Ranji champion
-
సెమీస్‌కు చేరువలో ఆంధ్ర..
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు. -
ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
గ్వాలియర్: ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో ఆదివారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు తీయగా... ముకేశ్ కుమార్, అతీత్, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు. ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే -
విదర్భ 245/6
నాగ్‌పూర్: రంజీ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాపై పైచేయి సాధించేందుకు పోరాడుతోంది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే కట్టడి చేసి, రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ ఫైజ్ ఫజల్ (27), సంజయ్ రామస్వామి (166 బంతుల్లో 65; 9 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గణేశ్ సతీష్ (105 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... రెస్టాఫ్ ఇండియా బౌలర్లు కృష్ణప్ప గౌతమ్ (2/33), ధర్మేంద్ర జడేజా (2/66) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి విదర్భకు కళ్లెం వేశారు. కీలక సమయంలో యువ ఆటగాడు అథర్వ తైడె (15), మోహిత్ కాలె (1)లను స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి దెబ్బకొట్టారు. 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (96 బంతుల్లో 50 బ్యాటింగ్; 9 ఫోర్లు) అండగా నిలిచాడు. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (18), అక్షయ్ కర్నెవర్ (15 బ్యాటింగ్) తోడుగా జట్టు స్కోరును 200 దాటించాడు. దీంతో 245/6తో విదర్భ రోజును ముగించింది. రెస్టాఫ్ ఇండియా స్కోరుకు విదర్భ మరో 85 పరుగులు వెనుకబడి ఉంది. లోయరార్డర్ బ్యాటింగ్ ప్రతిభతోనే రంజీ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు... ఈసారి ఏం చేస్తుందో చూడాలి. మూడు రోజుల ఆట ఉన్నందున ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. -
ముంబై బెంబేలు
44 పరుగులకే ఆలౌటైన 40 సార్లు రంజీ చాంపియన్ కర్ణాటకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఒకే రోజులో 22 వికెట్లు బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుది తిరుగులేని రికార్డు. ఏకంగా 40 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ఘన చరిత్ర కలిగిన దిగ్గజ జట్టు ఈసారి సెమీస్‌లో బెంబేలెత్తింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 44 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో 1977లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగులకే ఆలౌటయింది. అయితే ముంబైతో పాటు కర్ణాటక బ్యాట్స్‌మెన్ కూడా తడబడటంతో... తొలి రోజు బుధవారం ఏకంగా 22 వికెట్లు పడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటయింది. రాబిన్ ఉతప్ప (68) టాప్ స్కోరర్. కరుణ్ నాయర్ (49), మనీష్ పాండే (34) రాణించారు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసిన ఆనందం ముంబైకి మిగల్లేదు. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఊహించని విధంగా కేవలం 15.3 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటయింది. శ్రేయస్ అయ్యర్ (15), సూర్యకుమార్ (12) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ (6/20) సంచలన పేస్ బౌలింగ్‌తో ముంబైని వణికించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక 5 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసింది. ప్రస్తుతం కర్ణాటక ఓవరాల్‌గా 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. తమిళనాడు 192/3 కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో మహారాష్ట్రతో జరుగుతున్న సెమీస్‌లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (56 బ్యాటింగ్), దినేశ్ కార్తీక్ (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.