
కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ రానున్నట్ల నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. తాజాగా విషయంపై స్పందించిన డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విడుదల పార్ట్-1 తెలుగులో రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన విడుదలై: పార్ట్1 ప్రేక్షకులను అలరిస్తోంది.
వెట్రిమారన్ మాట్లాడుతూ..' 'అసురన్' మూవీ తర్వాత లాక్‌డౌన్ ముగిశాక ఎన్టీఆర్‌ను కలిశా. మేమిద్దరం చాలా విషయాలు చర్చించుకున్నాం. అయితే ఆయనతో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న విషయంపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కేవలం స్టార్ వాల్యూ, కాంబినేషన్ మాత్రమే కాకుండా తాను ఎంచుకునే కంటెంట్ డిమాండ్ చేస్తే అతడితో సినిమా చేస్తా.' అంటూ వెట్రిమారన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
వెట్రిమారన్ ప్రస్తుతం విడుదల:పార్ట్1'కు సీక్వెల్‌గా 'పార్ట్2' తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత సూర్యతో 'వాడివాసల్' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.
I will only Collaborate For A Content that will Demand A Star like @tarak9999 - #vetrimaaran 👌🔥❤️🔥. pic.twitter.com/9BTYhcGwNq
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment