‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’ | Kohli will face his real competition in South Africa: Bedi | Sakshi
Sakshi News home page

‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’

Published Fri, Dec 29 2017 7:17 PM | Last Updated on Fri, Dec 29 2017 7:25 PM

 Kohli will face his real competition in South Africa: Bedi - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటనే అసలైన పరీక్షా అని భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా అయినా కోహ్లి సత్తా ఏంటో ఈ సిరీస్‌లో తెలుస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్‌ చెప్పుకొచ్చారు. భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ షట్లర్‌ పీవీ సింధూపై బిషన్‌ సింగ్‌ బేడి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ దిగ్గజాలకు సింధూ గట్టి పోటీనిచ్చిందని కొనియాడారు. ఈ ఒలింపిక్‌ పతాక విజేత ఇప్పటికే తన సత్తాను చాటిందన్నారు. సింధూలా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి  కోహ్లి ఇబ్బంది పడవచ్చన్నారు. దిగ్గజ జట్టైన దక్షిణాఫ్రికాతో కోహ్లి సేనకు గట్టిపోటీ ఎదురవ్వనుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement