ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Nayanthara Beyond the Fairy Tale Trailer And OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Nayanthara OTT: ట్రైలర్ రిలీజ్ చేశారు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published Sat, Nov 9 2024 11:42 AM | Last Updated on Sat, Nov 9 2024 11:50 AM

Nayanthara Beyond the Fairy Tale Trailer And OTT Streaming Details

ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ రానుంది. కొన్నిరోజుల క్రితం ఇందుకు సంబంధించిన పోస్టర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నయన్ జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు తదితర విషయాల్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ తీశారు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశాడు. నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ చూస్తే.. నయన్ గురించి కన్నడ హీరో ఉపేంద్ర, తెలుగు హీరో నాగార్జున, తమిళ నటి రాధిక, తమిళ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్ మాట్లాడటం చూపించారు. చివర్లో దర్శకుడు విఘ్నేశ్.. నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పకనే చెప్పాడు.

(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. తమిళ నటి పోస్ట్ వైరల్)

నేను మనుషుల్ని త్వరగా నమ్మేస్తాను, నా గురించి పేపర్ లో వచ్చేవన్నీ చూసి అమ్మ చాలా భయపడేది లాంటి విషయాలు నయన్ చెప్పింది. అసలు మీ జీవితాన్ని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్‌గా ఎందుకు తీసుకురావాలని అనుకున్నారని అడగ్గా.. పక్కనోళ్ల హ్యాపీనెస్ చూసి, అందరూ హ్యాపీగా ఫీలవ్వాలని నేను అనుకున్నా. అందుకే దీనికి ఒప్పుకొన్నా అని చెప్పింది.

నయన్ చెప్పడం బాగానే ఉంది గానీ అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అలానే నయనతార గతంలో తమిళ హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. కాకపోతే అవి తర్వాత స్టేజీకి వెళ్లలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాల్ని ఏమైనా ఈ సిరీస్‌లో చూపిస్తారా? లేదంటే విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వరకు మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement