సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్‌లో బెంచ్‌మార్క్ చిత్రంగా 'అన్నపూరణి' గతేడాది డిసెంబరు 1న విడుదలైంది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా 'అన్నపూరణి' ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో థియేటర్‌లలో కూడా అంతగా మెప్పించలేక పోయింది.
కొద్దిరోజుల క్రితం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తమిళ్, తెలుగు,హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో 'అన్నపూరణి' చిత్రాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు.
సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని.. అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందూసేవ పరిషత్ ఫిర్యాదు మేరకు అన్నపూరణి చిత్రయూనిట్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్‌పైనా కేసు నమోదైంది. ఇలా ఈ చిత్రంపై వరుస వివాదాలు ముసురుకోవడంతో నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గి అన్నపూరణి చిత్రాన్ని తొలగించేసింది.
'అన్నపూరణి' కథేంటి?
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment