Vidudhala Part1
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. నటుడు సూరికి ఈ మూవీ ఎంతో పేరు తెచ్చింది. సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన 'విడుదల పార్ట్ 2' రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో తెలుగు, తమిళంలో దీనిని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి. 'విడుదల పార్ట్ 2'లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ఢీ కొట్టాల్సి ఉంది. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా కూడా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇలా రెండు బిగ్ ప్రాజెక్ట్‌ల మధ్య 'విడుదల పార్ట్ 2' సినిమా రిలీజ్ కానుంది. Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw— VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024 -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు, తమిళంలో "విడుదల 2" ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.విడుదల పార్ట్ 1కు మంచి స్పందనఈ సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా ఎంతో సంతోషించాం. విడుదల పార్ట్ 1 అంచనాలను మించి విజయం సాధించింది. నటుడు సూరికి ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అప్పుడే రిలీజ్దర్శకుడు వెట్రిమారన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తాం అన్నారు. ఈ మూవీలో భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. A new chapter begins with #VidudalaPart2 Directed by the visionary #VetriMaaran! 🌟First Look is Out #ValourAndLove An @ilaiyaraaja Musical @VijaySethuOffl @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72 #Kishore… pic.twitter.com/0XGtTvdlE2— Shreyas Sriniwaas (@shreyasmedia) July 17, 2024 చదవండి: బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ -
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.సూర్య ప్రధాన పాత్రలో 'వాడివాసల్' చిత్రాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాడివాసల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం. -
క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్ట్‌లోకి నయనతార
తమిళ చిత్ర పరిశ్రమలో వెట్రిమారన్‌కు దర్శకుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడుగళంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే ఆ చిత్ర కథానాయకుడు ధనుష్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించారు. ఆ తర్వాత విచారణై, అసురన్, విడుదలై ఇలా వరుసగా వైవిద్యభరిత కథా చిత్రాలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా గ్రాస్ రూట్ ఫిలిమ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉదయం ఎల్‌హెచ్ 4, పొరియాళన్, కాక్కా ముట్టై, విచారణై, వడ చైన్నె వంటి సక్సెస్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న వెట్రిమారన్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. విశేషమేమిటంటే ఇందులో నయనతార నాయకిగా నటించబోతున్నారట. బిజీగా ఉన్న ఈ భామ త్వరలో తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా దర్శకుడు వెట్రిమారన్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి వెట్రిమారన్ శిష్యుడు విక్రమన్ అశోకన్ దర్శకత్వం వహించారన్నారు. ఇందులో నటుడు కవిన్ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
విడుదల సినిమా టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
Vidudhala Movie Review: వెట్రిమారన్ ‘విడుదల పార్ట్-1’ రివ్యూ
టైటిల్: విడుదల పార్ట్-1 నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు నిర్మాత : ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం: వెట్రిమారన్ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ విడుదల తేది: ఏప్రిల్ 15, 2023 కథేంటంటే.. పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్ : 2.75/5 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విడుదల పార్ట్ 1’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
Vidudhala Part1: ఈ సినిమాను మీడియానే ప్రజల వద్దకు తీసుకెళ్లాలి
‘విడుతలై పార్ట్ 1’ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోరారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ . విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 31న తమిళ్లో విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’గా ఏప్రిల్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేశారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా వెట్రిమారన్ అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు’ అన్నారు. ‘నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ’ అని వెట్రిమారన్ అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’అని నిర్మాత ఎల్రెడ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో హీరో సూరి, హీరోయిన్ భవాని శ్రీ తదితరులు పాల్గొన్నారు.