Allu Aravind Interesting Comments About Vidudhala Part1 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Vidudhala Part1: ఈ సినిమాను మీడియానే ప్రజల వద్దకు తీసుకెళ్లాలి

Published Tue, Apr 11 2023 6:53 PM | Last Updated on Tue, Apr 11 2023 7:01 PM

Allu Aravind Talk About Vidudhala Part1 Movie - Sakshi

‘విడుతలై పార్ట్ 1’ సినిమా చూసిన తర్వాత  క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కోరారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ . విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 31న తమిళ్‌లో విడుదలై  హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’గా ఏప్రిల్‌ 15న విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేశారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా వెట్రిమారన్‌ అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు’ అన్నారు. 

‘నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే  ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ’ అని వెట్రిమారన్‌ అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’అని నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌ అన్నారు. ఈ సమావేశంలో హీరో సూరి, హీరోయిన్‌ భవాని శ్రీ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement