నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే? | Ramesh Solanki Complaint Against Makers Of Nayantharas Annapoorani - Sakshi
Sakshi News home page

Nayanthara: నయనతార మూవీపై ఫిర్యాదు.. ఎందుకంటే?

Published Sun, Jan 7 2024 12:54 PM | Last Updated on Sun, Jan 7 2024 1:05 PM

Complaint Against Makers Of Nayantharas Annapoorani Goes Viral - Sakshi

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. ఈ  మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

(ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని..  అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement