కూలిడ్జ్ (ఆంటిగ్వా): గత రెండు అండర్–19 ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా రెండుసార్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడగా రెండు సార్లూ భారత్‌నే విజయం వరించింది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో మన చేతుల్లో కంగారూలకు పరాజయం ఎదురైంది. ఈసారి సెమీఫైనల్లో ఈ రెండు టీమ్‌లు తలపడబోతున్నాయి.
నేడు జరిగే ఈ కీలక పోరులో గెలిచి ముందంజ వేస్తే భారత్ వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టినట్లవు తుంది. అయితే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈ పోరులో సునాయాసంగా తలవంచుతుందా లేక గత మ్యాచ్‌లకు ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. తాజా ఫామ్ ప్రకారం చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment