‘‘అమరన్’ సినిమాని కాస్త ఆలస్యంగా చూశాను. అయితే 2024 సంవత్సరాన్ని ఇలాంటి ఒక అద్భుతమైన, ఒక మంచి సినిమా చూసి ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జోడీగా నటించిన ద్విభాషా చిత్రం (తమిళ్, తెలుగు) ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా 2024 అక్టోబరు 31న విడుదలైంది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు.. ఈ చిత్రంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా జాన్వీ కపూర్ కూడా ‘అమరన్’ మూవీపై తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ‘‘అమరన్’ సినిమాని నేను చూడడం ఆలస్యమైంది. కానీ, ఎంతో అద్భుతమైన సినిమా. ప్రతి సన్నివేశం చాలా భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్ మూవీ. ఈ చిత్రం నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయాన్ని బరువెక్కించాయి. ఓ ప్రేక్షకురాలిగా 2024ని ఇలాంటి ఒక మంచి సినిమాతో ముగించడం సంతోషంగా ఉంది’’ అని పోస్ట్ చేశారామె. కాగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment