ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment