సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 25, the birthday celebration is buying Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Thu, Sep 24 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

సెప్టెంబర్  25న  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
 బిషన్ సింగ్ బేడీ (మాజీ క్రికెటర్), దివ్యా దత్తా (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. పాత స్నేహితులు, పాత బంధుత్వాల స్థానంలో కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. వీరి పుట్టిన రోజు 25. కేతుసంఖ్య కాబట్టి ఆధ్యాత్మికంగా పట్టు సాధిస్తారు.

జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోవాలన్న కోరిక, విదేశాలకు వెళ్లాలన్న కల నెరవేరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతంలో వృద్ధి ఉంటాయి. లక్కీ నంబర్స్: 1,2,4,6,7, 8; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, పర్పుల్, వయొలెట్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు; సూచనలు: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అల్సర్స్, జీర్ణక్రియకు సంబంధించిన జాగ్రత్త అవసరం. కేతు జపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అనాథలకు అన్నదానం, వికలాంగులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement