కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకోని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే ఘోరమైన డిజాస్టర్స్ అవుతుంటాయి. తీరా ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత మాత్రం ఊహించని విధంగా ట్రెండింగ్‌లో టాప్ లేపుతుంటాయి. తాజాగా ఓ సినిమా ఇలాంటి ఫీట్ సాధించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి?
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ అనగానే నయనతార గుర్తొస్తుంది. 40కి దగ్గర పడుతున్న ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. అలా కొన్నిరోజుల ముందు డిసెంబరులో 'అన్నపూరణి' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చింది. కానీ కథ ఓకే ఓకేలా ఉండటం, అదే టైంలో తమిళనాడులో వరదలు రావడం మొత్తానికే మైనస్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!)
అలా థియేటర్లలో 'అన్నపూరణి' చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఊహించని విధంగా ఓటీటీలో మాత్రం అగ్రస్థానం దక్కించుకోవడంతో పాటు ట్రెండింగ్‌లోనూ నిలవడం విశేషం.
'అన్నపూరణి' కథేంటి?
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే.
(ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment