రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా | Vijay Sethupathi Viduthalai Part 2 Release Date Locked | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా

Published Thu, Aug 29 2024 7:56 PM | Last Updated on Thu, Aug 29 2024 8:23 PM

Vijay Sethupathi Viduthalai Part 2 Release Date Locked

దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌గా నిలిచింది. నటుడు సూరికి ఈ మూవీ ఎంతో పేరు తెచ్చింది.  సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన 'విడుదల పార్ట్‌ 2'  రిలీజ్‌ తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో తెలుగు, తమిళంలో దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవ‌ల మ‌హారాజ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న విజ‌య్ సేతుప‌తి. 'విడుదల పార్ట్‌ 2'లో కీలకపాత్రలో కనిపించనున్నాడు.  ఈ చిత్రాన్ని క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.  ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్'  చిత్రాన్ని ఢీ కొట్టాల్సి ఉంది. శంక‌ర్ డైరెక్షన్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్‌ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దిల్‌ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్‌ పుష్ప-2 సినిమా కూడా డిసెంబర్‌ 6న విడుదల కానుంది. ఇలా రెండు బిగ్‌ ప్రాజెక్ట్‌ల మధ్య 'విడుదల పార్ట్‌ 2' సినిమా రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement