‘‘నేను, మోహన్ కలిసి రైటర్స్‌గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్‌లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ బాబీ కొల్లి, కల్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్‌ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్‌లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment