Annapoorani Movie
-
ఒక్క సీన్ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార రీసెంట్గా అన్నపూరణి చిత్రంతో దిగ్విజయంగా 75 చిత్రాలను పూర్తి చేసుకుంది. యోగి,చంద్రముఖి,యోగి, బిల్లా, కర్తవ్యం, శ్రీరామరాజ్యం, మాయ, అరం వంటి విభిన్నమైన కథా చిత్రాల ద్వారా నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ను చేశాయి. ఇకపోతే వ్యక్తిగతంగా ఎన్నో అవరోధాలను అధిగమించి ఇండియన్ స్టార్‌గా వెలుగొందుతున్నా రు. కెరీర్ ప్రారంభంలో నటుడు శింబుతో రొమాన్స్, లిప్‌లాక్ దృశ్యాలతో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఆ తరువాత నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో సహజీవనం, మతం మార్పు వంటి సంఘటనలతో వార్తల్లో కెక్కారు. ఆ తరువాత దర్శకుడు విగ్నేశ్ శివన్‌తో పరిచయం ప్రేమగా మారడం, అలా ఆరేళ్ల ప్రేమ పెళ్లికి దారి తీయడం, పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కావడం వంటి సంఘటనలు అన్నీ నయనతార కేరీర్లో సంచలన సంఘటనలే. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్‌పుల్‌గా జరిగింది. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకూ వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార ఇప్పుడు ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక్క వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారన్నది తాజా సమాచారం. ఇటీవల టాటా స్కై ప్రకటనలో నటించడానికి, మామిడి రసం ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇవి కేవలం 50 సెకన్ల నిడివితో కూడిన ప్రకటనలు అన్నది గమనార్హం. దీంతో నయనతార మజాకా అంటున్నారు నెటిజన్లు. ఇప్పుటికీ చేతి నిండా చిత్రాలతో ఈ భామ బిజీగా ఉన్నారు. -
గాయపరిచి ఉంటే క్షమించండి
నయనతార కెరీర్లో 75వ చిత్రం ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 1న థియేటర్స్‌లో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరచేలా ఉందనే వివాదం రేగింది. దాంతో ‘అన్నపూరణి’ ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఈ విషయంపై తాజాగా నయనతార స్పందించి, ఓ లేఖను విడుదల చేశారు. ‘‘బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాశాను. కేవలం కమర్షియల్ అంశాలనే కాదు... సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అనే సానుకూల ఆలోచనతోనే ‘అన్నపూరణి’ సినిమా తీశాం. అయితే మాకు తెలియకుండానే కొందరి మనసులను మేం గాయపరిచామని అర్థమైంది. కానీ ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మా టీమ్‌కు లేదు. సెన్సార్ సర్టిఫికెట్తో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన మా మూవీని అక్కడ్నుంచి తొలగించడం అనేది ఆశ్చర్యపరిచింది. నేను భగవంతునిపై నమ్మకంతో ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటాను. అలాంటి నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులను గాయపరచాలని అనుకోను. ఏది ఏమైనా మీ మనోభావాలను గాయపరచి ఉంటే క్షమించండి.. జై శ్రీరామ్’’ అని ఆ లేఖలో నయనతార పేర్కొన్నారు. -
జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన సినీ జీవితంలో 75వ సినిమాగా 'అన్నపూరణి' ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. గతేడాది డిసెంబర్ 1న వచ్చిన ఈ సినిమా ఆపై నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అయింది. కానీ ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఇందులో కొన్ని సీన్లు హిందూవుల మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని.. అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆయన ఆరోపించారు. దీంతో నయనతారపై కేసు కూడా నమోదు అయింది. ఆ తర్వాత 'అన్నపూరణి' చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ నుంచి కూడా ఆ సంస్థ తొలగించింది. తాజాగా ఈ వివాదంపై నయనతార రియాక్ట్ అయింది. నయనతార తాజాగా క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పేజీలో జై శ్రీరామ్ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో 'గత కొన్ని రోజులుగా నా సినిమా 'అన్నపూరణి' చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బరువెక్కిన హృదయంతో, స్వయం సంకల్పంతో ఈ ప్రకటన చేస్తున్నాను. ‘అన్నపూరణి’ సినిమాను కేవలం కమర్షియల్ ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి ఓ మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా మాత్రమే మేము చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే రీతిలో ‘అన్నపూరాణి’ సినిమాను తెరకెక్కించాం. అన్నపూర్ణి ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని మేము అందరం భావించాము. కానీ తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని అర్థమౌతుంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొంది ఆపై థియేటర్లో విడుదలైన ఒక చిత్రం OTT నుంచి తీసివేయబడింది, ఇది మాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు, నా టీమ్‌కు లేదు. నేను భగవంతునిపై ఎంతో నమ్మకంతో అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే వ్యక్తిని కానీ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు.. చేయను కూడా. అంతకు మించి మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. అన్నపూర్ణి చిత్రం అసలు ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదు, ప్రేరేపించడం మాత్రమే. నా 20 ఏళ్ల సినీ జర్నీ లక్ష్యం ఒక్కటే. సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేయడం ఆపై ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం మాత్రమే అని నేను ఇక్కడ మరోసారి సూచించాలనుకుంటున్నాను.' అని నయనతార తెలిపింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
‘అన్నపూరణి ’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం సరైనది కాదు: వెట్రిమారన్
అన్నపూరణి చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అన్నపూరణి. ఇది ఆమె నటించిన 75వ చిత్రం కావడం గమనార్హం. నీలేష్ కృష్ణ ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. నటుడు జయ్, సత్యరాజ్, రెడిన్కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో గోడకు కొట్టిన బంతిలా అన్నపూరణి చిత్రం ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆవిధంగా నైనా సేఫ్ అవుదాం అనుకుంటే వివాదాల్లో చిక్కుకుంది. చిత్రంలోని శ్రీరాముడు కూడా మాంసం భుజించారు అన్న సంభాషణ అన్నపూరిణి చిత్రాన్ని చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రం ఒక సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఇది లవ్ జిహాద్‌ను ఆదరించే చిత్రంగా ఉందంటూ ముంబైకి చెందిన శివసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ సోలంకి ముంబై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది లేనిపోని వివాదాలకు తెచ్చిపెట్టే విధంగా ఉందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అన్నపూరణి చిత్ర స్ట్రీమింగ్‌ను నిలిపేసింది. అయితే దీనిపై పలువురు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ కూడా అన్నపూరణి చిత్ర విషయంలో నెట్‌ఫ్లిక్స్ చర్యలను తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఒక చిత్రాన్ని అనుమతించడానికై నా, నిషేధించడానికి అయినా సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు జరిగిన ఘటన సెన్సార్ బోర్డు అధికారాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉందన్నారు. -
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్‌పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
అన్నపూరణి ఆగింది
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్ వన్ చెఫ్ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది. అది మాత్రమే కాదు.. ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడుతుంది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘అన్నపూరణి’ చిత్రం ప్రధానాంశం ఇది. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో జతిన్ సేథీ, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై, అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకులను కొంత ఆకట్టుకోగలిగింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఓ బ్రాహ్మణ యువతి మాంసాహారం వండటం, ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశం వివాదమైంది. పైగా రాముడు కూడా మాంసాహారం తిన్నాడన్నట్లు, వాల్మీకి అయోధ్య కాండలో ఉందన్నట్లు ఓ డైలాగ్ కూడా ఉంది. ఓ దేవత (అన్నపూర్ణ) మీద టైటిల్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ మొదలుపెట్టారు. అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయనతారపై కూడా కేసు నమోదైంది. వివాదం పెద్దదవుతుండటంతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ విధంగా ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగింది. -
నయనతారపై కేసు నమోదు
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్లో బెంచ్‌మార్క్ చిత్రంగా 'అన్నపూరణి' గతేడాది డిసెంబరు 1న విడుదలైంది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా 'అన్నపూరణి' ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో థియేటర్లలో కూడా అంతగా మెప్పించలేక పోయింది. కొద్దిరోజుల క్రితం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తమిళ్, తెలుగు,హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో 'అన్నపూరణి' చిత్రాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని.. అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అటు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో హిందూసేవ పరిషత్ ఫిర్యాదు మేరకు అన్నపూరణి చిత్రయూనిట్‌తో పాటు, నెట్ఫ్లిక్స్పైనా కేసు నమోదైంది. ఇలా ఈ చిత్రంపై వరుస వివాదాలు ముసురుకోవడంతో నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గి అన్నపూరణి చిత్రాన్ని తొలగించేసింది. 'అన్నపూరణి' కథేంటి? తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే. -
వివాదంలో నయనతార సినిమా..!
-
నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని.. అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. I have filed complain against #AntiHinduZee and #AntiHinduNetflix At a time when the whole world is rejoicing in anticipation of the Pran Pratishtha of Bhagwan Shri Ram Mandir, this anti-Hindu film Annapoorani has been released on Netflix, produced by Zee Studios, Naad Sstudios… pic.twitter.com/zM0drX4LMR — Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) January 6, 2024 -
థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకోని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే ఘోరమైన డిజాస్టర్స్ అవుతుంటాయి. తీరా ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత మాత్రం ఊహించని విధంగా ట్రెండింగ్‌లో టాప్ లేపుతుంటాయి. తాజాగా ఓ సినిమా ఇలాంటి ఫీట్ సాధించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ అనగానే నయనతార గుర్తొస్తుంది. 40కి దగ్గర పడుతున్న ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. అలా కొన్నిరోజుల ముందు డిసెంబరులో 'అన్నపూరణి' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చింది. కానీ కథ ఓకే ఓకేలా ఉండటం, అదే టైంలో తమిళనాడులో వరదలు రావడం మొత్తానికే మైనస్ అయిపోయింది. (ఇదీ చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!) అలా థియేటర్లలో 'అన్నపూరణి' చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఊహించని విధంగా ఓటీటీలో మాత్రం అగ్రస్థానం దక్కించుకోవడంతో పాటు ట్రెండింగ్లోనూ నిలవడం విశేషం. 'అన్నపూరణి' కథేంటి? తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) -
ఇయర్ ఎండింగ్.. ఓటీటీలో కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
చూస్తుండగానే రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. అప్పుడే 2023కి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎవరికి వారు ఇయర్ ఎండింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని రకరకాలుగా ప్లాన్ చేసుకుని ఉంటారు. అటు ఓటీటీలు సైతం ఈ ఏడాదికి ఘన ముగింపు పలుకుతూ కొత్త చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. చాలా చిత్రాలు, సిరీస్‌లు ఈరోజే రిలీజవగా మరికొన్ని రేపు (డిసెంబర్ 29న) విడుదల కానున్నాయి. అందులో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుని చూసేసి 2023కి గుడ్‌బై చెప్పేయండి.. హాట్‌స్టార్ ► 12th ఫెయిల్ (హిందీ సినిమా) - డిసెంబర్ 29 నెట్‌ఫ్లిక్స్ ► లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► మిస్ శాంపో (మాండరిన్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► పోకేమన్ కన్సెర్జ్ (జపనీస్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్ ► అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 29 ► బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబర్ 29 ► బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 29 ► శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ చిత్రం) - డిసెంబర్ 29 ► త్రీ ఆఫ్ అజ్ (హిందీ మూవీ) - డిసెంబర్ 29 ► బిట్చ్ అండ్ రిచ్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 29 ► ది అబాండన్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 29 జీ5 ► దోనో (హిందీ మూవీ) - డిసెంబర్ 29 ► వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబర్ 29 ► సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబర్ 29 బుక్ మై షో ► ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ► ద కర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - డిసెంబర్ 29 సింప్లీ సౌత్ ► స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ) - డిసెంబర్ 29 చదవండి: రైతుబిడ్డ చచ్చిపోదామనుకున్నాడు.. మేము లేకపోయుంటే.. భోలె ఎమోషనల్ కామెంట్స్ -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి వీకెండ్‌తో 2023కి ఎండ్ కార్డ్ పడనుంది. గత శుక్రవారం థియేటర్లలోకి 'సలార్' వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ 'డెవిల్', సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న 'బబుల్గమ్' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్, నయనతార 'అన్నపూరణి'.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి కానీ అవి రిలీజైతే గానీ వాటి సంగతేంటనేది తెలీదు. మరి ఏ మూవీ ఏ ఓటీటీల్లో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే క్రేజీ మూవీస్ (డిసెంబరు 25 నుంచి 31 వరకు) నెట్‌ఫ్లిక్స్ రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25 స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25 కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26 థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26 ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27 హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27 లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28 మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28 పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28 అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29 బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29 శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29 త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31 ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31 అమెజాన్ ప్రైమ్ కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27 టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31 హాట్‌స్టార్ మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 జీ5 దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29 వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29 జియో సినిమా ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25 ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30 లయన్స్ గేట్ ప్లే ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29 బుక్ మై షో ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29 (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
ఓటీటీలో నయనతార 'అన్నపూరణి'.. తెలుగులోనూ విడుదల
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్లో బెంచ్‌మార్క్ చిత్రంగా 'అన్నపూరణి' విడుదలైంది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అన్నపూరణి' ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. కానీ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. సినిమా బాగున్నా.. దెబ్బకొట్టిన వర్షాలు సినిమా బాగుందని టాక్ వస్తున్న సమయంలో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అన్నపూరణి మూవీ జనాలకు పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది. ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కోరిక ఆమెలో ఉంటుంది. దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు. అయితే, తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా నయనతార ఎలా ఎదిగింది. ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే సవాల్ ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ హిందూ, బ్రాహ్మణ సంఘాలు నయనతార సినిమాపై తీవ్రంగా మండిపడ్డాయి. ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే తాజాగా 'అన్నపూరణి' ఓటీటీలోకి రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ 'అన్నపూరణి' స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కూడా సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. 2023 ఎండింగ్లో చాలామందిని మెప్పించిన ఈ సినిమాను ఇంట్లోనే చూసేయండి. #MaulaMeraMaula A Video Song from #Annapoorani is Out Now! 🩶🤍🔥🔥🔥🔥 🔗https://t.co/cAdMQkAJjE#Nayanthara#20YearsOfNayanism pic.twitter.com/5lz48TSZmj — 𝐉𝖊𝖊𝖛𝖆.𝐑 (@jeeva_rrr) December 24, 2023 -
10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార
నీలేష్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై, సత్యరాజ్, తదితరులు నటించిన చిత్రం 'అన్నపూరణి' డిసెంబర్ 1న తమిళంలో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని జి స్టూడియోస్, నాట్ స్టూడియోస్ నిర్మించాయి. చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక బ్రాహ్మణ యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రం. రాజా రాణి తర్వాత జై, నయనతార జంటగా ఈ చిత్రంలో నటించారు. అన్నపూరణి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటులు జై, నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో జై, నయనతారల కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు, నయనతార మాట్లాడుతూ.. 'రాజా రాణిలో 20 నిమిషాలు మాత్రమే మేమిద్దరం నటించాము. ఆ సినిమా షూటింగ్ తర్వాత మేము మంచి స్నేహితులం అయ్యాం. వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నాం. రాజా రాణి సినిమాలో మేము ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామో అదే విధంగా ఈ సినిమాలో కూడా నటించాం. ఈ సినిమాలో మేము నటించిన సన్నివేశాలు అన్నీ సహజంగానే ఉంటాయి. నేనెలా నటిస్తానో, కెమెరా ముందు జై ఎలా నటిస్తాడో అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు.' అని ఆమె అన్నారు. నటుడు జై మాట్లాడుతూ 'మహిళల నేపథ్యంలో సాగే చిత్రంలో నయనతారతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మనం తెరపై నేచురల్‌గా మాట్లాడుతూ నటిస్తే అభిమానులకు నచ్చుతుంది. నటించేటప్పుడు మాకు మంచి అవగాహన ఉంటుంది. మేమిద్దరం కలిసి నటించేటప్పుడు మానిటర్ వైపు కూడా చూడము. సెట్లో కెమెరా ముందు నయనతార నటనను చూసిన వారు ఎవరైనా ఆమెను లేడీ సూపర్‌స్టార్ అనాల్సిందే అని నేను అంటే.. నయనతార, ''అలా అనకండి, చెబితే తిడతారు. కొంతమంది నేను ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని అంటారు. నేను అమ్మాయిని కాబట్టి నాపై విరుచుకుపడతారు.. మళ్లీ నాపై విమర్ళలు మెదలుపెడుతారంటూ ఇలా చెప్పింది. అన్నపూరణి చిత్రానికి సంబంధించినంతవరకు అన్ని విషయాలు తన ఇష్ట్రపకారం జరిగాయని చెప్పింది. ఒక్క లేడీ సూపర్‌స్టార్ అన్న టైటిల్ కార్డ్ మినహా. అది మాత్రం తన అనుమతి లేకుండా జరిగిందని పేర్కొంది. దాని గురించి దర్శకుడిని అడిగితే అది సర్ప్రైజ్ కోసం అని చెప్పారన్నారంది. నిజం చెప్పాలంటే తనను లేడీ సూపర్‌స్టార్ అంటే 10 మంది సంతోషపెడితే 50 మంది తిట్టుకుంటున్నారంది. బహుశా అలా అనిపించుకునే స్థాయికి ఎదిగానో లేదో తెలియదన్నారు. ఇదీ చదవండి: నయనతార 75వ మూవీ 'అన్నపూరణి' రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అనే బిరుదు కేవలం రజనీకాంత్‌కు మాత్రమే ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు. ఆ ట్యాగ్‌లైన్‌ను ఎవరికీ ఉపయోగించకూడదని వారి అభిప్రాయం. కానీ అన్నపూరణి చిత్రంలో లేడి సూపర్ స్టార్ అని టైటిల్ కార్డులో పడటంతో ఆమెపై రజనీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఈ విషయంపైనే ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. -
వివాదంలో నయనతార 75వ చిత్రం.. బ్యాన్ చేయాలంటూ ఫైర్
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తాజాగ తన 75వ సినిమా విడుదలైంది. 'అన్నపూరణి' ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది. ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కోరిక ఆమెలో ఉంటుంది. దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు. అయితే, తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా నయనతార ఎలా ఎదిగింది. ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే సవాల్ ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం తమిళంలో మాత్రమే ఈ నెల 1 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌తో పాటు నయనతార కూడా చెన్నైలోని ఓ లేడీస్ కాలేజ్‌ను సందర్శించారు. లంచ్ టైమ్‌కి వెళ్లి వారందరితో సందడిగా కనిపించారు. ఆపై వారందరికీ స్వయంగా నయనతారనే బిర్యానీ వడ్డించారు. అలా ఒక్కసారిగా తమ అభిమాన తారలను చూడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాధారణంగా నయనతార సినిమా విడుదల సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయదు. వాటంన్నిటికీ ఆమె కాస్త దూరంగానే ఉంటారు. కానీ 'అన్నపూరణి' చిత్రం కోసం నయనతార ఇప్పుడిలా చేయడంతో యూనిట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. (ఇదీ చదవండి: 'అన్నపూరణి' చిత్రం రివ్యూ.. పబ్లిక్ టాక్) 'అన్నపూరణి చిత్రాన్ని బ్యాన్ చేయాలి' బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువతి పాత్రలో నయనతార ఇందులో నటించడం ఆపై ఆమె ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా ఎదిగే క్రమంలో ఆమె చేస్తున్న వంటలు పలు వివాదాలకు దారి తీసింది. ఇందులోని కథాంశం కూడా బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఉందని రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు తెలిపాడు. దానికి తోడు ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్లు ఈ చిత్రంలో చూపించడంపై ఆయన తప్పుబట్టారు. సినిమాను బ్యాన్ చేయాలని ఆయన కోరారు. సినిమా మేకర్స్‌పై సివిల్ కేసు పెట్టడమే కాకుండా థియేటర్ల వద్ద దిగ్బంధనం చేస్తామని వేలు హెచ్చరించారు. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. Briyani is even more special when Poorni serves it :) #Annapoorani serving now in cinemas near you. Enjoy the feast ❤️ pic.twitter.com/pf66rJCymI — Zee Studios South (@zeestudiossouth) December 3, 2023 -
నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార 75వ సినిమా 'అన్నపూరణి'. జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. కథేంటి? తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తే చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి కల కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) ఎలా ఉందంటే? చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఇష్టమున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి.. నాన్ వెజ్ ముట్టుకోవడమే పాపం అని భావించే, తల్లిదండ్రులని ఎదురించి కార్పొరేట్ చెఫ్ ఎలా అయింది? ఇండియన్ నంబర్ వన్ చెఫ్‌గా ఎలా మారింది? అనే కథతో 'అన్నపూరణి' సినిమా తీశారు. కాన్సెప్ట్ పరంగా మంచి లైన్ అయినప్పటికీ.. దర్శకుడు కొన్ని విషయాల్లో తడబడ్డాడు. చాలా సీరియస్‌గా చెప్పాల్సిన కొన్ని సీన్స్‌ని కామెడీ చేసేశాడని అంటున్నారు. దీంతో ఫీల్ మిస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే యావరేజ్ సినిమా అని తీర్పు ఇచ్చారు. ఎవరెలా చేశారు? ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంలో నయన్ ఇప్పటికే స్పెషలిస్ట్ అయిపోయింది. అన్నపూరణి అనే అమ్మాయిగా అదరగొట్టేసింది. జై, సత్యరాజ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ పరంగా తమన్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే ఈ మూవీ తమిళంలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో విడుదల చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తారనిపిస్తోంది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
Annapoorani Trailer:బ్రాహ్మణ అమ్మాయి మంసాహార వంటకాలు రుచి చూస్తే..?
నయనతార కెరీర్లో రూపొందిన 75వ సినిమా ‘అన్నపూరణి’. జై, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది ‘‘నేను ఇండియాలోనే బెస్ట్ చెఫ్ అవుతాను.. అంకుల్’, ‘కలలో కోట కట్టకు.. వీధిలో క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ సచిన్ టెండూల్కర్ కాలేడు, అలాగే ప్రతి బస్ కండక్టర్ సూపర్‌స్టార్ కాలేడు’, ‘ఇష్టపడి చేస్తే లక్షల్లో ఒకరు కాదమ్మా... లక్ష మందీ సూపర్ స్టార్ కావొచ్చు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అన్నపూర్ణ (నయనతార పాత్ర పేరు) చెఫ్ కావాలనుకుంటుంది. ఈ క్రమంలో మాంసాహార వంటకాలను రుచిగా చేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకు ఆ యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అప్పుడు ఆ యువతి ఏం చేసింది? జీవితంలో ఆమె లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అన్నది ఈ సినిమా కథనం.