బిగ్‌బాస్ 8 ప్రస్తుతం 16వ రోజు వరకు వచ్చేసింది. హౌస్‌లో ఇన్నిరోజులు ఉన్నారంటే ఎప్పుడు ఎలా ఆడాలి? గేమ్‌లో ఎలా గెలవాలి? అనేది కంటెస్టెంట్స్‌కి అర్థమైపోవాలి. కానీ కొందరికీ అవి అర్థం కావట్లేదా? తెలియనట్లు ప్రవర్తిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ప్రేరణ, అభయ్ తీరు చూస్తే అలానే అనిపించింది. తొకల్లో సంచాలక్ అని ఒకరంటే.. ఇకపై గేమ్స్ ఆడను, కావాలంటే బయటకు పంపేయ్ అని మరొకరు అన్నారు.
రేషన్ గెలవడం కోసం ఇచ్చిన రెండో టాస్క్ 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు'. ఇందులో భాగంగా క్యాబేజీని నత్తలా పాకుతూ తలతో కొంతదూరం తోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రెండు క్లాన్స్ సభ్యులు బాగానే ఆడారు. అయితే గేమ్ సంచాలక్‌గా వ్యవహరించిన నాగమణికంఠతో ప్రేరణ గొడవపడింది. తొక్కలో సంచాలక్ అని అరుస్తూ గట్టిగానే చెప్పింది.
(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)
ఇక మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన మూడో టాస్క్ 'బూరని కొట్టు రేషన్ పట్టు'. ఇందులో భాగంగా తలో టీమ్ నుంచి ఒక్కొక్కరు ఒళ్లంతా బూరలు అంటించుకుని బాక్సులో ఉంటారు. ఒకరు బూరల్ని మరొకరు ఇచ్చిన టైంలో పేలగొట్టాల్సి ఉంటుంది. నిఖిల్‌తో పోటీపడిన అభయ్ నవీన్.. పదేపదే గీత దాటి బయటకొచ్చేశాడు. సంచాలక్ సోనియా ఇదే విషయం చెప్పినా వినిపించుకోలేదు. తీరా నిఖిల్‌ని విజేతగా ప్రకటించేసరికి రెచ్చిపోయాడు. ఇక నుంచి ఏ గేమ్ ఆడను, బయటకు పంపించేసిన ఓకే అని కెమెరా వంక చూస్తూ సీరియస్‌గా చెప్పాడు. అంటే ఏం చేస్కుంటావో చేస్కో అని బిగ్‌బాస్‌ని అన్నట్లే.
పైరెండు సందర్భాలు చూస్తే ప్రేరణ, నవీన్ ఇద్దరు కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ గేమ్ రూల్స్ పాటించలేదని విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జునతో చెప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారా? లేదంటే ఇది వాళ్ల గేమ్ ప్లాన్ అనేది తెలియాలి. ఇంకా ఈ రోజు ఏమేం జరిగిందో చూడాలి?
(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment