India cricket team
-
ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టులు
లండన్: భారత క్రికెట్ జట్టు 2025లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ప్రస్తుత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముగిసిన వెంటనే 2025–2027 డబ్ల్యూటీసీ మొదలవుతుంది. ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 10 నెలల ముందుగానే షెడ్యూల్‌ను విడుదల చేయడం విశేషం. ఐదు టెస్టులు జరిగే వేదికలతో పాటు తేదీలను కూడా ఈసీబీ ప్రకటించింది.జూన్ 20–24 మధ్య లీడ్స్‌లో తొలి టెస్టు, జూలై 2–6 మధ్య బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరుగుతాయి. జూలై 10–14 మధ్య జరిగే మూడో టెస్టుకు లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదిక కానుండగా... మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు (జూలై 23–27), లండన్‌లోని ఓవల్‌లో ఐదో టెస్టు (జూలై 31–ఆగస్టు 4) నిర్వహిస్తారు. ఇరు జట్ల మధ్య 2021–22 సీజన్లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచి 17 ఏళ్లయింది. 2026లో లార్డ్స్‌లో మహిళల టెస్టు... భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలో భారత్, ఇంగ్లండ్ మహిళా జట్లు కూడా అక్కడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య వచ్చే ఏడాది 5 టి20లు, 3 వన్డేలు జరుగుతాయి. జూన్ 28, జూలై 1, 4, 9, 12 తేదీల్లో నాటింగ్‌హామ్, బ్రిస్టల్, ఓవల్, మాంచెస్టర్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఐదు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, డర్హమ్లలో జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో భారత మహిళల జట్టు పర్యటన ముగుస్తుంది. అయితే 2026లో మన టీమ్ మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లి ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఈ టెస్టు జరుగుతుందని ఈసీబీ ప్రకటించింది. లార్డ్స్‌లో మహిళల టెస్టు మ్యాచ్ జరగనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
టీ 20 అండర్ 19 వరల్డ్ కప్‌లో మన చిచ్చర పిడుగులు
త్రిష, షబ్నమ్... ‘తెలుగుతేజాలు’ అంటూ వార్తల్లో పతాక శీర్షికలో వెలుగుతున్న క్రీడాకారిణులిద్దరూ. మహిళల అండర్ 19 కేటగిరీలో టీ 20 వరల్డ్ కప్ క్రికెట్‌కు ఎంపికైన ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్న తెలుగమ్మాయిలు వీళ్లు. త్రిష భద్రాచలం అమ్మాయి, షబ్నమ్ వైజాగ్ అమ్మాయి. నేను భద్రాచలంలో ఫిట్నెస్ కోచ్‌గా ఉండేవాడిని. త్రిష మాకు ఏకైక సంతానం. త్రిష అమ్మ తనకు కావల్సిన పోషకాహారంపై దృష్టి పెడితే, నేను తను క్రీడల్లో శిక్షణ ఎలా ఉందో చూసేవాడిని. తనని మంచి క్రీడాకారిణిగా చూడాలనుకున్నాను. ఇంకెన్నో విజయాలు సాధించాలన్నదే మా కల. – గొంగడి రామిరెడ్డి ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో తన బ్యాట్‌తో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ క్రికెటర్ త్రిష దక్షిణాఫ్రికాలో జనవరి 14 నుంచి 29 వరకు జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత అండర్ –19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. డిసెంబరు 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సీరీస్‌లో పాల్గొనే జట్టులో కూడా చోటు దక్కించుకుని తెలంగాణ నుంచి మరో మిథాలీ రాజ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది త్రిష. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. తండ్రే గురువు వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి నుంచి త్రిష క్రికెట్లో ఓనమాలు దిద్దింది. భద్రాచలంలో తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులో క్రికెట్‌కు పరిచయమైన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు హైదరాబాద్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో ఆమెను చేర్చారు, అక్కడ ఆమె కోచ్‌లందరినీ ఆకట్టుకుంది. సెయింట్ జాన్స్‌లో కోచ్ ఆధ్వర్యంలో తనను తాను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఆమె తన 12 సంవత్సరాల వయస్సులో సీనియర్స్ రాష్ట్ర జట్టులో చేరింది. మిథాలీకి అభిమానిని.. ‘భారత జట్టులో చోటు దక్కించుకోవడంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ ఓపెనింగ్ బ్యాట్ ఉమెన్, లెగ్ స్పిన్నర్. కిందటి నెలలో విశాఖపట్నంలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో స్థానం దక్కించుకుంది. వెస్టిండీస్, శ్రీలంక, ఇండియా ‘ఎ’ , ఇండియా ‘బి’ జట్లతో కూడిన సిరీస్‌లో ఇండియన్ జెర్సీ ధరించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అంటోంది త్రిష. ‘‘తొలి మహిళా క్రికెట్ సంచలనం మిథాలీ రాజ్, ఎం.ఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. వారి నుంచే ఎంతో నేర్చుకున్నాను. వారి వల్లే నా ఆటను అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటాను. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను... ఒకరోజు మిథాలీని ఓ అబ్బాయి ప్రశ్నిస్తూ గ్రౌండ్లో ఎవరు బౌలింగ్ చేస్తుంటారని అడిగాడట. ఎవరు బౌలింగ్ చేస్తున్నారో తాను ఎప్పుడూ చూడనని, తన వద్దకు వచ్చే బంతిని మాత్రమే చూస్తానని మిథాలీ అతనితో చెప్పారట.. ఈ విషయం ఆమే చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆమెను చూసి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అంటున్న త్రిష... తన దృష్టి మొత్తం ప్రపంచకప్‌లో రాణించడంపైనే ఉందని తెలిపింది. తన విజయంపై ఆమె దృష్టి మాత్రమే కాదు తెలుగు మహిళల అందరి దృష్టీ ఉందని చెబుతూ బెస్టాఫ్ లక్. – నిర్మలారెడ్డి ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవాలి... టీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులు ఎప్పుడూ ప్రాక్టీస్‌లోనూ, మ్యాచ్ పెర్ఫార్మెన్స్లోనూ కాంప్రమైజ్ కాకూడదు. మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనేది నా నమ్మకం. ఆడేటప్పుడు మ్యాచ్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రెషర్ తీసుకోకూడదు. ప్రతి రోజూ మన బెస్ట్ కాకపోవచ్చు. కానీ మనం అంకితభావంతో ఆడడమే మనవంతు. ఫాస్ట్ బౌలర్‌గా... ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవడం నా లక్ష్యం. – షబ్నమ్, క్రికెట్ క్రీడాకారిణి 2016లో ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన షబ్నమ్ 2019లో స్టేట్‌ని రిప్రజెంట్ చేసింది. చాలెంజర్స్ ట్రోఫీ, జడ్సీఏ, ఎన్సీఏ హై పెర్ఫార్మెన్స్ క్యాంప్, రంజీట్రోఫీలో ఒక మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న షబ్నమ్‌కి బౌలింగ్ ఇష్టం. న్యూజిలాండ్ సీరీస్‌లో మూడు వికెట్లు తీసుకుంది. ఆమె110– 115 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తుంది, బౌలింగ్‌కి 20 మీటర్స్ నుంచి రన్ అప్ తీసుకుంటుంది. క్వాడ్రాంగులర్ సీరీస్‌లో శ్రీలంక, వెస్ట్ ఇండీస్ దేశాలతో ఆడిన షబ్నమ్ నిన్నటి వరకు (డిసెంబర్ 6) టీ20 సీరీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడింది. వరల్డ్ కప్‌కి ఎంపిక అయిన సందర్భంగా ఆమె ముంబయి నుంచి సాక్షితో తన సంతోషాన్ని పంచుకుంది. ప్రాక్టీస్ మానదు షబ్నమ్ క్రికెట్ జర్నీ గురించి ఆమె తల్లి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ‘‘మా పెద్దమ్మాయి. తను రోజూ ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రాక్టీస్ చేస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ కాక ఫిట్నెస్ కోసం మరో గంట వర్కవుట్ చేస్తుంది. ఏడాదిలో 365 రోజులూ ఇదే తన డైలీ రొటీన్. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ ఆపదు. వైజాగ్, ఎన్ఏడీ అకాడమీలో మొదలైన ప్రాక్టీస్ వీడీసీఏ, ఏసీఏలో కొనసాగుతోంది. తనిప్పుడు టెన్త్ క్లాస్. షబ్నమ్ కోసం స్కూల్ వాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ సహకరిస్తున్నారు. అండర్ 19, టీ 20 వరల్డ్ కప్‌కు ఆడే అవకాశం రావడం కీలకమైన సోపానం. సీనియర్ కేటగిరీలో మనదేశం తరఫున ఆడడం తన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరడానికి మధ్య ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇక నుంచి ఇంకా దీక్షగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తనకు ఫాస్ట్ బౌలింగ్ ఇష్టం. నేను ఎంపైర్ని పిల్లలు ఏదైనా సాధించాలంటే పేరెంట్స్ సహకారం చాలా అవసరం. మేమిద్దరం డిఫెన్స్ ఉద్యోగులమే. ఆయన లీడింగ్ ఫైర్‌మ్యాన్, నేను ఆఫీస్ క్లర్క్‌ని. మా వారికి క్రికెట్ చాలా ఇష్టం. అప్పట్లో తనకు అంత సహకారం, ప్రోత్సాహం లేకపోవడంతో విశాఖపట్నానికే పరిమితమయ్యారు. పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలనే కోరిక మా వారిదే. చిన్నమ్మాయి షాజహానాబేగం కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ముగ్గురూ ప్రాక్టీస్ చేస్తుంటే ఎంపైర్‌గా వ్యవహరిస్తూ ఆటను ఎంజాయ్ చేయడం నా వంతు. మాకు వేడుకైనా, పిక్నిక్ అయినా క్రికెటే. బంధువుల ఇళ్లలో వేడుకలకు వెళ్లే అవకాశం ఉండదు. షబ్నమ్ ఎక్కడ ఆడుతుంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోతాం. మాకదే పిక్నిక్’’ అన్నారు షబ్నమ్ తల్లి ఈశ్వరమ్మ. – వాకా మంజులారెడ్డి -
పంత్ కాస్త బరువు తగ్గు
-
అందరి నోర్లు మూయించిన రిషబ్ పంత్..
-
ఆ కిక్కే వేరు.. సెంచరీపై పంత్..
-
ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?
-
రిషబ్ పంత్ ముందు మ్యాచ్ ముగించు..
-
మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): గత రెండు అండర్–19 ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా రెండుసార్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడగా రెండు సార్లూ భారత్‌నే విజయం వరించింది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో మన చేతుల్లో కంగారూలకు పరాజయం ఎదురైంది. ఈసారి సెమీఫైనల్లో ఈ రెండు టీమ్‌లు తలపడబోతున్నాయి. నేడు జరిగే ఈ కీలక పోరులో గెలిచి ముందంజ వేస్తే భారత్ వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టినట్లవు తుంది. అయితే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈ పోరులో సునాయాసంగా తలవంచుతుందా లేక గత మ్యాచ్‌లకు ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. తాజా ఫామ్ ప్రకారం చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. -
ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?
ఈరోజుతో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ముగియనున్న సంగతి మనకు తేలిసిందే. నేటి(నవంబర్ 14) ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో క్వాలిఫైయింగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి భారతదేశం నిష్క్రమించిన సంగతి తేలిసిందే. అయితే, ఇండియన్ క్రికెట్ టీమ్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటి బాట పట్టడంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్వర్క్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో సుమారు 200 కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణుల తెలిపారు. యుఏఈలో నెల రోజులగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మ్యాచ్‌లు జరిగే సమయంలో టీవీలో ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ రూ.900 కోట్లు-రూ.1,200 కోట్లు వసూలు చేయలని అంచనా వేసింది. అలాగే, స్టార్ నెట్వర్క్ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా సుమారు 250 కోట్ల రూపాయలు సంపాదించాలని చూసినట్లు ఆ సంస్థకు చెందిన కొందరు తెలిపారు. మీడియా అనుభవజ్ఞుడు మదన్ మోహపాత్ర అంచనా ప్రకారం.. భారతదేశం నిష్క్రమించడం వల్ల నెట్వర్క్ తన క్రీడా ఛానెళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15-20% కోల్పోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే వెనుకకు తీరగడంతో ఆ తర్వాత చూసే వీక్షకుల సంఖ్య తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య పెరిగిన అది అంతగా ఉండకపోవచ్చు అని అతని అభిప్రాయం. (చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?) సాధారణంగా, బ్రాడ్ కాస్టర్లు ముందుగానే క్రికెట్ టోర్నమెంట్ కోసం ప్రకటన స్లాట్లలో 80-85% బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత టీవీ ఛానెల్ మిగిలిన స్లాట్లను తెరిచి ఉంచుతుంది. తద్వారా టోర్నమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో రేట్లను పెంచేవారు. కానీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ఇప్పుడు స్పాట్ రేట్లను పెంచే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నమెంట్ ప్రారంభ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రకటన దారులు 10 సెకన్ల యాడ్ కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడి ఉంటే బ్రాడ్ కాస్టర్ 10 సెకన్ల ప్రకటనల కోసం కనీసం రూ.35 లక్షలు బ్రాడ్ కాస్టర్ సంపాదించేదని నిపుణుల అభిప్రాయం. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటికి చేరడంతో భారీగా బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోల్పోయినట్లు తెలుపుతున్నారు. -
ఆసీస్ పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్ సమయం కుదించాలి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్ సమయాన్ని కుదిస్తే బాగుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. మిగతా వాటితో పోలిస్తే ఆసీస్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను క్వారంటైన్ పేరిట రెండు వారాలపాటు హోటల్ గదులకే పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డాడు. ‘డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఖాయం. అంత దూరం వెళ్లి రెండు వారాలు హోటల్‌కే పరిమితమవ్వాలంటే ఆటగాళ్లకు చాలా నిరాశగా ఉంటుంది. మెల్బోర్న్ మినహా ఆసీస్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా లేనందున క్వారంటైన్ సమయం కుదింపునకు ప్రయత్నిస్తాం’ అని ‘దాదా’ పేర్కొన్నాడు. తమ పదవీకాలం పొడిగింపు కోసం సుప్రీం కోర్టులో బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ గురించి గంగూలీ మాట్లాడుతూ ‘మాకు కొనసాగింపు లభిస్తుందో లేదో నేను చెప్పలేను. ఒకవేళ సుప్రీంకోర్టు పొడిగింపునకు అనుమతివ్వకపోతే నేను మరో పనిలో నిమగ్నమవుతా’ అని అన్నాడు. -
ఎక్కడైనా...ఎప్పుడైనా...
భారత్ ముందు బంగ్లా బేబీనే! మూడు ఫార్మాట్లలోనూ టీమిండియానే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వన్డేల్లో అప్పుడొకటి... ఇప్పుడొకటి అన్నట్లు వేళ్లమీద లెక్కపెట్టే విజయాలు సాధించిందేమో కానీ... టెస్టులు, టి20ల్లో అయితే టీమిండియాకు ఎదురేలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతీ విభాగంలోనూ ప్రత్యర్థి కంటే భారతే బలంగా ఉండటంతో పొట్టి ఫార్మాట్లో ఎక్కడైనా... ఎప్పుడైనా... ఇంటాబయటా బంగ్లాపై టీమిండియానే గెలుస్తూ వచ్చింది. సాక్షి క్రీడావిభాగం: క్రికెట్ ప్రపంచంలో ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్ కంటే భారతే మెరుగైన జట్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, అనుభవజ్ఞులైన పేస్ దళం, నాణ్యమైన స్పిన్నర్లు ఇలా తుది 11 మందిదాకా భారత్ ప్రత్యర్థి కంటే ఎంతో దుర్బేధ్యమైంది. ప్రస్తుత జట్టులో విశ్రాంతి వల్ల రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడే అందుబాటులో లేడు. కానీ అతడి వెన్నంటే నిలిచిన యావత్ జట్టంతా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సమరానికి సై అంటోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయవంతమైన కెప్టెన్‌గా ‘హిట్‌మ్యాన్’ ఘనతకెక్కాడు. పైగా ఇప్పుడు జరగబోయేది టి20 పోరే కాబట్టి అతని సారథ్య బాధ్యతలకు, ఓపెనింగ్‌కు ఇది తెలిసొచ్చిన పనే తప్ప అదనపు భారం కానేకాదు. సమస్యల్లో బంగ్లా... మేటి జట్టు భారత్‌తో సిరీస్‌కు సమాయత్తం అవుతుండగానే బంగ్లా క్రికెట్లో ముసలం రేగింది. పర్యటనకు కొన్ని రోజుల వ్యవధే ఉండగా ఆటగాళ్లంతా ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. తమ కాంట్రాక్టు ఫీజులు పెంచకపోతే ఏ రకమైన క్రికెట్ అడేది లేదని బోర్డు (బీసీబీ)తో తెగేసి చెప్పారు. చివరకు ఒప్పించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగా... మేటి ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేటు వేసింది. బుకీలు అతన్ని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెప్పలేదని రెండేళ్ల నిషేధం విధించింది. ఎంతో అనుభవజ్ఞుడైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కీలకమైన సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. షకీబ్ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అసాధారణంగా రాణించాడు. అలాంటి ఆటగాడు లేని జట్టు భారత్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సమరోత్సాహంతో రోహిత్ సేన... సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో టి20 మెరుపులు మెరిపించేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. అనుభవజ్ఞులైన రోహిత్–శిఖర్ ఓపెనింగ్ జోడీకి సత్తాగల కుర్రాళ్లు శ్రేయస్, మనీశ్, రిషభ్, సంజూ సామ్సన్, కృనాల్ పాండ్యాలు జతయ్యారు. వీళ్లంతా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సీనియర్ సీమర్లు లేకపోయినా శార్దుల్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్‌లు అందివచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. తిప్పేసేందుకు మణికట్టు స్పిన్నర్ చహల్ ఉన్నాడు. దీంతో భారత్ పేస్, స్పిన్ అటాక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలదు. ఆడినవన్నీ భారతే గెలిచింది... ఇరు జట్ల మధ్య ఈ పదేళ్లలో 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్ మొదలు ఆసియా కప్, గతేడాది నిదహాస్ ట్రోఫీ దాకా బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా ఏ దేశమైనా ... ఎప్పుడైనా భారత్‌దే విజయం. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలిచింది. దీంతో ఈ ఫార్మాట్లో భారత్ ప్రత్యర్థిపై ఎదురులేని రికార్డును కలిగి ఉంది. -
ఇండియా రికార్డు బద్దలు
నాటింగ్‌హామ్: గతంలో వన్డేల్లో 300 పరుగులను చేధించడమంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం 300 లక్ష్యం అనేది చాలా చిన్న విషయంలా మారిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా సాధించింది. మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించగా అది కాస్త ఇప్పుడు కనుమరుగైంది. -
ఆటనే కాదు...మనసులూ గెలవండి...
సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు 2004లో పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆటనే కాదు. మనసులూ గెలవండి’ అని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్‌ను జట్టుకు బహూకరించి బెస్ట్ విషెస్ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటనలో భారత్ టెస్టు సిరీస్‌ను 2–1తో, వన్డే సిరీస్‌ను 3–2తో గెలుచుకుంది. -
క్రికెట్ : భారత్, పాక్ ముఖాముఖి పోరు!
దుబాయ్ : దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ మజాను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్‌లు తలపడుతున్నాయి. గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. అసలు సిసలు ఫైనల్ మ్యాచ్‌లో పాక్ నెగ్గి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అలాంటి ఉత్కంఠకర మ్యాచ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. క్రికెట్ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన భారత్,పాక్ జట్లు ముఖా ముఖి పోరుకు సిద్దమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల ప్రాతినిథ్యం ఖరారు కాగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్లు పోటీపడనున్నాయి. సెప్టంబర్ 18న భారత్, క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 19న దాయాదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు గ్రూప్‌లు విభజించగా.. ఒక్కో గ్రూపులో మూడు జట్లు తలపడగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. -
‘300 మ్యాచ్‌లు ఆడాను.. నేను పిచ్చోడినా’
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఎంతో కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంటారు. అందుచేత ధోనిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. వికెట్ల ముందు బ్యాట్‌కు పని చెప్పి.. వికెట్ల వెనుక ఉండి జట్టును ముందుకు నడపటంలో తనవంతు కృషి చేస్తుంటారు. బౌలర్లకు తగిన సూచనలు ఇచ్చి, ఫిల్డింగ్ సెట్ చేస్తూ మైదానంలో చాలా కూల్‌గా ఉంటారు. ఈ మిస్టర్ కూల్ ఓ సారి చైనామన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ఫైర్ అయ్యారు. ఈ సంఘటన భారత్-శ్రీలంకల మధ్య గత సంవత్సరం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల భారత్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, చాహాల్ ఓ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ధోనితో ఉన్న అనుభవాల్ని పంచుకున్నారు. బౌలింగ్ చేస్తున్న సమయంలో తగిన సూచనలు ఇస్తారని ధోనిని కొనియాడారు. ఈ సందర్భంగా కుల్దీప్ ధోని తనపై కోపం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.‘గత సంవత్సరం ఇండోర్‌లో భారత్- శ్రీలంకల మధ్య రెండో టీ-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ టీ20లో మొదట ఇండియా బ్యాటింగ్ చేసింది. 261 పరుగుల లక్ష్యఛేదనతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. అంతేకాక చాలా ఈజీగా లంక ఆటగాళ్లు స్కోర్ బోర్డును పరిగెత్తిస్తున్నారు. ఈ తరుణంలో బంతి నా(కుల్దీప్) చేతికి ఇచ్చారు. ఓ వైపు ఆటగాళ్లు దాటిగా ఆడుతున్నారు. నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ సులువుగా బౌండరీలు కొడుతున్నారు. ఆ సమయంలో ధోని భాయ్ నా దగ్గరకు వచ్చి.. బంతిని బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వేయాలని, అంతేకాక ఫీల్డింగ్ మార్చుకోమని సూచించారు. నేను అప్పుడు ఏం ఫర్వాలేదు ధోని భాయ్ అన్నాను. అంతే ఒక్కసారిగా కోపంతో ధోని.. 300 మ్యాచ్‌లు ఆడాను. నేను ఏమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నాన్నా అని ఆవేశానికి గురయ్యారు. అనంతరం ధోని చెప్పినట్లు బౌలింగ్ చేసి వికెట్ సాధించాను. అప్పుడు ధోని భాయ్ నా దగ్గరకు వచ్చి నేను మొదట నుంచి చెప్పింది ఇదే కదా అన్నాడని’ యాదవ్ ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్యాదవ్ నాలుగు ఓవర్లు వేసి.. 52 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు సాధించారు. చాహాల్ కూడా నాలుగు వికెట్లు తీశారు. అంతేకాక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. కేవలం 35 బంతుల్లో రోహిత్ శర్మ ఫాస్టెస్ సెంచరీ నమోదు చేశారు. ఈ టీ20లో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక ఈ మ్యాచ్‌లో 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. -
వన్డే సిరీస్ భారత్ సొంతం
-
ద్రవిడ్ బాయ్స్.. అదుర్స్!
క్రైస్ట్‌చర్చ్: రాహుల్ ద్రవిడ్ శిక్షణలో యువ టీమిండియా అద్భుతాలు చేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భారీ విజయాలు నమోదు చేయడం యువ భారత్ సత్తాకు సిసలైన నిదర్శనంగా నిలిచింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాటుదేలిన యువ క్రికెటర్లు అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మక టోర్నిలో దేశానికి తిరుగులేని విజయాలు అందించారు. సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. తుది సమరంలోనూ జోరు కొనసాగించి విజేతగా నిలవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది. అండర్–19 తాజా ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన యంగ్ ఇండియా అన్నింటిలోనూ భారీ విజయాలు సాధించింది. వందకు పైగా పరుగుల తేడాతో మూడు, 10 వికెట్ల తేడాతో రెండుసార్లు విజయదుందుభి మోగించింది. యువ భారత్ గెలిచిందిలా... ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపు పపువా న్యూ గునియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయకేతనం మూడో వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 131 పరుగుల తేడాతో విక్టరీ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 203 పరుగుల తేడాతో విజయదుందుభి -
‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటనే అసలైన పరీక్షా అని భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా అయినా కోహ్లి సత్తా ఏంటో ఈ సిరీస్‌లో తెలుస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధూపై బిషన్ సింగ్ బేడి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ దిగ్గజాలకు సింధూ గట్టి పోటీనిచ్చిందని కొనియాడారు. ఈ ఒలింపిక్ పతాక విజేత ఇప్పటికే తన సత్తాను చాటిందన్నారు. సింధూలా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి కోహ్లి ఇబ్బంది పడవచ్చన్నారు. దిగ్గజ జట్టైన దక్షిణాఫ్రికాతో కోహ్లి సేనకు గట్టిపోటీ ఎదురవ్వనుందని తెలిపారు. -
మరింతగా టి20 విందు
న్యూఢిల్లీ: క్రికెటర్లేమో ‘మేం రోబోలం కాదు. మాకూ విశ్రాంతి కావాలి’ అంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆదాయం కావాలంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్కువ ర్యాంకు జట్లతో టీమిండియా మ్యాచ్‌లను కుదించింది. పోటీ జట్లతోనే సిరీస్‌లకు పచ్చ జెండా ఊపింది. 2019 నుంచి 2023 వరకు సంబంధించిన కొత్త ఎఫ్టీపీలో మూడు ఫార్మాట్లలో టీమిండియా ఇంటా బయటా కలిపి 158 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భారత గడ్డపైనే 81 మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. టి20ల సంఖ్యను అనూహ్యంగా పెంచారు. ఈ ఫార్మాట్లో 54 మ్యాచ్‌లను చేర్చారు.గత ఎఫ్టీపీతో పోలిస్తే 30 (స్వదేశంలో) మ్యాచ్‌లు పెరిగాయి. ఇక ఐపీఎల్లో రద్దయిన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీపై న్యాయ పోరాటం చేసేందుకే బోర్డు సిద్ధపడింది. ఆ ఫ్రాంచైజీకి రూ. 850 కోట్ల చెల్లింపుపై కోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపింది. డోప్ టెస్టులపై ‘నాడా’ గొడుగు కిందకి వచ్చేందుకు నిరాకరించింది. అధికారికంగా టెస్టు హోదా పొందిన అఫ్ఘానిస్తాన్ జట్టుతో 2019లో భారత్ తొలి టెస్టు ఆడనుంది. మ్యాచ్‌లు ఎక్కువ... మైదానంలో తక్కువ ఇదేంటి... మ్యాచ్‌ల సంఖ్య పెరిగినప్పుడు సహజంగా ఆడే రోజులు పెరుగుతాయనుకుంటే పొరపాటే! ఎందుకంటే మ్యాచ్‌ల శాతం పెరిగినా... కేవలం పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌ల వల్ల సొంతగడ్డపై భారత ఆటగాళ్లు ఎక్కువ ఆడినా మైదానంలో గడిపేది తక్కువ రోజులే! దీంతో ఒక టెస్టు కోసం ఐదు రోజుల స్టేడియంలో ఆడితే... టి20 కోసం ఒక పూట ఆడితే సరిపోతుంది. దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ‘ముందనుకున్న ప్రతిపాదిత ఎఫ్టీపీలో భారత్‌లో 51 మ్యాచ్‌లుంటే ఇప్పుడు ఈ సంఖ్య 81కి పెరిగింది. అయితే 60 శాతం మ్యాచ్‌లు పెరిగినా... 20 శాతం తక్కువగా మైదానంలో శ్రమిస్తారు’ అని అన్నారు. బ్రాడ్‌కాస్టింగ్‌తో మరో భారీ డీల్ ప్రస్తుత ఎఫ్టీపీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2021), వన్డే ప్రపంచకప్ (2023) మ్యాచ్‌లు భాగం కావని చౌదరి చెప్పారు. ఈ రెండు మెగా ఈవెంట్లకు భారతే ఆతిథ్యమివ్వనుంది. ఇవి కాకుండానే ఆడే 158 మ్యాచ్‌లతో బోర్డుకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసాధారణ మొత్తం రానుంది. స్టార్ స్పోర్ట్స్‌తో ప్రస్తుత ఒప్పందం 2018 మార్చిలో ముగియనుంది. వచ్చే ఏడాది వేలంలో మరో రూ. 10 వేల కోట్లు రావొచ్చని బోర్డు అంచనా వేస్తోంది. -
టి20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా
-
ఐలాండ్‌లో ఇండియన్ టీమ్
-
వీళ్లతో గెలుస్తామా..?
అశ్విన్ మినహా బౌలర్లంతా పేలవం టి20 ప్రపంచ కప్ ముంగిట ఇబ్బంది ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ ఒక్క బౌలర్‌తోనే ఆడుతోంది..! అతిశయోక్తిలా అనిపించినా వాస్తవం ఇలాగే ఉంది. ఒక్క అశ్విన్‌ను మినహాయిస్తే మిగిలిన నలుగురు బౌలర్లూ దారుణంగా తేలిపోయారు. వీళ్లకంటే స్కూల్ పిల్లలు నయమనే తరహాలో బౌలింగ్ చేస్తూ... టి20 ఫార్మాట్లో మన బౌలింగ్ స్థాయి ఎక్కడుందో చూపించారు. ఆరు నెలల్లో స్వదేశంలోనే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలా గెలుస్తారనేదే ప్రశ్న. సాక్షి క్రీడా విభాగం కటక్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 20 ఏళ్ల దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ 140 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ... అడపా దడపా 150 కి.మీ.ని దాటి బంతులు విసిరాడు. ఇక బౌన్స్ ఉన్న ధర్మశాలలో అయితే అతని బంతులను అందుకునేందుకు కీపర్ డివిలి యర్స్ చాలా సార్లు ఆకాశాన్ని అందుకోవాలా అన్నట్లుగా ఎగరాల్సి వచ్చింది. పలు సార్లు చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రబడ అంపైర్ హెచ్చరికకు కూడా గురయ్యాడు. అదే మన పేసర్లు భువనేశ్వర్, మోహిత్, అరవింద్ కలిసి ఒక్కటంటే ఒక్క బౌన్సర్ కూడా వేసింది లేదు! ఆశ్చర్యమే అనిపిస్తున్నా మనోళ్ల పేస్ అంటే నేతి బీరకాయలో నేయి చందమే. కచ్చితంగా వికెట్ దక్కాల్సిన అవసరం లేదు కానీ.... 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఇలాంటి పరుగు రాని బంతుల విలువ ఎక్కువే ఉంటుంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో నెట్టేందుకు ఇవి చాలు. స్టార్ బౌలర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ లేకుండా దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి పేసర్లు కూడా ప్రభావం చూపిస్తున్న చోట మనోళ్లు తేలిపోతున్నారు. ఉమేశ్ పనికి రాడా..?‘మా ఫాస్ట్ బౌలర్లపై విశ్వాసం కోల్పోలేదు. సిరీస్ జరుగుతున్న పిచ్‌లను బట్టి జట్టును ఎంపిక చేశాం. ఇషాంత్ పేరు కూడా చర్చించాం. అతడు టెస్టులకే పరిమితం కాదు’... టి20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వ్యాఖ్య ఇది. అయితే ఈ లాజిక్‌లో అర్థం లేకపోవడంతో పాటు గందరగోళం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అందుబాటులో ఉన్న (ఫిట్నెస్ సమస్యలు లేకుండా) అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ సిరీస్‌లో ఉన్న భువీ, మోహిత్, అరవింద్ ఒకే తరహాలో బౌలింగ్ చేసే సాధారణ మీడియం పేసర్లు. ఎక్కువగా స్వింగ్‌పై ఆధారపడేవారే. తమ వేగంతో ఫలితం రాబట్టగల సామర్థ్యం వీరిలో లేదు. అలాంటప్పుడు ఒక ఫుల్‌లెంగ్త్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండాలి. ఉమేశ్ చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ సభ్యుడు. వరల్డ్ కప్‌లో చాలా బాగా రాణించాడు. దీనికి ముందు శ్రీలంక సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్‌లు అని పేరు లేకపోయినా... ఇషాంత్, ఆరోన్ తమ వేగంతో బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకు రాగలరు. వీరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా కనీస కారణం సెలక్టర్లు చెప్పలేకపోయారు. స్పిన్నర్లు ఎక్కడ? మన దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు అంటూ అధ్యక్షుడిగా వచ్చీ రాగానే శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడం ఒక రకంగా అవమానకర విషయం. జడేజాకు ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన అక్షర్ పటేల్ సాధారణంగా కనిపిస్తున్నాడు. ‘స్పిన్‌లో వైవిధ్యం చూపించని అక్షర్ అతి సాధారణ బౌలర్. సులువుగా అతడి బంతులను బ్యాట్స్‌మెన్ అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ బౌలర్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని గవాస్కర్ విమర్శించడం పరిస్థితిని సూచిస్తోంది. బహుశా దీని వల్లే డుమిని తొలి టి20లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ దిశను మార్చాడు. సోమవారం మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టి రైనాతో పూర్తి కోటా వేయించడం చూస్తే రెగ్యులర్ స్పిన్నర్ల స్థితి అర్థమవుతుంది. గత రెండేళ్లుగా అశ్విన్ ఎంతో ఎదిగిపోగా... రెండో స్పిన్నర్‌గా ఎవరూ ప్రభావం చూపడం లేదు. కెరీర్ చివర్లో ఉన్న హర్భజన్ వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. మిశ్రా, కరణ్ శర్మలకు పూర్తి స్థాయి అవకాశాలే రాలేదు. పరీక్ష ఎప్పటి వరకు ప్రపంచకప్‌లోగా టి20 మ్యాచ్‌ల్లో ఫలితాలకంటే అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించడం, అందరికీ అవకాశం ఇవ్వడం ముఖ్యమని కెప్టెన్ ధోని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా వెళ్లి 5 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్కడ టి20లు ఆడటం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీల తరఫున చెలరేగే బౌలర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం తేలిపోతున్నారు. మోహిత్, భువీ, అక్షర్... ఎవరైనా అంతే. పరిస్థితి చూస్తే అరవింద్ కెరీర్ ఒక్క మ్యాచ్‌కే ముగిసిపోతుందేమోఅనిపిస్తుంది. అలాంటప్పుడు వరల్డ్ కప్‌లోగా ఎంత మందిని పరీక్షిస్తారు, చివరకు ఎలాంటి జట్టుతో సిద్ధమవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న బృందంతో మాత్రం భారత్ మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం. -
ప్రదర్శనను బట్టి ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఈవెంట్ గెలిచినప్పుడు బీసీసీఐ అప్పటికప్పుడు పెద్ద మొత్తంలో ఆటగాళ్లకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇకపై ప్రతి సిరీస్ లేదా టోర్నీకి దీనిని అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ ముందుగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం సొంతగడ్డపై గెలిచే సిరీస్‌లు, ఆటగాళ్ల పరుగులు, వికెట్లు, ఆ తర్వాత విదేశాల్లో విజయాలు... ఇలా ప్రదర్శన స్థాయిని బట్టి ప్రతీదానికీ నిర్దేశిత మొత్తాన్ని మ్యాచ్ ఫీజుతో పాటు ఆటగాళ్లకు అదనంగా అందిస్తారు. ప్రత్యర్థి, ఆడిన వేదిక, పరిస్థితులను కూడా ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటారు. బోర్డు ఫైనాన్స్ కమిటీ దీనికి ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నెల 22న దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘ఎ’ గ్రేడ్‌లో మిథాలీరాజ్... మరోవైపు మహిళా క్రికెటర్లను ఎ, బి గ్రేడ్లుగా విభజిస్తూ ఫైనాన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న మిథాలీరాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున, ‘బి’ గ్రేడ్‌లోని ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 లక్షల చొప్పున వార్షిక ఫీజు రూపంలో చెల్లిస్తుంది. -
ధోని కేసు 13కు వాయిదా
అనంతపురం లీగల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనిని మహావిష్ణువుగా చిత్రీకరిస్తూ బిజినెస్ టుడే కవర్‌పేజీపై ప్రచురించిన కేసును అనంతపురం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయ స్థానం ఈనెల 13కు వాయిదా వేసింది. బిజినెస్ టుడే మేగజైన్ తరఫు న్యాయవాది యజ్ఞదత్ దాఖలు చేసిన లిఖిత పూర్వక సమాధానాలపై మంగళవారం వాదనలు జరగాల్సి ఉంది. కానీ సమయం లేకపోవడంతో విచారణ చేపట్టలేకపోయిన న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాలరావు, ధోని తరఫు న్యాయవాది ఎం.విష్ణువర్ధన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.