ఓటీటీలో విజయ్‌ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్‌ | Vidudala Part 1 Movie OTT Streaming Now Free Of Cost | Sakshi
Sakshi News home page

ఓటీటీలో విజయ్‌ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Published Sun, Dec 15 2024 11:25 AM | Last Updated on Sun, Dec 15 2024 11:49 AM

Vidudala Part 1 Movie OTT Streaming Now Free Of Cost

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. సీక్వెల్‌ రిలీజ్‌కు ముందు 'విడుద‌ల-1' సినిమాను  జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.

విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర​్‌లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్ష‌న్ డ్రామా మూవీ వంద మిలియ‌న్ల‌కుపైగానే వ్యూస్‌ను క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్‌-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం  డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన విడుద‌ల పార్ట్‌-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇందులో విజ‌య్ సేతుప‌తి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్‌-2లో మాత్రం మంజు వారియర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సీక్వెల్‌లో విజ‌య్ సేతుప‌తి కుమారుడు సూర్య సేతుప‌తి కూడా ఒక కీలక పాత్రలో క‌నిపించనున్నారని ప్రచారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement