Divya Dutta
-
ఒకేసారి 22 సినిమాలకు సంతకం.. ఆయన అన్న ఒక్క మాటతో!
ఏడాదికి ఐదారు సినిమాలు చేసే హీరోలు సంవత్సరానికోసారో, రెండేళ్లకోసారో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. హీరోయిన్లు ఒక భాషలో కాకపోతే మరో భాషలో కనిపించి కనువిందు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి దివ్య దత్త మాత్రం ఓసారి రెండు, మూడు సినిమాలు కాకుండా ఏకంగా 22 సినిమాలకు సంతకం చేసిందట!22 సినిమాలు..అప్పుడు తాను కెరీర్లో తారా స్థాయికి చేరుకున్నట్లు ఫీలైందట. కానీ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మాత ఆదిత్య చోప్రా మాటలతో నేలపైకి దిగివచ్చానని చెప్పుకొచ్చింది. దివ్య దత్త మాట్లాడుతూ.. ఆజ నచ్లే (2007) సినిమా రిలీజ్‌కు ముందో, తర్వాతో గుర్తులేదు కానీ ఓసారి ఆదిత్య చోప్రాను కలిశాను. ఏంటి? కెరీర్ ఎలా సాగుతోంది? అని అడిగాడు. నేను 22 సినిమాలు చేస్తున్నానని చెప్పాను. తను సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాను. కానీ ఆయన మౌనంగా ఉండిపోయాడు.నచ్చిన పాత్రల ఎంపికతో..నాకేమీ అర్థం కాలేదు. నీకు హ్యాపీగా లేదా? అని అడిగాను. అందుకాయన నీకు డబ్బు అవసరం ఉందా? అన్నాడు. లేదన్నాను. నీకు వచ్చిన గుర్తింపును కాపాడుకో.. ఎందుకిన్ని సినిమాలు చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు నాకు విషయం బోధపడింది. ఏది పడితే అది చేస్తూ పోవడం కన్నా నిజంగా నా పాత్రకు ప్రాధాన్యత ఉండి, నాకు నచ్చినవాటినే చేయడం బెటర్ అని ఫీలయ్యాను. అలా తర్వాత సెలక్టివ్‌గా పాత్రలు చేసుకుంటూ పోయాను. దానివల్ల నా గ్రాఫ్ కూడా మారింది అని దివ్య దత్త చెప్పుకొచ్చింది.చదవండి: ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక -
నటియిత్రి
లాక్ డౌన్ కాలం అందరిలో ఉన్న అజ్ఞాత ప్రతిభను వెలికితీస్తోంది. అందుకు బాలీవుడ్ తారలు అతీతులేం కాదు. తమ భావాలను చక్కగా లోకానికి వెల్లడిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రముఖ నటులంతా కలిసి, తమ తమ ఇళ్ళనుంచే స్ఫూర్తిదాయకమైన వీడియో రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అదెంత వైరల్ అయ్యిందో అందరం చూశాం. ఇప్పుడు ఒక నటి తన మనసులోని భావాలను చక్కగా వెల్లడించారు. మనం ఏం చేస్తే అందరి మనసులనూ ఆకట్టుకోగలమో... మంచిని పంచగలమో తెలియజెప్పారు. బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా మనసు చాలా సున్నితమైనది. ఆమెలోనూ ఒక అజ్ఞాత కవయిత్రి అంతర్లీనంగా దాగి ఉంది. నటిగా, మోడల్‌గా మాత్రమే కాకుండా కవయిత్రిగా ఇప్పుడు ప్రపంచానికి తనలోని అక్షరాలకు రూపం కల్పించింది. కరోనా నేపథ్యంలో ఒక పద్యం రాసింది. అందులోని భావాలను తన గొంతులో ఎంతో హృద్యంగా పలికించింది. ‘జబ్ సబ్ ఠీక్ హోగా నా’ అంటూ ఒకసారి అందరి హృదయాలను సన్నగా తట్టి లేపింది. ఈ లలితమైన గీతాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ విపత్తు నుండి బయటపడి అందరం ఆహ్లాదంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. మూడురోజులకొకసారి మనవారందరికీ వీడియో కాల్స్ చేస్తున్నాం. మనం వండిన వంటను ఎలా తయారుచేయాలో వాళ్లకి రెసిపీలు చెబుతున్నాం. మార్కెట్లో ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలియపరుస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. పాత ఆల్బమ్స్ చూస్తూ మన బాల్యాన్ని, మధుర క్షణాలను తీయగా ఆస్వాదిస్తున్నాం. వాటిని చూస్తూ చిన్నప్పుడు తలగడలతో కొట్టుకున్న ఆటలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. ఆర్డి బర్మన్ సంగీతం వింటూ ఆనందిస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. వీధి కుక్కలను పలకరిస్తూ వాటికి అన్నం పెడుతున్నాం. మంచి నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మనకు చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. నిత్యం మన పనులను చేయడానికి వస్తున్న పనివారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే, వారి ముఖాలపై నర్తించే చిరునవ్వులు చూడండి. మనలను కంటికిరెప్పలా కాపాడుతున్న మన ఇంటి వాచ్మ్యా¯Œ ని ‘టీ తాగావా, టిఫిన్ అయ్యిందా, భోజనం చేశావా’ అని కడుపునిండుగా నవ్వుతూ పలకరించండి. ఈ పనులన్నీ అటూ ఇటూ వెళ్తూ చేసేవే. ఇంకా కోకిల స్వరాన్ని వింటూ, అది ఏ భావంతో పాడుతోందో అర్థం చేసుకోండి. కాకుల కోసం నీళ్లు పెట్టండి. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. అంటూ ఎంతో అనుభూతితో రచించిన ఈ పద్యాన్ని, మనసుకి హత్తుకునేలా చదివారు దివ్యాదత్తా. -
మిడిల్ క్లాస్ మేల్ బ్లాక్‌మేల్
ఒకరి బలహీనత ఇంకొకరికి ఆసరా. అవసరాన్ని తీర్చే మార్గం. మరీ మధ్యతరగతి వర్గన్ని బతికిస్తున్నవి ఇలాంటి బలహీనతలే! ఇదే బ్లాక్‌మేల్ సినిమా! చాలా సీరియస్ విషయాన్ని హాస్యాన్ని జోడించి ఎంతో చతురంగా చెప్పిన చిత్రం! కథ... దేవ్ (ఇర్ఫాన్ ఖాన్) టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్. బాధ్యతలు తప్ప సుఖం, సంతోషం లేని మిడిల్‌క్లాస్ హజ్బెండ్. ముద్దుముచ్చటా లేని కాపురం. ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయే వరకు ఉండి, వీడియో గేమ్ ఆడి, భార్య నిద్రపోయాక ఇంటికెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద చల్లారిన భోజనాన్ని ఓవెన్లో పెట్టి, డైనింగ్ హాల్కీ బెడ్రూమ్కీ మధ్య ఉన్న తలుపు కన్నంలోంచి... ఆదమరిచి నిద్రపోతున్న భార్య అందాన్ని ఆస్వాదిస్తాడు. ఈలోపు ఓవెన్లో భోజనం వేడి అయిపోయినట్టు అలారమ్ వస్తుంది. నిట్టూర్చి భోజనం అయిందనిపించి వెళ్లి పడుకుంటాడు. ఇంచుమించు ఇదే దిన చర్య దేవ్ది. గులాబీపూలు... నిజాల ముళ్లు దేవ్ ఉదాసీనతను చూసి అతని కొలీగ్ ఆనంద్.. ‘‘కొన్నాళ్లుగా చూస్తున్నా. ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నావ్? అసలు కొత్త కాపురంలోని మొగుడులాగా ఉన్నావా? ఎందుకు ఏమైంది? కలహాలా?’’ అంటూ స్నేహితుడిని అడుగుతాడు. ముభావంగా ఉంటాడు దేవ్. ‘‘పువ్వులు ఇష్టపడని భార్య ఉండదు. సో.. ఈ రోజు పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికెళ్లి నీ భార్యకు సర్ప్రయిజ్ ఇవ్వు’’ అని దేవ్‌ను ఉత్సాహపరుస్తాడు ఆనంద్. అన్నట్టుగానే పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికొస్తాడు దేవ్. ఎప్పటిలాగే డైనింగ్ హాల్, బెడ్రూమ్కి మధ్యనున్న కన్నంలోంచి చూస్తాడు. షాక్... రీనా (కీర్తి కుల్హరి) ఇంకో వ్యక్తితో కనిపిస్తుంది. ఆవేశం పొంగుతుంది. వెళ్లి భార్య పక్కనున్న అతణ్ణి చంపేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక.. భార్యనూ నిలదీయలేక నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. తన ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు అపార్ట్మెంట్ కాంపౌండ్‌లో నిరీక్షించి ఆ వ్యక్తి బయటకు వచ్చాక అతణ్ణి ఫాలో అవుతాడు. బ్లాక్‌మెయిల్స్... భార్య స్నేహితుడి పేరు రంజిత్ అని, ఓ బడా వ్యాపారి అల్లుడని తెలుసుకుంటాడు ఆ ఇంటి వాచ్‌మన్ ద్వారా. నిజానికి రంజిత్ (అరుణోదయ్ సింగ్), రీనా (దేవ్ భార్య)పెళ్లికి ముందే ప్రేమికులు. కాని డబ్బు కోసం డాలీ (దివ్య దత్తా)ను పెళ్లిచేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ అయిన రంజిత్ వేరే పనేమీ లేకుండా అత్తింటి సొమ్ము మీద బతుకుతుంటాడు. దాంతో భర్తంటే చాలా చులకన డాలీకి. ఇంచుమించు పెంపుడు కుక్కలా ట్రీట్ చేస్తుంటుంది అతనిని. దాంతో ఆత్మాభిమానం దెబ్బతిని మళ్లీ పాత స్నేహితురాలు రీనాతో సంబంధం పెట్టుకుంటాడు రంజిత్. అలా వాళ్లిద్దరి స్నేహం కొనసాగుతుంది. ఈలోపు దేవ్‌కు నెల తిరిగేసరికల్లా ఇంటి ఈఎమ్ఐ, కార్ ఈఎమ్ఐ, కేబుల్ పేమెంట్.. ఎట్సెట్రా తడిసిమోపెడవుతాయి. ఆఫీస్‌లో ఆ నెల ఇంక్రిమెంట్ ఉంటుంది కదా.. అన్నీ తీర్చేయొచ్చు అనుకుంటే.. ‘‘కంపెనీ సేల్స్ మందగించాయి, పైగా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఇంక్రిమెంట్స్ లేవు’’ అంటూ చావు కబురు చల్లగా చెప్తారు. టెన్షన్లో పడ్తాడు దేవ్. అప్పుడు ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొని, దాన్లో ప్రీపెయిడ్ సిమ్ వేసి, రాత్రి దొంగతనంగా భార్య ఫోన్లోంచి రంజిత్ ఫోన్ నంబర్ తస్కరించి ‘‘పెళ్లయిన మహిళతో అఫైరా?’’ అంటూ బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్‌కు. భయపడ్డ రంజిత్.. ‘‘ఏం కావాలి?’’ అని అడుగుతాడు. ఈఎమ్ఐల లెక్కలు వేసుకొని లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. క్రాస్‌బ్రీడ్ డాగ్స్ బిజినెస్ చేస్తున్నాను, ఒక లక్ష రూపాయలివ్వమని అబద్ధం చెప్పి భార్య దగ్గర డబ్బులు తీసుకొని దేవ్కిస్తాడు రంజిత్. అలా భార్య ఎఫైర్‌ను మనీ సంపాదన వనరుగా మార్చుకుంటాడు దేవ్. మధ్యతరగతి విలువలు అతనిని కుళ్లబొడుస్తుంటాయి. ఆ అపరాధ భావనను ఓ రోజు బార్లో కొలీగ్ ఆనంద్‌తో పంచుకుంటాడు. ఆనంద్ ఆ విషయాన్ని తన ఆఫీస్‌లోని కొత్త ఫీమేల్ కొలీగ్ ప్రభకు చెప్తాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభ మళ్లీ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే బిజినెస్ పేరుతో కూతురు దగ్గర అల్లుడు డబ్బు తీసుకున్నాడని తెలిసి డాలీ తండ్రి రంజిత్‌ను బెదిరిస్తాడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని. ఏం చేయాలో పాలుపోక ఒక డూప్లికేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి గర్ల్ ఫ్రెండ్ రీనాకు బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్– ‘‘పెళ్లయిన వాడితో ఎఫైరా?’’అంటూ. ఈ విషయం నీ భర్తకు తెలియకుండా ఉండాలంటే లక్షా 30 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. రీనా తండ్రి కిడ్నీ జబ్బుతో బాధపడ్తుంటాడు. డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తుంది రీనా. ఉన్న డబ్బంతా మీ నాన్న కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడానికే అయిపోయిందంటుంది తల్లి. దాంతో రీనా తన భర్తనే అడుగుతుంది తండ్రి వైద్య పరీక్షల కోసమని. రంజిత్ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేస్తాడు. మళ్లీ రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇలా ఈ సైకిల్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ల, ఆ విషయం తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ బ్లాక్మెయిల్ బెడద తొలగించుకోవాలని రంజిత్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను మాట్లాడుకుంటాడు. ఆ డిటెక్టెవ్ రంజిత్‌కు ఫోన్ చేస్తున్న నంబర్ రీనా భర్తదేనని తెలుసుకుంటాడు. రంజిత్‌కు చెప్పకుండా పరిశోధన పేరుతో డ్రాగ్ చేస్తూ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు.. ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది నీ భర్తనేని నీ భార్యతో చెప్తాన’’ంటూ. ఖంగు తింటాడు దేవ్. ఈలోపు ప్రభ ఒత్తిడి ఎక్కువవుతుంది దేవ్‌కి. ఆమెను కన్విన్స్ చేయడానికి వాళ్లింటికి వెళ్దామనుకొని ఆమె ఇంటి అడ్రస్ కోసం ఆనంద్‌ను అడుగుతాడు. ఆ రాత్రి ప్రభ వాళ్లింటికి వెళ్తాడు దేవ్. వాదోపవాదాలు జరిగి దేవ్ వెళ్లిపోతుంటే ఆయనను ఆపడానికి వెళ్లి బాటిల్ మీద కాలు పడి జారి వెనకాల అల్మారాకు కొట్టుకుంటే అల్మారా మీద పడి ప్రభ చనిపోతుంది. భయపడి పారిపోతాడు దేవ్. కాలనీ వాసులు ఆయనని తరుముతాడు. అయినా తన అనవాలు చిక్కనివ్వకుండా తప్పించుకుంటాడు. మర్నాడు ఆఫీస్‌కు పోలీస్‌లు వస్తారు ఎంక్వియిరీ కోసం. ఆనంద్‌కు దేవ్ మీద డౌట్ వస్తుంది. ప్రభ అంటే ఆనంద్ ఇష్టపడుతున్నాడని పోలీసులకు చెప్పి డౌట్ ఆనంద్ మీదకు మళ్లేట్టు చేస్తాడు దేవ్. ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్చేస్తారు. అప్పుడు తన భార్య ఎఫైర్ విషయం తెలిసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ విషయం ప్రభకు తెలిసి... దేవ్‌ను ప్రభ బ్లాక్మెయిల్ చేసిందని అందుకే దేవే ఆమెను చంపి ఉంటాడని పోలీసులకు చెప్తాడు ఆనంద్. ఇన్స్పెక్టర్ దేవ్‌ను బెదిరిస్తాడు. ఈ లోపు ప్రైవేట్ డిటెక్టివ్ పోరు ఎక్కువవుతుంది దేవ్‌కి. అటు రంజిత్‌కు మామ పోరూ ఎక్కువవుతుంది. డాలీకి భర్త ఎఫైర్ విషయం తెలిసి, భర్తను చంపేయాలనుకుంటుంది. కాని అంతకుముందే రంజిత్ ప్రైవేట్ డిటెక్టివ్ చెప్పిన వ్యక్తి దగ్గర ఒక నాటు తుపాకీ కొనుక్కుంటాడు. కత్తితో తన వెనకాల పొడిచిన భార్యను తుపాకితో కాల్చి చంపేస్తాడు. డబ్బు కోసం మళ్లీ రీనాను బ్లాక్మెయిల్ చేస్తాడు రంజిత్ అపరిచిత మెయిల్ ద్వారా. రీనా మళ్లీ దేవ్‌ను డబ్బులు అడుగుతుంది తండ్రి వైద్యం కోసం. ఇవ్వనంటాడు. అపాలజీ చెప్పడానికి రీనా తల్లికి ఫోన్ చేస్తే రీనా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది దేవ్‌కి. అప్పుడు మొత్తం విషయం తెలుస్తుంది. తను డబ్బు కోసం రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేయడం, రంజిత్ రీనాను బ్లాక్ మెయిల్ చేయడం. ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా రీనాకు పంపిస్తాడు దేవ్. రియౖలైజై రంజిత్ స్నేహానికి స్వస్తి చెప్పి అతని నంబర్ డిలీట్ చేస్తుంది రీనా. ఆనంద్‌కూడా దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు దేవ్. ‘‘నువ్వు అడిగినంత డబ్బిస్తాను. కాని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది ఆనంద్ అని రంజిత్‌తో చెప్పు’’అంటాడు దేవ్.. ప్రైవేట్ డిటెక్టివ్‌తో. అలాగే చెప్తాడు ప్రైవేట్ డిటెక్టివ్. ఈ బ్లాక్‌మెయిలర్‌కు గుణపాఠం చెప్పాలనే ఆవేశంతో ఉన్న రంజిత్... ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారంతో ఆనందే అసలు బ్లాక్‌మెయిలర్ అనుకొని అతనిని చంపేస్తాడు. ఈ క్రమంలో తన కూతురిని చంపింది అల్లుడే అన్న నిజమూ తెలుస్తుంది రంజిత్ మామకు. అలా రంజిత్ దోషిగా దొరికిపోతాడు. దేవ్ కోసం రీనా ఆ రాత్రి భోజనం వండి టేబుల్ మీద సర్ది ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడొస్తావ్ ఇంటికి అని మెస్సేజ్ పెట్టి. ఆ మెస్సేజ్ వచ్చేటప్పటికీ దేవ్ ఎప్పటిలా రాత్రి ఆఫీస్‌లో వీడియో గేమ్ ఆడ్తుంటాడు. చిత్రంగా విన్ అవుతాడు. భార్య మెస్సేజ్ చూసి ఆమె నంబర్ డిలిట్ చేసేస్తాడు. సామాన్యుడు తనే సమస్యలను సృష్టించుకుని ఆ సుడిగుండంలో కొట్టుకుపోతాడు అనే సారాంశం ఈ బ్లాక్మెయిల్. దేవ్‌గా ఇర్ఫాన్ అద్భుతం. రంజిత్‌గా అరుణోదయ్ కూడా సూపర్బ్. ఇక కీర్తి కుల్హరి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. సున్నితమైన హాస్యంతో గొప్ప సమస్యను చిత్రీకరించిన తీరు అద్భుతం. మల్టీప్లెక్స్‌ల్లో ఆడుతోంది. తప్పక చూడండి. – శరాది -
దేవుడు-సెక్స్.. రెండూ భయాలే!
సాక్షి, సిమ్లా : వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే రచయిత్రి శోభాడే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుశ్వంత్‌సింగ్ సాహిత్య వేడుకలో పాల్గొన్న ఆమె శృంగారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు-శృంగారం రెండు జనాలకు భయం పుట్టించేవేని ఆమె అన్నారు. కసౌలిలో జరిగిన ఆరో ఎడిషన్ వేడుకలో ఆమె... కామ సూత్ర, ఇండియాలో శృంగార పద్ధతులు, సెక్స్ మీద ఇప్పుడున్న వారి అభిప్రాయాలపై సమీక్ష తదితర అంశాలపై ఆమె ప్రసంగించారు. కామ అనేది చాలా అందమైన పదమని కానీ, కామసూత్ర అలా కాదని ఆమె అభిప్రాయపడ్డారు. శృంగారం విషయంలో భారతీయులు ఎంజాయ్ చేస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ‘దేవుడిలానే సెక్స్ కూడా జనాలను భయపెడుతోంది. ‘గాడ్’, ‘సెక్స్’ (GOD-SEX) రెండూ మూడక్షరాల పదాలే. హింసాత్మక లక్ష్యాల కోసమే రెండింటినీ ఉపయోగించుకుంటున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. కొందరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ‘గాడ్’, ‘సెక్స్’ను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటి దివ్యా దత్తా ఇండియన్ సినిమాలో సెక్స్ ప్రస్థానం గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు హీరోయిన్లను చాలా పద్ధతిగా చూపించేవారు. ఎక్స్ పోజింగ్ కోసం వ్యాంప్ తరహా పాత్రలను సృష్టించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. హీరోయిన్లే శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోతున్నారు. వారిని చూసేందుకు కూడా జనాలు మొహమాటం పడట్లేదు. అయితే ఎటొచ్చి ఆ శృంగారం అనే అంశం గురించి బయట మాట్లాడేందుకు మాత్రం ప్రేక్షకులు జంకుతున్నారు అని దివ్యా పేర్కొంది. -
ఆ సీనియర్ నటిని పెళ్లి చేసుకుంటాడట!
సినీ నటీమణులకు ఈ మధ్య సోషల్ మీడియాలో చిత్రమైన ప్రపోజల్స్ వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ యువకుడు బాలీవుడ్ అందాల నటి టిస్కా చోప్రాపై మనస్సు పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్లో బహిరంగంగా ప్రతిపాదన పంపాడు. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న 42 ఏళ్ల టిస్కా కూడా ఏం తక్కువ తినలేదు. ‘నేను పెళ్లికి రెడీ. వివరాలు పంపు. మా ఆయన కూడా ఎవరి కోసం నేను వెళుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు అంతకంటే సీనియర్ నటికి ట్విట్టర్లో పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ‘బాగ్ మిల్కా బాగ్’, ‘వీర్ జరా’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సీనియర్ నటీమణి దివ్యాదత్తాను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. ట్విట్టర్లో అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు కానీ.. వచ్చిరానీ ఇంగ్లిష్‌లో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు. ‘Divya Like you and I want to marry you very extraordinary amount Tume Hu Khus marry me I will swear’ అంటూ ట్వీట్ చేశాడు. అతని భావాల బట్టి ‘దివ్యా.. నువ్వు నాకు ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. ఒట్టు’ అని అన్నట్టు భావిస్తున్నారు. అయితే, అతడి ఇంగ్లిష్ అర్థం కాక సీనియర్ నటి దివ్యాదత్తా కూడా తికమక పడ్డారు. ‘ఏమంటున్నావు అన్నా.. కాస్తా అర్థమయ్యేట్టు చెప్పు’ అని ఆమె అడిగారు. ఇక, అతడి వచ్చిరానీ ఇంగ్లిష్ మీద నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లిష్ భాష ఇప్పుడే ప్రశాంతంగా చనిపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. మీ మీద ధ్యాసతో ఏం టైప్ చేస్తున్నాడో తెలియక తప్పులు టైప్ చేసి ఉంటాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా గూగుల్ ట్రాన్స్‌లేటర్ పొరపాటే అయి ఉంటుందని ఒకరు.. కన్సోలేషన్ ప్రైజ్ కింద స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ అతనికి కానుకగా ఇవ్వండని మరొకరు ఛలోక్తులు విసిరారు. @divyadutta25 @Armanma19175530 English just died a Peaceful death! — Shilpacious (@shilpa11m) October 21, 2016 -
'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను'
న్యూఢిల్లీ: విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా ఇటీవల 'చాక్ ఎన్ డస్టర్' చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి అందరి అసహనానికి గురైన బాలీవుడ్ నటి ప్రియాదత్త ఇప్పుడు అనూహ్య పాత్రతో ముందుకు రానుంది. ఆమె వ్యభిచారి పాత్రలో నటించనుంది. అలా నటించాలని తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ఇంతవరకు ఆ కోవకు చెందిన పాత్ర తన ముందుకు రాలేదని, తొలిసారి వేశ్యగా నటించడం ఆసక్తిగా అనిపిస్తోందని పేర్కొంది. కోల్ కతాలోని సోనాగచి అనే రెడ్ లైట్ ఏరియాకు చెందిన వ్యభిచారుల పిల్లల నేపథ్యంతో 2004లో 'బోర్న్ ఇన్ టూ బ్రూత్లెస్' అనే డాక్యుమెంటరీ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు అదే చిత్ర నేపథ్యంలో మరో చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అరూప్ దత్తా దర్శకత్వం వహించనున్నారు. 'నేను అరూప్ దత్తా చిత్రంలో ప్రాస్టిట్యూట్ గా నటిస్తున్నాను. మేం మార్చిలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ప్రాంతంలోనే షూటింగ్ జరపనున్నాం. సాప్నా పబ్బి, సీమా బిస్వాస్ నాతోపాటు నటిస్తున్నారు. వ్యభిచారి పాత్ర చాలా కష్టమైనది.. వాస్తవ జీవితానికి సంబంధించినది. అందుకే నాకు కొంత ఆసక్తిగా ఉంది' అంటూ దివ్యాదత్త చెప్పుకొచ్చింది. -
సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు బిషన్ సింగ్ బేడీ (మాజీ క్రికెటర్), దివ్యా దత్తా (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. పాత స్నేహితులు, పాత బంధుత్వాల స్థానంలో కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. వీరి పుట్టిన రోజు 25. కేతుసంఖ్య కాబట్టి ఆధ్యాత్మికంగా పట్టు సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోవాలన్న కోరిక, విదేశాలకు వెళ్లాలన్న కల నెరవేరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతంలో వృద్ధి ఉంటాయి. లక్కీ నంబర్స్: 1,2,4,6,7, 8; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, పర్పుల్, వయొలెట్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు; సూచనలు: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అల్సర్స్, జీర్ణక్రియకు సంబంధించిన జాగ్రత్త అవసరం. కేతు జపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అనాథలకు అన్నదానం, వికలాంగులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్