bishan singh bedi
-
ఆ పని చేసినందుకు నాన్న 15 ఏళ్లు మాట్లాడలేదు: నటుడు
నచ్చని పనులు చేస్తే పేరెంట్స్ కోప్పడటం సహజమే.. కానీ తాను చేసిన పనికి తండ్రి 15 ఏళ్లపాటు మాట్లాడలేదంటున్నాడు బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. టీనేజ్‌లో నా జుట్టు కత్తిరించుకున్నందుకు మా నాన్న (దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ) బాధపడ్డాడు. కానీ నాపై కోప్పడలేదు. నాకసలు నచ్చలేదుకోప్పడినా బాగుండేది కానీ ఇలా లోలోపలే బాధపడటం నాకసలు నచ్చలేదు. నేనొక సిక్కును కాబట్టి జుట్టు, గడ్డం పొడవుగా పెంచుకోవాలని అందరూ చెప్తుండేవారు. ఎప్పటికైనా ఆ పని చేయగలనేమో కానీ ఇప్పుడైతే అది సాధ్యపడదు. ఎందుకంటే సినిమాల్లో నా జుట్టు పెద్దగా ఉండకూడదని చెప్పేవారు. 20 ఏళ్ల తర్వాతఅందుకని నా వృత్తి కోసం జుట్టు, గడ్డం కత్తిరించుకోక తప్పలేదు. దాదాపు 20 ఏళ్లపాటు ఆయన దిగులుపడుతూనే ఉన్నారు. పింక్ (2016) సినిమా రిలీజయ్యాక ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నారు. నీ దారి నువ్వు ఎంచుకున్నావు.. నువ్వు చేయాల్సింది చేస్తున్నావ్.. కానీ మంచి అవకాశాల్ని ఎంచుకోమని సలహా ఇచ్చాడు.33 ఏళ్ల వయసులో..నాకు బాగా గుర్తు.. ఎప్పుడో 18 ఏళ్ల వయసులో జుట్టు కత్తిరించుకున్నా.. పింక్ సినిమా వచ్చేనాటికి నాకు 33 ఏళ్లు. దాదాపు 15 ఏళ్ల తర్వాత కానీ నాన్న నాతో మునుపటిలా మాట్లాడలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా అంగద్ బేడీ.. టైగర్ జిందా హై, డియర్ జిందగీ, పింక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. -
పోయినవాళ్లు మిగిల్చేవి జ్ఞాపకాలే!
ఇటీవల మరణించిన క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు పారదర్శకంగా ఉండేవి. మంచి సంభాషణను ఇష్టపడతారు. మాట్లాడినదంతా ఓపిగ్గా వింటారు. ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మరో క్రికెటర్ స్నేహితుడు టైగర్ పటౌడీలో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి ఉంటుంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి,సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. మరో క్రికెట్ దిగ్గజం అబ్బాస్ అలీ బేగ్ లోతైన రాజకీయ అవగాహనను కలిగి ఉండేవారు. టైగర్, బిషన్ ఇప్పుడు మనతో లేరు. స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే. నేను క్రికెట్ అభిమానిని కాదన్న సంగతి రహస్యమేమీ కాదు. నిజానికి ఆ ఆట నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో గాని చూడను కూడా. ఫలితంగా చాలా మంది క్రికెటర్లు నాకు తెలియదు. కానీ గొప్ప జ్ఞాన గాంభీర్యంతో నేను క్రికెట్ చర్చలకు తెగించినప్పుడు, తెలిసీ తెలియని విషయ సమా చారంతో బుద్ధిహీనమైన ప్రశ్నలు సంధించినప్పుడు పదే పదే నన్ను గట్టున పడేసిన వారిలో నేను స్నేహితులుగా పరిగణించే క్రికెటర్లు ముగ్గురున్నారు. వారు – టైగర్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, అబ్బాస్ అలీ బేగ్. బాధాకరం... టైగర్(2011లో మరణించారు), బిషన్ ఇప్పుడు మనతో లేరు. బగ్గీ (అబ్బాస్ అలీ బేగ్) ఈ మధ్యే తన భార్య వినూ (వినూ మీర్చందానీ)ను కోల్పోయారు. గత సోమవారం (23 అక్టోబర్) నాటి బిషన్ సింగ్ మరణం ఈ ముగ్గురు స్నేహితుల జ్ఞాప కాలను తిరిగి తెచ్చిపెట్టింది. వారి గౌరవార్థం, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. టైగర్‌కు నా క్రీడా పరిజ్ఞానం అంతంత మాత్రమేనని తెలుసు. ఒక్క టీవీ స్టూడియోలో తప్ప, ఆయన నా ముఖంపై కోడిగుడ్లు పగిలే అవకాశం ఉన్న పరిస్థితికి నన్ను వదిలేయకుండా మా సంభాషణను సున్నితంగా, నేర్పుగా నాకు నచ్చిన విషయాల వైపు మళ్లించేవారు. తరచు ఆ మళ్లింపు నేను ధరించిన టై గురించిన పొగడ్త అయివుండేది. వివేచనను అభిరుచిగా కలిగిన వ్యక్తి ఆయన. కనుక ఆయన మెచ్చు కోలు నన్ను అదే టైని మళ్లీ మళ్లీ ధరించేలా చేసేది. ఒక సందర్భంలో తొలిసారిగా ఆయన తన కనుబొమ నొకదాన్ని ఎగరేస్తూ, నెమ్మదైన స్వరంతో... ‘‘మీరు ఆ టై ధరించడం ఇది మూడోసారి!’’ అని అనేంతవరకు ఆ టైని నేను వదిలిపెట్టలేదు. టైగర్‌లో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి కూడా ఉంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి, సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. బిషన్ చాలా భిన్నమైనవారు. ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు, అంతర్గత భావాలు తరచు పారదర్శకంగా, పైకి కని పించేలా ఉండేవి. మంచి సంభాషణను ఆయన ఇష్టపడతారు. మాట్లా డినదంతా ఓపికగా వింటారు. అలాగే ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మేము తరచు బగ్గీ, వినూ వాళ్లింట్లో కలుసుకునేవాళ్లం. మేడపైన మాటల్లో మునిగిపోయేవాళ్లం. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏమిటి’ అని బగ్గీ నన్ను అడిగేవారు. అయితే రాజకీ యాలను ఆయన నాకంటే బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమ యేందుకు ఎక్కువ సమయం పట్టేది కాదు. నేను చెప్పేది వినేవారు. నా గ్రహింపులో లేని లోతైన గమనింపుల గురించి చెప్పి నన్ను ఉల్లాస పరిచేవారు. ముగ్గురిలోకి బగ్గీ ఎక్కువగా తటపటాయింపుతో ఉండేవారు. వినూ అప్పుడు ఆ సంకోచాల నుంచి ఆయన్ని కాపాడేందుకు ముందు కొచ్చేవారు. ఆమె చురుకైనవారు. సంభాషణ ప్రియత్వం కలిగి నవారు. విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించే స్నేహశీలి. అతిథు లను ఆదరించే అద్భుతమైన మహిళ. రుచిగా వండినంత మాత్రానే కాదు, అతిథుల సన్నిధి ఆమెను ఉల్లాసపరచడం వలన కూడా వారింట్లో భోజనం ఆరగించడం అన్నది ఒక సంతుష్టికరమైన భావ నను కలిగించేది. తన స్నేహితుల సమక్షంలో ఆమె అపరిమితమైన సంతోషంతో ఉండేవారు. నేనిది రాస్తున్న సమయానికి, స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే నన్న మెలకువను కూడా మొత్తంగా నేను కలిగి ఉన్నాను. మీరు నెలలు లేదా ఏళ్లపాటు కలుసుకుని ఉండకపోవచ్చు. మిమ్మల్ని సముద్రాలు, తరచు రాసుకోని ఉత్తరాలు వేరు చేస్తుండొచ్చు. అయితే ఆ దూరమే మిమ్మల్ని కలిపి ఉంచే జ్ఞాప కాలను శక్తిమంతం చేస్తుంది. కాల క్రమేణా ఆ జ్ఞాపకాలు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పచుకుంటాయి. ఇప్పుడు టైగర్, బిషన్, వినూ గురించి నాకు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే! ఆ ముగ్గురూ నాకు దూరమయ్యాక తమవైన స్థానాలను నాలో ఏర్ప చుకున్నారు. ఒక అర్థంలో నేను స్పష్టమైన దానిని చెబుతున్నాను. అలాగే, మరొక విషయం కూడా చెబుతాను. మనుషులు చనిపోయినప్పుడు మాత్రమే మళ్లీ ఇక వారిని కలవలేం అన్న భావనలో మనం మునిగి పోతాం. అప్పుడు వారి జ్ఞాపకాలు వేరే భిన్నమైన స్థాయిని పొందు తాయి. బతికున్నవాళ్లను – రేపో, తర్వాతి వారమో, ఫోన్ కాల్లోనో, ఈమెయిల్ ద్వారానో – జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది ఇకపై ఉండదు. ఇప్పుడిక మీకున్నవన్నీ కేవలం జ్ఞాపకాలే! ఒక సమావేశం, ఒక సంభా షణ, ఒక ఈమెయిల్ అన్నది ఇక ఎప్పటికీ సంభవించవివే! అనేకమైన ఈ ఆలోచనలు నిస్సందేహంగా వయసు నిర్దేశించి నవే. అది అనివార్యం. నిజాయతీగా చెప్పాలంటే 34 ఏళ్ల క్రితం నా భార్య నిషా చనిపోయినప్పుడు కూడా పూర్తి భిన్నంగా ఏమీ లేదు. 2015లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా! లేదా నేను సన్నిహితంగా ఉన్న మరెవరి విషయంలోనైనా! నా చిన్నతనంలో నేను జ్ఞాప కాలు ఎలా జనిస్తాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనే ఆలోచ నను కలిగిలేను. ఇటీవల కొద్ది వారాల తేడాతో సంభవించిన విను, బిషన్ మరణాలు నాలో ఆ స్పృహను కలిగించాయి. ప్రియ మిత్రమా! నా ఉద్దేశం మనో దౌర్బల్యం లోనికో, తాత్విక చింతన లోనికో జారుకోవడం కాదు. ఆనందకరమైన జ్ఞాపకాలతోనే నేను మొదలయ్యాను. కానీ నేను చెప్పాలని భావించిన దానికంటే విచారంగా ముగించినట్లున్నాను. అంటుంటారు కదా: ఇదే జీవితం! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
దివికేగిన దిగ్గజం
టి20 క్రికెట్ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్ నాలుగు ఓవర్లేసే లీగ్‌లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్. ఆయన స్పిన్ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్. అంతలా... భారత క్రికెట్లో తన స్పిన్‌తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్ వెంకటరాఘవన్ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ జగాన్ని స్పిన్ మాయాజాలంతో ఊపేసిన బిషన్ సింగ్ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్‌ను కన్నీట ముంచాడు. న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్పిన్‌కే వన్నెలద్దిన బౌలింగ్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఈ పంజాబీ క్రికెట్ స్టార్ 1946లో సెపె్టంబర్ 25న అమృత్‌సర్‌లో జన్మించారు. తదనంతరం క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్ భార్య నేహ ధూపియా బాలీవుడ్ హీరోయిన్. మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్ ఉన్నారు. స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్ సింగ్‌ది. తన కెరీర్ అనంతరం కూడా క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్నెస్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్నెస్ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇదీ చరిత్ర... సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్లో స్పిన్నర్‌గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్‌ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్ సింగ్ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967 నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులాడిన స్పిన్ లెజెండ్ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో బిషన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్లో తక్కువగా 10 మ్యాచ్‌లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్‌కప్‌లో, 1979 రెండో వన్డే వరల్డ్‌కప్‌లో బేడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1975 వరల్డ్‌కప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిషన్ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి. బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఇదీ ఘనత... ఈ భారత స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్‌ను తన స్పిన్ తో శాసించాడు. 1969–70 సీజన్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్‌లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్‌ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్లోనే ఇంగ్లండ్ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు. అరుణ్ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని స్టాండ్‌కు బిషన్ సింగ్ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్‌కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర బిషన్ సింగ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్‌పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. –ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలర్డైస్ స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్లో స్పిన్‌కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం. –బీసీసీఐ కార్యదర్శి జై షా బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్‌లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. –బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్‌సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిషన్ సింగ్ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్‌కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి. –మాజీ ఓపెనర్ గంభీర్ చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్‌సింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు. –సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. –మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్ ‘సర్దార్ ఆఫ్ స్పిన్’ బిషన్ సింగ్ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్ కెప్టెన్ , దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ విజేత సభ్యుడు సెహ్వాగ్ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్‌లాల్, నెహ్రా, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. -
టీమిండియా మాజీ కెప్టెన్ మృతి..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (అక్టోబర్ 23) సోమవారం తుది శ్వాస విడిచారు. బేడీ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ కొనసాగారు. టీమిండియా తరపున 67 టెస్టులు ఆడిన బేడి.. ఏకంగా 266 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పది వన్డేల్లో కూడా భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. 10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు. అదే విధంగా భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టారు. అయన బౌలింగ్ కోటాలో ఏకంగా 8 మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. 1970లోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న బేడీ.. దేశీవాళీ క్రికెట్లో ఎక్కువగా ఢిల్లీ తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఈ జెంటిల్మెన్ గేమ్‌లో కొంతకాలంగా వ్యాఖ్యాతగా తన సేవలు అందించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఆయన ఉన్నారు. మణిందర్ సింగ్,మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు భారత క్రికెట్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. 1990 తర్వాత బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా కూడా పనిచేశారు. -
అరుదైన ఘనత.. టీమిండియా తరపున లీడింగ్ వికెట్‌టేకర్‌గా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్‌ను ఔట్ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు)ని క్రాస్ చేసి ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్(433 వికెట్లు), డేనియల్ వెటోరి(362 వికెట్లు), డ్రీక్ అండర్వుడ్(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా తరపున లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా(268 వికెట్లు), బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు) వినూ మన్కడ్(161 వికెట్లు), రవిశాస్త్రి(151 వికెట్లు), దిలిప్ దోషి(114 వికెట్లు), ప్రగ్యాన్ ఓజా(113 వికెట్లు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ల జాబితాలో జడేజా ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 65 టెస్టుల్లో 268 వికెట్లతో కొనసాగుతున్నాడు. జడ్డూ కంటే ముందు అనిల్ కుంబ్లే(619 వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్(474 వికెట్లు), కపిల్ దేవ్(434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్(417 వికెట్లు), ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 311 వికెట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. Sir Ravindra Jadeja 🔥👏#Cricket #RavindraJadeja #TeamIndia #WTCFinal #InsideSport pic.twitter.com/p2h1TaVk0q — InsideSport (@InsideSportIND) June 10, 2023 Ravi Jadeja has joined the group of the elite spinners. Left-arm spinners with most wickets in Test cricket: ⁰433 - Rangana Herath ⁰362 - Daniel Vettori ⁰297 - Derek Underwood ⁰267 - Ravindra Jadeja ⁰266 - Bishan Singh Bedi#WTCFinal #WTC23Final pic.twitter.com/S6dl7xwyVM — Vipin Tiwari (@vipintiwari952) June 10, 2023 Ravindra Jadeja now has most Test wickets for an Indian left-arm spinner. He overtook Bishan Singh Bedi in the list by picking his 267th Test wicket during WTC 2023 final. Sir Ravindra Jadeja 🔥🔥🔥 One of the best All rounder in the world.❤ pic.twitter.com/41OnAVamLP — Hardy🇮🇳 (@Hardy10001000) June 10, 2023 చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్ -
ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి
న్యూఢిల్లీ : ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డీడీసీఏ నిర్ణయంపై భారత స్పిన్ దిగ్గజం ,బిషన్ సింగ్ బేడీ మండిపడ్డారు. తన నిరసనను తెలుపుతూ డీడీసీఏ ప్రస్తుత అధ్యక్షుడు, అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని లేఖలో వ్యాఖ్యానించిన ఆయన క్రికెటర్ల కన్నా ఎక్కువగా పాలకులను ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కోట్లా స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండుకు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. అంతేకాకుండా డీడీసీఏలో తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నానని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు బేడీ అందించిన సేవలకు గుర్తింపుగా 2017లో ఆయన పేరుతో స్టాండును ఏర్పాటు చేశారు. ఈ లేఖపై స్పందించేందుకు డీడీసీఏ విముఖత వ్యక్తం చేసింది. -
‘ఆ దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లోనే చూశాను’
న్యూఢిల్లీ : అండర్-19 ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణపై టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించారు. యువ భారత్ ఆటగాళ్ల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ఏ జట్టయినా చెత్త ప్రదర్శన చేయొచ్చు. ఇంత చెత్తగా తిట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఎప్పుడూ చూడని దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లో ‘చూపించారు’అని ఎద్దేవా చేశాడు. (చదవండి : ‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ‘ఏ జట్టయినా చాలా చెత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. కానీ ఇంత చెత్తగా మాత్రంగా ప్రవర్తించకూడదు. ఇది చాలా అవమానకరమైన, అసహ్యకరమైన ప్రవర్తన’ బంగ్లా ఏం చేసిందో, ఎలా ఆడిందో అది వారి సమస్య. మనోళ్లు ఎలా ఆడారో అది మన సమస్య. కానీ, బండ బూతులు తిట్టుకోవడమేంటి..!’అని బిషన్ సింగ్ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి కప్పు కొట్టింది. అయితే, విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం అక్కడితో ముగిసింది. ఐదుగురిపై చర్యలు.. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
‘అతన్ని కెప్టెన్‌గా తొలగించండి’
న్యూఢిల్లీ:మొహాలీ వేదికగా శుక్రవారం ఢిల్లీతో జరిగిన పంజాబ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔట్ కాకపోయినా అంపైర్ పాశ్చిమ్ పఠాక్ ఔట్ ఇవ్వడంతో కాసేపు క్రీజ్‌లో అలానే ఉండిపోయాడు. క్రీజ్‌ను వదిలి వెళ్లనంటూ మొండికేసిన గిల్.. అంపైర్‌ను తిట్టిపోశాడు. అసలు అంపైరింగ్ తెలుసా అంటా దుమ్మెత్తిపోశాడు. అయితే శుభ్‌మన్ గిల్ ప్రవర్తనపై ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడకపోయినా భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ తీవ్రంగా మండిపడ్డాడు. క్రికెటర్‌ననే విషయం మరిచిపోయి రౌడీలా ప్రవర్తిస్తావా అంటూ విమర్శించాడు.(ఇక్కడ చదవండి: క్రీజ్‌ను వదిలి వెళ్లను.. అంపైర్‌పై తిట్ల దండకం!) ‘ఈ తరహా ప్రవర్తన గిల్‌కు సరైనది కాదు. ఇది గిల్‌కే ఏ ఒక్క క్రికెటర్‌కూ మంచి పద్ధతి కాదు. భారత-ఏ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గిల్ ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏ ఒక్కరూ గేమ్ అంటే ఎక్కువ కాదు. క్రికెటర్వనే సంగతి మరిచి రౌడీలా ప్రవర్తిస్తావా. భారత-ఏ జట్టుకు ఒక పరిపక్వత ఉన్న క్రికెటర్ కెప్టెన్‌గా ఉండాలి. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా గిల్‌ను తొలగించాలి. మ్యాచ్ రిఫరీ మాట్లాడకముందే గిల్‌ను భారత-ఏ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించండి’ అని బిషన్ సింగ్ బేడీ విమర్శించాడు. న్యూజిలాండ్-ఏ జట్టుతో సిరీస్‌కు ఇటీవల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్
ముంబై : చివరి రెండు వన్డేలకు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి ఎందుకు విశ్రాంతినిచ్చారని టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ప్రశ్నించారు. ధోని లేకపోవడం వల్లే మొహాలీ వన్డేలో భారత్ భారీ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైందని అభిప్రాయపడ్డారు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని, కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని పీటీఐతో పేర్కొన్నారు. ‘నేనెవరిపై కామెంట్ చేయదల్చుకోలేదు.. కానీ ధోనికి విశ్రాంతినివ్వడమే ఆశ్చర్యానికి గురిచేసింది. కీపర్‌గా, బ్యాట్స్‌మెన్, దాదాపు సారథిగా అతని సేవలు జట్టు కోల్పోయింది. ధోని యువకుడు కాకపోవచ్చు. కానీ అతను జట్టుకు అవసరం. అతను ప్రశాంతంగా ఆటగాళ్లను ప్రభావితం చేయగలడు. ప్రస్తుత సారథికి కూడా అతని సూచనలు అవసరం. అతను లేక కోహ్లి మొరటుగా కనిపించాడు. ప్రపంచకప్ ముందు జట్టులో ప్రయోగాలు అనవసరం. ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. కేవలం ఆట ఆడితే చాలు. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌తో మరిన్ని సమస్యలు రానున్నాయి. ఐపీఎల్లో ఏ ఆటగాడైన గాయపడవచ్చు. అలా అని వారు 100 శాతం ఆడుతారని కూడా మనం విశ్వసించలేం’ అని వ్యాఖ్యానించారు. కుల్దీప్, చహల్‌లు కూడా సీజన్ ఫ్లేవర్‌లాంటి స్పిన్నర్లని, జడేజా, అశ్విన్‌లకు తుది జట్టులో అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు ఈ మాజీ స్పిన్నర్ తెలిపారు. -
‘దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం లేదు’
న్యూఢిల్లీ : ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాదు.. క్యాష్ రిచ్ టీ20.. ఐపీఎల్‌ని మించిన స్కాం దేశంలో మరోకటి లేదంటూ విమర్శల వర్షం గుప్పించారు భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి. న్యూ ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన ‘సాహిత్య ఆజ్ తక్’ కార్యక్రమానికి హాజరైన బిషన్ సింగ్ ఐపీఎల్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి లేదు. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎక్కడికెళ్తుందో ఎవరికి తెలియదన్నారు. ఐపీఎల్ రెండో సీజన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండనే లక్షల కొద్ది సొమ్ము దేశం దాటి వెళ్లి పోయిందన్నారు. అంతేకాక ఐపీఎల్ కోసం ఎన్నుకునే ఆటగాళ్లను ఇండియన్ సెలక్షన్ ఆధారంగానో, స్థానింకగా జరిగే టీ20ల ఆధారంగానో సెలక్ట్ చేయడం లేదన్నారు. ఒక జట్టులో అధిక మొత్తంలో డిమాండ్ చేసే ఆటగాడితో పాటు.. తక్కువ డబ్బు తీసుకునే ఆటగాడు కూడా ఉంటాడు. తక్కువ ఆదాయం ఉన్న ఆటగాడికి సరైన నైపుణ్యాలు ఉండవు. కానీ అతడు నిలదొక్కుకోవాలి.. అందుకే అలాంటి వారు బెట్టింగ్ వైపు దృష్టి సారిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బిషన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకపక్ష నిర్ణయాల గురించి కూడా విమర్శించారు. అనిల్ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించారు. జట్టులోని ఒక వ్యక్తి(కోహ్లి) తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. మనం వీటన్నింటిని చూస్తూ ఉంటాం అన్నారు. అంతేకాక బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కోహ్లి మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాం.. ఇది మంచిది కాదన్నారు. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా - ఇండియాటెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. -
‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటనే అసలైన పరీక్షా అని భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా అయినా కోహ్లి సత్తా ఏంటో ఈ సిరీస్‌లో తెలుస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధూపై బిషన్ సింగ్ బేడి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ దిగ్గజాలకు సింధూ గట్టి పోటీనిచ్చిందని కొనియాడారు. ఈ ఒలింపిక్ పతాక విజేత ఇప్పటికే తన సత్తాను చాటిందన్నారు. సింధూలా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి కోహ్లి ఇబ్బంది పడవచ్చన్నారు. దిగ్గజ జట్టైన దక్షిణాఫ్రికాతో కోహ్లి సేనకు గట్టిపోటీ ఎదురవ్వనుందని తెలిపారు. -
పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడితే తప్పేంటి?
న్యూఢిల్లీ:గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టు దూరంగా ఉండటాన్ని దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ తప్పుబట్టారు. కేవలం రాజకీయాలు కారణంగానే ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయాయని విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక క్రీడను క్రీడగానే చూడాలే కానీ, ఇక్కడ రాజకీయాలతో కలుషితం చేయడం ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకుండా ఉంటే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చనే ప్రభుత్వ నిర్ణయాన్ని బేడీ పరోక్షంగా తప్పుపట్టాడు. 'క్రికెట్లో రాజకీయాలేమిటి.. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకుండా ఉంటే ఉగ్రవాదం కంట్రోల్ అయిపోతుందా. ఇరు దేశాల మధ్య సఖ్యత వాతావారణం నెలకొనాలంటే క్రికెట్ అనే దాన్ని ఒక ప్లాట్‌ఫామ్ గా ఉపయోగించుకోవాలి. అంతేకానీ పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకపోతేనే దేశభక్తి ఉందనుకోవడం పొరపాటు. మనం అవలంభించే ఏదొక విధానం మన దేశభక్తిని తెలియచేయదు. నేను ఇక్కడ మాట్లాడేది కేవలం పాకిస్తాన్‌తో సిరీస్‌లకు సంబంధించి మాత్రమే.. అంతేకానీ భారతదేశానికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు' అని బిషన్ సింగ్ బేడీ పేర్కొన్నారు. -
టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టులపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మనుగడ సాగించాలంటే టెస్టు ఫార్మాట్‌కు అమిత ప్రాధాన్యత ఇవ్వాలని అతను అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిర్వహించిన వార్షిక సమ్మేళనంలో కోహ్లి పాల్గొన్నాడు. ‘నా దృష్టిలో టెస్టు క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్. క్రికెట్ బతకాలంటే దీనిపై ఆసక్తి తగ్గవద్దు. టెస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని ఈతరం కుర్రాళ్లకు నా సలహా’ అని కోహ్లి అన్నాడు. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజాలు బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ‘నేను అండర్–14, అండర్–16 మ్యాచ్‌లు ఆడిన సమయంలో బేడి కోచ్‌గా ఉన్నారు. అప్పట్లో ఆయన శిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు మాత్రం అది నా జీవితంలో భాగంగా మారిపోయింది. ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం’ అని విరాట్ తన మనసులో మాట చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లి గురించి మాట్లాడుతూ... ‘మైదానంలో కోహ్లి ప్రదర్శించే కొన్ని హావభావాలు నాకు నచ్చవు. అయితే మైదానంలో అంత తీవ్ర స్వభావంతో కనిపించే భారత క్రికెటర్‌ను నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. మున్ముందు అతనిలోని ఆ కోణం మెత్తబడవచ్చు కానీ విరాట్‌ను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను’ అని బేడి ప్రశంసలు కురిపించారు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో రెడ్, బ్లూ, గ్రీన్‌వంటి రంగుల జట్ల పేర్లతో టోర్నీని నిర్వహించడం ఏమిటంటూ బేడి తన సహజ శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
సుప్రీం తీర్పుతో క్రికెట్‌కు మేలు: మాజీ కెప్టెన్
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయనందుకుగాను బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను తొలగిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును భారత మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై స్పందించిన ఆయన.. 'క్రికెట్‌కు మేలు జరుగుతుంది' అని అభిప్రాయపడ్డారు. సోమవారం సంచలన తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను తొలగించిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు 19 వ తేదీకి వాయిదా వేసింది. -
'ఆయన్ను ఎలా మరచిపోతాం'
కాన్పూర్:భారత జట్టు 500వ టెస్టు ఆడుతున్న సందర్భంగా పలువురు మాజీ కెప్టెన్లను బీసీసీఐ సన్మానించిన సంగతి తెలిసిందే. వీరిలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, కె.శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఉండగా, బిషన్ సింగ్ బేడీతో పాటు, గుండప్ప విశ్వనాథ్ లు మాత్రం సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు క్రితం తనకు బీసీసీఐ నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదని బిషన్ సింగ్ బేడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణం చేతనే బేడీ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని భావించినా.. అందులో ఎటువంటి వాస్తవం లేదని ఐపీఎల్ చైర్మన్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి బిషన్ సింగ్ బేడీ హాజరు కాకపోవడాన్ని బీసీసీఐకి జరిగిన నష్టంగా అభివర్ణించిన శుక్లా.. ఓ దిగ్గజ ఆటగాడ్ని పిలువ కూడదనే ఆలోచన ఎలా చేస్తామని ప్రశ్నించారు. జాతీయ వార్తా పత్రిక ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిషన్ సింగ్ బేడీ గైర్హజరీపై శుక్లా స్పందించారు. '500వ టెస్టు మ్యాచ్ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ బేడీకి ఈ-మెయిల్ చేశా. దాంతో పాటు ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేయాలని యత్నించా. బిషన్ సింగ్ బేడీ అందుబాటులోకి రాలేదు. నాకు బేడీ అంటే విపరీతమైన అభిమానం. విద్యార్థి దశ నుంచి ఆయన ఆటను చూస్తూ పెరిగాను. ఈ గ్రీన్ పార్క్ స్టేడియంలో బేడీ కొట్టిన సిక్సలు ఇప్పటికీ నాకు గుర్తే. 22 టెస్టులకు సారథిగా వ్యవరించిన బేడీని పిలవకూడదనే ఆలోచన బీసీసీఐ చేయలేదు' అని శుక్లా పేర్కొన్నారు. -
బీసీసీఐపై మాజీల విమర్శలు
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. బీసీసీఐలో రాజకీయ నాయకులు అధికంగా ఉన్న కారణంగానే బోర్డులో పారదర్శకత లోపించిందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ఎద్దేవా చేశారు. భారత్ లో క్రికెట్ మరింత ప్రొఫెషనల్ గా ఎదగాలంటే బీసీసీఐ కమిటీల్లో రాజకీయ నాయకులకు స్వస్తి పలకాల్సిందేనని చాపెల్ పేర్కొన్నారు. బీసీసీఐలో రాజకీయ నాయకులు లేకుండా సరికొత్త కమిటీ ఏర్పాటు చేస్తే ప్రజా విశ్వాసాన్ని పొందే అవకాశం ఉందన్నారు. శనివారం ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక నిర్వహించిన 'లీడర్ షిప్'సమ్మిట్ లో ఇయాన్ చాపెల్ తో పాటు, భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, గౌతం గంభీర్, రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇయాన్ తనదైన శైలిలో వ్యంగస్త్రాలు సంధించారు. బీసీసీఐలో రాజకీయాలు అధికంగా ఉండటం వల్ల పారదర్శకత లోపించదన్నాడు. వాటి నుంచి బయటపడాలంటే రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అందరూ పాటిస్తున్న అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్) పద్దతిని బీసీసీఐ వ్యతిరేకించడాన్నిచాపెల్ తప్పుబట్టారు. ప్రపంచంలోని ఇతర క్రికెట్ దేశాలు వ్యవహరించే తీరు ఒక ఎత్తయితే.. బీసీసీఐ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, బిషన్ సింగ్ బేడీ కూడా బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. బీసీసీఐలో జవాబుదారీతనం అసలు లేదని బేడీ విమర్శించారు. బీసీసీఐలో పారదర్శకతను ఒకటి నుంచి పది వరకూ కొలిస్తే కచ్చితంగా సున్నానే వస్తుందన్నారు. ఇది చాలా ఆందోళన కల్గించే అంశంగా బేడీ పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు బిషన్ సింగ్ బేడీ (మాజీ క్రికెటర్), దివ్యా దత్తా (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. పాత స్నేహితులు, పాత బంధుత్వాల స్థానంలో కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. వీరి పుట్టిన రోజు 25. కేతుసంఖ్య కాబట్టి ఆధ్యాత్మికంగా పట్టు సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోవాలన్న కోరిక, విదేశాలకు వెళ్లాలన్న కల నెరవేరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతంలో వృద్ధి ఉంటాయి. లక్కీ నంబర్స్: 1,2,4,6,7, 8; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, పర్పుల్, వయొలెట్, ఎల్లో; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు; సూచనలు: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అల్సర్స్, జీర్ణక్రియకు సంబంధించిన జాగ్రత్త అవసరం. కేతు జపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అనాథలకు అన్నదానం, వికలాంగులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
'కోహ్లిని కంట్రోల్ చేయాలి'
న్యూఢిల్లీ: టీమిండియాకు 'స్ట్రాంగ్ కోచ్'ను నియమించాల్సిన అవసరముందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. దూకుడు స్వభావంతో మైదానంలో వివాదాలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లిని కంట్రోల్ చేయాలంటే శక్తిమంతుడైన కోచ్ కావాలని పేర్కొన్నారు. 'విరాట్ కు మంచి కోచ్ కావాలి. కోహ్లిని అతడు గైడ్ చేయగలగాలి. కోహ్లి దుండుకు స్వభావాన్ని కోచ్ కంట్రోల్ లో పెట్టగలగాలి. క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగాలంటే జగడాలమారి వైఖరిని కోహ్లి మార్చుకోవాల్సిన అవసరముంది' అని బేడి అన్నారు. విరాట్ కోహ్లిని మీడియా నాశనం చేస్తోందని బిషన్ సింగ్ బేడి మండిపడ్డారు. అతడి దూకుడు స్వభావాన్ని ఒక వర్గం అతిగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్టు కెప్టెన్సీ కోహ్లికి అప్పగించారు. -
భువనేశ్వర్ కుమార్ కు బేడీ ప్రశంస
న్యూఢిల్లీ:టీం ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పై భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భువనేశ్వర్ కుమార్ ఆరు వికెట్లు తీసి బేడీ రికార్డును తిరగరాశాడు. దీనిపై బేడీ స్పందించారు. ఈ 24 ఏళ్ల మీరట్ ఆటగాడు భారత్ తరుపున తన రికార్డు అధిగమించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ' ఆ యువ ఆటగాడు నా తరహా ఆటగాడే. టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ ను నమోదు చేశాడు'అని బేడీ తెలిపారు. అంతకు ముందు ఇంగ్లండ్ పై బిషన్ సింగ్ బేడీ ఆడిన చివరి టెస్టులో నెలకొల్పిన (5/82) రికార్డే ఇప్పటి వరకూ పదిలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ శుక్రవారం చెలరేగి బౌలింగ్ చేయడంతో ఆరు ఇంగ్లిష్ ఆటగాళ్ల వికెట్లను నేలకూల్చాడు.భారత్ నుంచి ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన జాబితాతో ముగ్గురు ఆటగాళ్లే మాత్రమే ఉన్నారు. 1936లో క్రికెట్ ఆడిన లధా అమర్ సింగ్, 1974 ప్రాంతంలో క్రికెట్ ఆడిన బిషన్ సింగ్, తాజాగా భువనేశ్వర్ కుమార్ లు మాత్రమే ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
అవయవదానానికి కపిల్ దేవ్ ప్రతిజ్ఞ
తాము మరణాంతరం అవయవ దానం చేయనున్నట్లు ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలు శనివారం న్యూఢిల్లీలో ప్రతిజ్ఞ చేశారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు న్యూఢిల్లీ యూరాలజీస్ట్ సోసైటీ అధ్వర్యంలో ఏయిర్ పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా అఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన యూసికాన్-2014 కార్యక్రమంలో వారిరువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్న వారిలో అత్యధికులకు అవయవదానంపై కనీస అవగాహన లేదని ఆ సోసైటీ అర్గనైజింగ్ సెక్రటరీ రాజీవ్ సూద్ వెల్లడించారు. దాంతో అవయవదానం చేసే వారు లేక పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ' హర్ జాన్ కో అమర్ బనానా హై' అనే స్లోగన్‌తో తమ సోసైటీ నడుం కట్టినట్లు వివరించారు. అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పించడం వల్ల మరణించిన వ్యక్తులు కూడా అమరత్వం పొందుతారన్నారు.