దేవుడు-సెక్స్‌.. రెండూ భయాలే! | Shobhaa De Comments on Indian Sex | Sakshi
Sakshi News home page

సెక్స్‌పై శోభా డే వ్యాఖ్యలు

Published Sat, Oct 7 2017 9:17 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Shobhaa De Comments on Indian Sex - Sakshi

సాక్షి, సిమ్లా : వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే రచయిత్రి శోభాడే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుశ్వంత్‌సింగ్ సాహిత్య వేడుకలో పాల్గొన్న ఆమె శృంగారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు-శృంగారం రెండు జనాలకు భయం పుట్టించేవేని ఆమె అన్నారు.

కసౌలిలో జరిగిన ఆరో ఎడిషన్ వేడుకలో ఆమె... కామ సూత్ర, ఇండియాలో శృంగార పద్ధతులు, సెక్స్ మీద ఇప్పుడున్న వారి అభిప్రాయాలపై సమీక్ష తదితర అంశాలపై ఆమె ప్రసంగించారు. కామ అనేది చాలా అందమైన పదమని కానీ, కామసూత్ర అలా కాదని ఆమె అభిప్రాయపడ్డారు. శృంగారం విషయంలో భారతీయులు ఎంజాయ్ చేస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ‘దేవుడిలానే సెక్స్ కూడా జనాలను భయపెడుతోంది. ‘గాడ్’, ‘సెక్స్’  (GOD-SEX) రెండూ మూడక్షరాల పదాలే. హింసాత్మక లక్ష్యాల కోసమే రెండింటినీ ఉపయోగించుకుంటున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.  కొందరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ‘గాడ్’, ‘సెక్స్’ను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటి దివ్యా దత్తా ఇండియన్ సినిమాలో సెక్స్ ప్రస్థానం గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు హీరోయిన్‌లను చాలా పద్ధతిగా చూపించేవారు. ఎక్స్ పోజింగ్ కోసం వ్యాంప్‌ తరహా పాత్రలను సృష్టించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. హీరోయిన్లే శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోతున్నారు. వారిని చూసేందుకు కూడా జనాలు మొహమాటం పడట్లేదు. అయితే ఎటొచ్చి ఆ శృంగారం అనే అంశం గురించి బయట మాట్లాడేందుకు మాత్రం ప్రేక్షకులు జంకుతున్నారు అని దివ్యా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement