
ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా మిసెస్ (Mrs). మలయాళంలో వచ్చిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా (The Great Indian Kitchen Movie)కి ఇది హిందీ రీమేక్. సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో పాటు గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా మిసెస్ రికార్డు సృష్టించింది.
ఓటీటీలో సూపర్ హిట్ సినిమాగా మిసెస్
పెళ్లి తర్వాత ఎంతోమంది అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో సన్యా.. రిచా పాత్రలో జీవించేసింది. ఇంతకుముందు కూడా ఆమె విభిన్నరకాల పాత్రలు పోషించింది. దంగల్, హిట్: ద పస్ట్ కేస్ (హిందీ), కాథల్, పాగ్‌లైట్ (Pagglait) వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఇంకా సెకండ్ హీరోయిన్ ఏంటి?
'ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమవుతోంది. తొమ్మిదేళ్లకాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రెండే రెండు సినిమాలు థియేటర్‌లో రిలీజయ్యాయి. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా చేస్తోంది. అందులో జాన్వీ (Janhvi Kapoor) ఫస్ట్ హీరోయిన్ అయితే సన్యా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది' అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. జనాలకు ఏం కావాలో బాలీవుడ్ అస్సలు పట్టించుకోదు. జాన్వీ కంటే కూడా సన్యా చాలా గొప్ప నటి, పెద్ద సినిమాల్లో తనకు కథానాయికగా అవకాశాలివ్వొచ్చుగా అంటున్నారు.
ఇలాంటివారు దొరకడమే అరుదు
'దర్శకుల కంటికి ఈమె ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదు. తను నటించగలదు, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలదు. ఈ జనరేషన్‌లో ఇలాంటి రెండు లక్షణాలున్నవారు దొరకడం చాలా అరుదు. పైగా తను ఎలాంటి జానర్‌లోనైనా ఇట్టే ఇమడగలదు', 'ఇప్పుడు ఇండస్ట్రీలో సన్యా ఉత్తమ నటి. కానీ తనకు మంచి అవకాశాలు రావడం లేదు' అని కామెంట్లు చేస్తున్నారు. మిసెస్ సినిమా విషయానికి వస్తే.. దీనికి అరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిశాంత్ దహియా, కన్వల్‌జిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.
చదవండి: తెలుగు సినిమా సెట్‌లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment