![Kannada Super Star Shiva Rajkumar Bhairathi Ranagal In Another OTT](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ranagal.jpg.webp?itok=eP8lkPGQ)
శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు.
అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.
చికిత్స కోసం అమెరికాకు..
ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment