దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.
(ఇది చదవండి: నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్)
అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్‌తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment