Shobhaa De
-
అయ్యో పాపం.. చాలా కష్టపడ్డారు.. స్టార్ హీరోపై కంగనా కామెంట్స్
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే కొందరు తనపై గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ భామ. హీరో అమిర్ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పేరును కనీసం ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్టపడలేదని విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో కంగనాను అమిర్ ఖాన్ ప్రశంసించారు. అయినప్పటికీ ఇవేమీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బయోపిక్ తీస్తే ఆ పాత్ర ఎవరు బాగా పోషిస్తారని అమీర్‌ను శోభా డే అడిగారు. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, అలియా భట్ల పేర్లను అమిర్ ఖాన్ చెప్పారు. అయితే శోభా మాత్రం కంగనా రనౌత్ పేరును గుర్తు చేసింది. ఆ తర్వాత అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. కంగనా ట్వీట్ చేశారు. కంగన తన ట్వీట్లో రాస్తూ.. 'అయ్యో పాపం ఆమిర్.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. కాకపోతే అది వీలు కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇదే నిదర్శనం' అంటూ పోస్ట్ చేశారు. అయితే కంగనా ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్ మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మీ గొప్పల కోసం ఇతరులను కించపరచడం సరైన పద్ధతి కాదు అని కామెంట్లు పెడుతున్నారు. Bechara Aamir Khan … ha ha he tried his best to pretend like he doesn’t know that I am the only three times national award winning actress none of those he mentioned has even one … Thank you @DeShobhaa ji I would love to play you ♥️ https://t.co/o0tS6UYLoC — Kangana Ranaut (@KanganaTeam) February 10, 2023 -
Shobhaa De: ఇదేనా ఇందుకు సమయం?
సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. చక్కటి కొటేషన్స్ పెడతారు, మంచి సంఘటనలను ట్వీట్ చేస్తారు, వారు చదివిన పుస్తకాలలోని మంచి విషయాలను వివరిస్తారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను బాగా వాడుకుంటారు. తాజాగా సెలబ్రిటీలు వారి విహార యాత్ర చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ‘‘దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మీకు ఇంత సమయం దొరికినందుకు మీరు అదృష్టవంతులు. మీరు మీ ఫొటోలను మీకు మాత్రమే పరిమితం చేసుకోవడం మంచిది’’ అంటూ శోభా డే కొంచెం ఘాటుగా స్పందించారు. శోభాడే అంటేనే వివాదాలకు మారు పేరు. నచ్చని అంశంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తారు. ప్రజాస్వామ్యం లో ఏ విషయాన్నయినా నిర్భయంగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని శోభాడే నమ్మకం. అందుకే ఇప్పుడు ఈ విపత్కర సమయంలో సెలబ్రిటీల వైఖరిపై తన అభిప్రాయాలను కొంచెం ఘాటుగానే వెల్లడించారు. ప్రస్తుతం భారత ప్రజలు కరోనా వైరస్ బారిన పడి ఊపిరి పోసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా మరణిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలలో లాక్డౌన్ విధించారు. ఇటువంటి భయంకరమైన సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతుంటే, చాలామంది బాలీవుడ్ తారలు తమ స్నేహితులు, కుటుంబాలతో మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, సరదాగా గడుపుతున్న ఫొటోలు పోస్టు చేయటం శోభాడే ఆగ్రహానికి కారణమైంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. గట్టిగా గొంతు విప్పి, స్పష్టంగా తన సందేశాన్ని వినిపించారు శోభాడే. ‘సరదాగా గడుపుతున్న ఫొటోలను పోస్టు చేయడానికి ఇది సరైన సమయం కాదు, అందరూ చావుబతుకుల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుంటే, సెలబ్రిటీలు బాధ్యత లేకుండా ఇటువంటివి పోస్టు చేయటంలో అర్థం ఏంటి? మాల్దీవుల్లో ఉల్లాసంగా గడపండి. అయితే మీరు గడిపే సన్నివేశాలను అందరికీ తెలిసేలా కాకుండా వ్యక్తిగతంగా ఉంచుకోండి’’ అంటున్నారు శోభాడే. ‘మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం ఏమీ చేయలేదు’ అంటూ ఇరవై నిమిషాల పాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఖరి పైనా శోభాడే గొంతు విప్పారు. ‘కరోనా భయం ఎప్పటికి తగ్గుతుందో ఎవ్వరికీ తెలియదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించటం వలన ఉపయోగం లేదు. మన ఆరోగ్యం గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ, ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి’ అని చెబుతున్న శోభాడే మాటలతో ఆశ్వాసన పొందిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఇలాంటి ప్లేస్‌లో 5 రోజులు ఉంటానా!
అహ్మదాబాద్: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు . భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయం వెనకు అందరూ మొటేరా పిచ్‌పై విమర్శలు గుప్పించారు. కానీ ఇండియన్ కాలమిస్ట్ శోభా డే మాత్రం ఫన్నీగా రవిశాస్త్రిపై ఓ మీమ్‌ని తయారు చేసి తన ట్విటర్లో షేర్ చేశారు. 'నేను ఈ డ్రై స్టేట్‌లో ఐదు రోజులు ఉంటానని అనుకున్నారా..? అంటూ రవిశాస్త్రి అడుగుతున్నట్లుగా ఒక పాత ఫొటోను షేర్ చేసింది. దీనిని ఫన్నీగా తీసుకున్న రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. 'ఈ కఠిన సమయాల్లో ఈ ఫోటో కాస్త నవ్వు తెప్పించడం బాగుంది. మీ పరిహాసం నాకు నచ్చింది’ అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాదు గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయాన్ని అంతర్లీనంగా శోభా డే తన ట్వీట్లో ప్రస్తావించింది. అయితే రవిశాస్త్రి ఫన్నీగానే తీసుకున్నా.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం రవిశాస్త్రిపై ఫన్నీ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. సాధారణంగా రవిశాస్త్రి విదేశీ పర్యటనల్లో బహిరంగంగానే మద్యం తాగుతూ చాలాసార్లు కనిపించాడు.కొన్నిసార్లు మ్యాచ్‌ల సమయాల్లో డ్రెస్సింగ్ రూములో నిద్రపోతుండటం.. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మద్యం మత్తులో వచ్చి మీడియాతో మాట్లాడటం చేసేవాడు. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది. చదవండి: 'థ్యాంక్స్ పీటర్సన్.. అర్థం చేసుకున్నందుకు' మేమంతా ఏడ్చేశాం: సూర్యకుమార్ -
‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యం గురించి వస్తున్న వదంతులపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. లతాజీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె కోలుకుంటున్నారని శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లతా ఇకలేరు అంటూ వస్తున్న వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వదంతులు ప్రచారం చేసి లతాజీ అభిమానులను, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో లతా మంగేష్కర్ సోమవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. ఈ క్రమంలో లతా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. అయితే ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు శోభా డే చేసిన ట్వీట్ లతా అభిమానులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘ ఇది నిజం కాదని చెప్పండి. ఇండియా తన నైటింగేల్‌ను కోల్పోయిందా’అని ఆమె ట్విటర్లో పేర్కొనడం కలకలం రేపింది. శోభా డే తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో విమర్శలపై స్పందించిన శోభా డే... ‘ ఇప్పుడే లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. దేవుడి దయ వల్ల మన ప్రియమైన నైటింగేల్ ఆరోగ్యంగానే ఉన్నారట అని మరో ట్వీట్ చేశారు. ఇక దిగ్గజ గాయనిగా పేరొందిన మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం గాత్ర దానం చేశారు. సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా... 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఆమెను వరించాయి. Just spoke to the family . By God's grace, our precious nightingale is fine.@mangeshkarlata — Shobhaa De (@DeShobhaa) November 16, 2019 -
ఆ ఎస్సై సన్నబడ్డాడోచ్!
సాక్షి, ముంబై : మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ దౌలత్‌రామ్ జోగావత్ గుర్తున్నారా? ఆ మధ్య ప్రముఖ రచయిత్రి-కాలమిస్ట్ శోభా డే ఆయనను ‘బాడీషేమింగ్’ (లావుగా ఉన్నాడని ఎద్దేవా చేస్తూ) పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. దీంతో పాపులర్ అయిన ఎస్సై దౌలత్‌రామ్ ఇప్పుడు బరువు తగ్గాడు. గతంలో 180 కిలోల భారీకాయంతో అతను పోలీసు ఉద్యోగం చేసేవాడు. తాజాగా శస్త్రచికిత్స చేయించుకొని ఏకంగా 60 కిలోల బరువు తగ్గాడు. ప్రముఖ బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డవాలా ఆయనకు సైఫీ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రిచికిత్స చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో శోభా డే ‘ముంబైలో పోలీసు బందోబస్తు హెవీగా ఉందంటూ’ భారీకాయంతో లావుగా ఉన్న దౌలత్‌రామ్ జోగావత్ ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తీవ్ర వివాదాన్నే రేపింది. స్థూలకాయులను కించపరిచేలా ఆమె ట్వీట్ ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ముంబై పోలీసులు కూడా స్పందించారు. శోభో డే పరిహాసం గతి తప్పిందని, ఆమె ట్వీట్ చేసిన ఫొటో ముంబై పోలీసులది కాదని, బాధ్యతయుతమైన ఆమెలాంటి పౌరుల నుంచి ఇలాంటివి ఆశించడం లేదని ముంబై పోలీసులు చురకలు అంటించారు. నిజానికి శోభా డే చేసిన ట్వీట్ మీద దౌలత్‌రామ్‌కు కోపమేమీ రాలేదట. ఆమె ట్వీట్ చేయడం వల్లే ఆయన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడని, అందువల్ల ఆమెకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడని స్థానికంగా కథనాలు కూడా వస్తున్నాయి. దౌలత్‌రామ్ 1979లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరాడు. తాజా పరిణామంపై శోభా డే ట్వీట్ చేశారు. ‘ఇది సుఖాంతమవ్వడం ఆనందంగా ఉంది. దౌలత్‌రామ్ భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో జీవించాలి’ అని ట్వీట్ చేశారు. -
దేవుడు-సెక్స్.. రెండూ భయాలే!
సాక్షి, సిమ్లా : వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే రచయిత్రి శోభాడే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుశ్వంత్‌సింగ్ సాహిత్య వేడుకలో పాల్గొన్న ఆమె శృంగారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు-శృంగారం రెండు జనాలకు భయం పుట్టించేవేని ఆమె అన్నారు. కసౌలిలో జరిగిన ఆరో ఎడిషన్ వేడుకలో ఆమె... కామ సూత్ర, ఇండియాలో శృంగార పద్ధతులు, సెక్స్ మీద ఇప్పుడున్న వారి అభిప్రాయాలపై సమీక్ష తదితర అంశాలపై ఆమె ప్రసంగించారు. కామ అనేది చాలా అందమైన పదమని కానీ, కామసూత్ర అలా కాదని ఆమె అభిప్రాయపడ్డారు. శృంగారం విషయంలో భారతీయులు ఎంజాయ్ చేస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ‘దేవుడిలానే సెక్స్ కూడా జనాలను భయపెడుతోంది. ‘గాడ్’, ‘సెక్స్’ (GOD-SEX) రెండూ మూడక్షరాల పదాలే. హింసాత్మక లక్ష్యాల కోసమే రెండింటినీ ఉపయోగించుకుంటున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. కొందరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ‘గాడ్’, ‘సెక్స్’ను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటి దివ్యా దత్తా ఇండియన్ సినిమాలో సెక్స్ ప్రస్థానం గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు హీరోయిన్లను చాలా పద్ధతిగా చూపించేవారు. ఎక్స్ పోజింగ్ కోసం వ్యాంప్ తరహా పాత్రలను సృష్టించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. హీరోయిన్లే శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోతున్నారు. వారిని చూసేందుకు కూడా జనాలు మొహమాటం పడట్లేదు. అయితే ఎటొచ్చి ఆ శృంగారం అనే అంశం గురించి బయట మాట్లాడేందుకు మాత్రం ప్రేక్షకులు జంకుతున్నారు అని దివ్యా పేర్కొంది. -
ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై!
ముంబై: ప్రముఖ రచయిత్రి శోభా డే పోలీసులను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అధిక బరువున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఫొటోను పెట్టి.. 'ముంబైలో ఈ రోజు హెవీ పోలీసు బందోబస్తు ఉందం'టూ పరిహాసపు వ్యాఖ్యను పెట్టారు. ఆమె ట్వీట్‌పై ముంబై పోలీసులు ఒకింత ఘాటుగా స్పందించారు. బాధ్యతయుతంగా ఉండాలంటూ పరోక్షంగా మదలించారు. 'శోభా డేగారు మీ హాస్యపు వ్యాఖ్యలను మేం కూడా ఇష్టపడుతాం. కానీ ఈసారి మీరు పూర్తిగా పొరపాటు వ్యాఖ్య చేశారు. ఆ యూనిఫామ్ గానీ, అధికారిగానీ ముంబై పోలీసుశాఖకు చెందినవారు కాదు. ఒక బాధ్యతాయుతమైన మీ లాంటి పౌరుల నుంచి మరింత హుందాతనాన్ని మేం ఆశిస్తున్నాం' అంటూ చురకలు అంటించింది. Heavy police bandobast in Mumbai today! pic.twitter.com/sY0H3xzXl3 — Shobhaa De (@DeShobhaa) 21 February 2017 పోలీసులను ఎద్దేవా చేస్తూ శోభా డే పెట్టిన ట్వీట్‌పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు, కించపరిచే వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. రచయిత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. గతంలో ఎప్పుడో సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఫొటోను తాజాగా పోస్టు చేసి.. పోలీసుశాఖను కించపరచడమేమిటని పలువురు తప్పుబడుతున్నారు. గణేష్ ఉత్సవాలకు భారీబందోబస్తు అంటూ గతంలో ఒక వ్యక్తి పెట్టిన పోస్టునే శోభాడే కాపీ చేశారని పలువురు నెటిజన్లు గుర్తుచేశారు. We love puns too Ms De but this one is totally imisplaced. Uniform/official not ours. We expect better from responsible citizens like you. https://t.co/OcKOoHO5bX — Mumbai Police (@MumbaiPolice) 21 February 2017 .@MumbaiPolice you can forgive her for not being a responsible citizen but you should charge her for Copying others Tweet. pic.twitter.com/PjNUI1z5pA — PhD in Bak*****!! (@Atheist_Krishna) 21 February 2017 -
తప్పుదిద్దుకున్న శోభా డే
ముంబై: ఒలింపిక్ లో రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే తన తప్పును తెలుసుకున్నారు. వెండి పథకాన్ని సాధించిన సింధు 24 కారెట్ల బంగారమని, ఆమె హీరో అని పొగడ్తల వర్షం కురిపించారు. ధైర్యశాలి సింధు నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. 24 క్యారెట్ల బంగారమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. పీవీ సింధు, దీపా కర్మాంకర్, సాక్షి మలిక్ విజయ గాథలను పోస్ట్ చేశారు. సింధు జీవితంపై సినిమా తీయాలని, ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్ లో నటించాలని అన్నారు. దీపిక కన్నా బాగా ఇంకెవరు నటిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృధా అని గంతంలో శోభా ట్వీట్ చేశారు. దీనిపై వివిధ రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా'
ముంబై: 'బాహుబలి' సినిమాలో కట్టప్ప పాత్ర తనకెంతో నచ్చిందని ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభా డే పేర్కొన్నారు. రాజకుంటుబానికి నమ్మిన బంటుగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయారని ప్రశంసించారు. కట్టప్ప పాత్ర కోసమే 'బాహుబలి 2' టిక్కెట్ ను ముందుగా బుక్ చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 'బాహుబలి' సినిమాపై తన అభిప్రాయాన్ని 'ఎన్డీటీవీ'కి రాసిన వ్యాసంలో నిర్మోహమాటంగా వెల్లడించారు. ప్రభాస్, రానా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారని పేర్కొన్నారు. రాజమాతగా నటించిన రమ్యకృష్ణ కట్టిన తొమ్మిది గజాలు చీరలు సూపర్ గా ఉన్నాయన్నారు. అయితే గిరిజనులను శత్రువులుగా చూపిన విధానం అభ్యంతరకరమన్నారు. ఇంగ్లీషులో హిట్టైన సినిమాలను బాగా స్టడీ చేసి అవసరమైన ఎలిమెంట్స్ 'బాహుబలి'లో ఉండేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు. -
'ప్రియాంక కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారు'
న్యూఢిల్లీ: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ రచయిత్రి శోభా డే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. జపాన్ పర్యటనలో నరేంద్రమోడీ మార్చిన దుస్తులపై శోభా డే వ్యాఖ్యలు చేశారు. ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రా మార్చిన దుస్తుల కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో శోభా డే ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇటీవలకాలంలో ప్రధాని నరేంద్రమోడీ ధరించే దస్తులు అందర్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకత ఉట్టిపడేలా ప్రధాని దుస్తుల ఎంపికపై కూడా పలు పత్రికల్లో చర్చనీయాంశమయ్యాయి. Narendra Modi has changed more outfits in Japan than Priyanka Chopra in ''Fashion''.— Shobhaa De (@DeShobhaa) September 1, 2014