Bhairathi Ranagal Movie
-
మరో ఓటీటీకి శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.చికిత్స కోసం అమెరికాకు..ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
తెలుగులో రిలీజ్ కాబోతున్న మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!
ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే కొన్ని అక్కడ రిలీజ్ అయిన రోజే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని మాత్రం అక్కడ సూపర్ హిట్ అయితేనే కొంత సమయం తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అదే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం కర్ణాటకలో రిలీజ్ అయి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ "మఫ్తీ"కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలోని ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. "భైరతి రణగల్" చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు.