అన్నపూరణి చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అన్నపూరణి. ఇది ఆమె నటించిన 75వ చిత్రం కావడం గమనార్హం. నీలేష్ కృష్ణ ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. నటుడు జయ్, సత్యరాజ్, రెడిన్‌కింగ్స్‌లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో గోడకు కొట్టిన బంతిలా అన్నపూరణి చిత్రం ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆవిధంగా నైనా సేఫ్ అవుదాం అనుకుంటే వివాదాల్లో చిక్కుకుంది.
చిత్రంలోని శ్రీరాముడు కూడా మాంసం భుజించారు అన్న సంభాషణ అన్నపూరిణి చిత్రాన్ని చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రం ఒక సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఇది లవ్ జిహాద్‌ను ఆదరించే చిత్రంగా ఉందంటూ ముంబైకి చెందిన శివసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ సోలంకి ముంబై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది లేనిపోని వివాదాలకు తెచ్చిపెట్టే విధంగా ఉందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అన్నపూరణి చిత్ర స్ట్రీమింగ్‌ను నిలిపేసింది. అయితే దీనిపై పలువురు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు వెట్రిమారన్ కూడా అన్నపూరణి చిత్ర విషయంలో నెట్‌ఫ్లిక్స్ చర్యలను తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఒక చిత్రాన్ని అనుమతించడానికై నా, నిషేధించడానికి అయినా సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు జరిగిన ఘటన సెన్సార్ బోర్డు అధికారాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment