జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార | Nayanthara Apology To Annapoorani Controversy In Instagram, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Annapoorani Controversy: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార

Jan 19 2024 10:08 AM | Updated on Jan 19 2024 10:28 AM

Nayanthara Apology To Annapoorani Controversy - Sakshi

'అన్నపూరణి' మూవీ వివాదంపై నయనతార తాజాగా క్షమాపణలు చెప్పింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొందిన తరువాత థియేటర్లలో విడుదలైన ఒక చిత్రాన్ని OTT నుంచి తొలగించడం ఏంటని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన సినీ జీవితంలో 75వ సినిమాగా  'అన్నపూరణి' ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. గతేడాది డిసెంబర్‌ 1న వచ్చిన ఈ సినిమా ఆపై నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్‌ అయింది. కానీ ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఇందులో కొన్ని సీన్లు హిందూవుల మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని.. అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆయన ఆరోపించారు.

దీంతో నయనతారపై కేసు కూడా నమోదు అయింది. ఆ తర్వాత 'అన్నపూరణి' చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ నుంచి కూడా ఆ సంస్థ తొలగించింది. తాజాగా ఈ వివాదంపై నయనతార రియాక్ట్‌ అయింది. నయనతార తాజాగా క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పేజీలో జై శ్రీరామ్ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో 'గత కొన్ని రోజులుగా నా సినిమా 'అన్నపూరణి' చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బరువెక్కిన హృదయంతో, స్వయం సంకల్పంతో ఈ ప్రకటన చేస్తున్నాను.

‘అన్నపూరణి’ సినిమాను కేవలం కమర్షియల్‌ ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి ఓ మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా మాత్రమే మేము చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే రీతిలో ‘అన్నపూరాణి’ సినిమాను తెరకెక్కించాం. అన్నపూర్ణి ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని మేము అందరం భావించాము. కానీ తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని అర్థమౌతుంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొంది ఆపై థియేటర్‌లో విడుదలైన ఒక చిత్రం OTT నుంచి తీసివేయబడింది, ఇది మాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు, నా టీమ్‌కు లేదు.

నేను భగవంతునిపై ఎంతో నమ్మకంతో అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే వ్యక్తిని కానీ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు.. చేయను కూడా. అంతకు మించి మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. అన్నపూర్ణి చిత్రం అసలు ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదు, ప్రేరేపించడం మాత్రమే. నా 20 ఏళ్ల సినీ జర్నీ లక్ష్యం ఒక్కటే. సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేయడం ఆపై ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం మాత్రమే అని నేను ఇక్కడ మరోసారి సూచించాలనుకుంటున్నాను.' అని నయనతార తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement