కేజీఎఫ్‌ నేపథ్యంలో... | Dhanush and Vetrimaaran reunite for their fifth collaboration New Film | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌ నేపథ్యంలో...

Published Tue, Jan 14 2025 2:56 AM | Last Updated on Tue, Jan 14 2025 2:56 AM

Dhanush and Vetrimaaran reunite for their fifth collaboration New Film

హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ఈ కాంబినేషన్‌లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్‌’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్‌’ (2019) వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సంస్థ నిర్మించనుంది. విజయ్‌ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్‌లో 25 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్‌–వెట్రిమారన్‌ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సంస్థ. కాగా ధనుష్‌తో వెట్రిమారన్‌ చేయనున్న మూవీ కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్‌ సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement