మనోజ్‌ ఆధీనంలోకి ‘మంచు టౌన్‌’! | Manchu Manoj Complaint Against Mohan Babu | Sakshi
Sakshi News home page

మనోజ్‌ ఆధీనంలోకి ‘మంచు టౌన్‌’!

Published Tue, Dec 10 2024 5:36 AM | Last Updated on Tue, Dec 10 2024 10:09 AM

Manchu Manoj Complaint Against Mohan Babu

బౌన్సర్ల సాయంతో జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్‌ స్వాధీనం

మధ్యాహ్నం సోదరుడితో మంచు లక్ష్మి చర్చలు 

రాత్రి పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లిన మనోజ్‌ 

తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు 

మోహన్‌బాబుపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు 

కొద్దిసేపటికే మనోజ్, మౌనికపై వాట్సాప్‌ ద్వారా మోహన్‌బాబు ఫిర్యాదు 

తన భద్రత, ఆస్తుల విషయంలో భయపడుతున్నానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌ ‘మంచు టౌన్‌’ను ఆయన కుమారుడు మంచు మనోజ్‌ స్వాధీనం చేసుకున్నా రు. మనోజ్‌పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మనోజ్‌.. సోమవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్‌హౌస్‌ను స్వాధీనం చేసు కున్నారు.

ఆపై సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్‌ ద్వారా రాచ కొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబుకు ఫిర్యా­దు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసు­కో­వాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రా­ణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. 

పోలీసులకు వైద్య పరీక్షల రికార్డులు
బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన మనో­జ్‌కు వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే తది తర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికా­ర్డులు డిశ్చార్జి సమయంలో మనోజ్‌కు ఇచ్చారు. వాటిని మనోజ్‌ వెంటనే వాట్సాప్‌ ద్వారా పహా­డీషరీఫ్‌ పోలీసులకు పంపారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్‌పల్లి­లోని మంచు టౌన్‌కు వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా మౌనిక అనుచ­రులు కూ డా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబా­య్‌లో ఉ న్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్‌ హౌస్‌ వద్దకు పంపారు.

ఇలా మనోజ్, విష్ణులకు సంబంధించిన దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్‌ చుట్టూ, గేట్‌ వద్ద కొందరు మహిళ బౌన్సర్లు కూడా పహారా కాస్తు­న్నారు. అయితే పహాడీష­రీఫ్‌ పోలీసులతో ఫోన్‌లో మాట్లాడిన మనో­జ్‌.. వారిలో బౌన్సర్లు లేరని చెప్పి నట్లు తెలిసింది. కాగా మనోజ్‌ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్‌కు వచ్చిన మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి  గంటకు పైగా మనోజ్‌తో చర్చలు జరిపి వెళ్లారు. 

సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ మాయం: మనోజ్‌
తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్‌ హఠాత్తుగా పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం తనపై పది మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశా రని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమె రాల హార్డ్‌డిస్క్‌ మాయం అయిందని, దీని వెనుక కిరణ్, విజయ్‌ రెడ్డి అనేవారి పాత్ర ఉన్నట్లు అను మానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురవారెడ్డి మాట్లాడుతూ.. మనోజ్‌ తనపై ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మనోజ్‌ ఫిర్యాదుపై పహడీషరీఫ్‌ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు.  

మంచు ఫ్యామిలీలో ముదిరిన వివాదం

మనోజ్‌ నా ఇంటిని ఆక్రమించుకున్నాడు: మోహన్‌బాబు
మోహన్‌బాబు సైతం మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ‘జల్‌పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్‌ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్‌ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌­లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యో­గు­లను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయ­పడు­తున్నా.

నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌని­కలను బయటకు పంపండి. వారు, వారి సహ­చరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి..’ అని ఫిర్యాదులో మోహన్‌బాబు కోరారు. మోహన్‌­బాబు లెటర్‌ హెడ్‌పై, ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్‌ ద్వారా రాచ­కొండ పోలీసు కమిషనర్‌కు అందింది. ఆయన దాన్ని పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫార్వర్డ్‌ చేశారు. కమిషనర్‌ సుధీర్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడు­తూ...‘మనోజ్‌ నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదు వాట్సా­ప్‌ ద్వారా వచ్చింది. రెండింటి పూర్వాపరాలు పరిశీలించి, కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తాం..’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement