested In Police Case | Sakshi
Sakshi News home page

Singer Mano Sons: గొడవపడి పరారీ.. ఇప్పుడు పోలీసులకు దొరికి

Sep 17 2024 2:14 PM | Updated on Sep 17 2024 4:28 PM

Singer Mano Sons Arrested In Police Case

తెలుగులో ఎన్నో పాటలతో ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కుమారుల్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారం క్రితం ఓ గొడవ జరగ్గా, వెంటనే వీళ్లిద్దరూ పరారయ్యారు. దీంతో మనో మేనేజర్, ఇంటి పనిమనిషిని తొలుత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కొడుకుల్ని అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ విషయం తమిళ, తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

అసలేం జరిగింది?
చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మధురవాయల్‌కి చెందిన 16 ఏళ్ల కుర్రాడు.. శ్రీదేవికుప్పంలోని ఫుట్‪‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. గత మంగళవారం రాత్రి శిక్షణ పూర్తయ్యాక.. వలసరవాక్కంలోని ఓ హోటల్‌లో డిన్నర్ చేయడానికి వెళ్లారు. ఆ టైంలో అక్కడికి సింగర్ మనో ఇద్దరు కొడుకులు రఫీ, షకీర్ మరో ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

రక్తలొచ్చేలా కొట్టారు
మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు.. కృపాకరన్‌తో గొడవపడ్డారు. తర్వాత కృపాకరన్‌ని ఐదుగురు కలిసి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్‌ని స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్రత్రిలో చేర్చారు. కృపాకరన్ ఫిర్యాదు మేరకు సింగర్ మనో కుమారులు సహా వారి స్నేహితులపై పోలీసు కేసు నమోదు చేశారు.

ఎట్టకేలకు అరెస్ట్
వీరిలో తొలుత ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. దీంతో మనో మేనేజర్, ఇంటి పనిమనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు మనో కొడుకులు రఫీ, షకీర్‌ని అరెస్ట్ చేశారు. ఇకపోతే దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న మనో.. ఇప్పుడు కొడుకుల వల్ల అవమానం ఎదుర్కొంటున్నారు.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement