
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకుంది.
తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.

(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)
కథేంటంటే?
రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు.
ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
Comments
Please login to add a commentAdd a comment