
నెలసరిలో అమ్మాయిలు ఎదుర్కునే ఇబ్బందులు అబ్బాయిలకు అర్థం కావు అంటోంది హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మన పరిస్థితిని కొంచెమైనా అర్థం చేసుకోరని, మన బాధ వాళ్లకు పట్టదని పేర్కొంది. తాజాగా ఆమె రుతుక్రమం గురించి మాట్లాడుతూ.. పీరియడ్స్ సమయంలో మేమేదైనా చెప్తున్నా.. వాదిస్తున్నా మీరేమంటారో తెలుసా? నెలసరిలో ఉన్నావా? అని కొట్టిపారేస్తారు. నిజంగా మీరు మమ్మల్ని అర్థం చేసుకునేవారే అయితే.. సరే.. కొంచెం సమయం తీసుకో.. నెలసరిలో ఉన్నట్లున్నావ్ అని పద్ధతిగా అడుగుతారు.
మీరు భరించలేరు
పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు, ఎలా ఉంటామో అర్థం కాదు. మేం అనుభవించే బాధను మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాం. కానీ కొందరు అస్సలు పట్టించుకోరు. నిజం చెప్తున్నా.. అబ్బాయిలు నెలసరి నొప్పిని, మూడ్ స్వింగ్స్‌ను ఒక్క నిమిషం కూడా భరించలేరు. పురుషులకు పీరియడ్స్ వస్తే ఎలాంటి అణు యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు? అని చెప్పుకొచ్చింది.
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ
జాన్వీ కపూర్ చివరగా దేవర:పార్ట్ 1 సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సన్నీ సంస్కారీకి తులసి కుమారి సినిమాతో బిజీగా ఉంది. అలాగే పరమ సుందరి, పెద్ది చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగు సినిమా పెద్ది విషయానికి వస్తే.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నారు.
చదవండి: పిట్ట కొంచెం...కలెక్షన్స్ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు