Janhvi Kapoor Wants To Work With Director Vetrimaaran Deets Inside - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆ దర్శకుడి సినిమాలో నటించాలని ఉంది

Published Wed, Jul 20 2022 10:28 AM | Last Updated on Wed, Jul 20 2022 1:28 PM

Janhvi Kapoor Wants To Work With Director Vetrimaaran - Sakshi

దివంగత నటి శ్రీదేవి సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెను అక్కడ కూడా సక్సెస్‌ వరించింది. తాజాగా ఆమె వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతున్నారు. తమిళం, మలయాళం భాషల్లో హిట్‌ అయిన చిత్రాలను హిందీ రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

అలా ఆమె మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్‌ హిందీ రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. అలాగే తమిళంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు.

కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్‌ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement